Tuesday, September 25, 2007

దొంగ రాముడు--1955::సింధుభైరవి::రాగం






సంగీతం::పెండ్యాల
రచన::సముద్రాల
గానం::జిక్కి


సింధుభైరవి::రాగం


రావోయి మా యింటికి
రావోయి మా ఇంటికి మావా
మాటున్నది మంచి మాటున్నది
రావోయి మా ఇంటికి..మావోయ్
మాటున్నది మంచి మాటున్నది

నిలుసుంటె నిమ్మచెట్టు నీడున్నది
నువు కూసుంటే కుర్చీల పీటున్నది
నువ్వు తొంగోంటే పట్టెమంచం పరుపున్నది
మాటున్నది మంచి మాటున్నది
రావోయి మా ఇంటికి..మావోయ్
మాటున్నది మంచి మాటున్నది

ఆకలేస్తే సన్నబియ్యం కూడున్నది
అందులోకి అరకోడి కూరున్నది
ఆపైన రొయ్యపొట్టు చారున్నదీ
మాటున్నది మంచి మాటున్నది
రావోయి మా ఇంటికి..మావోయ్
మాటున్నది మంచి మాటున్నది

రంజైన మీగడ పెరుగున్నది
నంజుకోను ఆవకాయ ముక్కున్నది
నీకు రోగమొస్తే ఘాటైన మందున్నదీ
మాటున్నది మంచి మాటున్నది
రావోయి మా ఇంటికి..మావోయ్
మాటున్నది మంచి మాటున్నది

దొంగ రాముడు--1955::యదుకుల కాంభోజి::రాగం

















సంగీతం::పెండ్యల
రచన::JR.సముద్రాల
గానం::జిక్కి
యదుకుల కాంభోజి::రాగం

అందచందాల సొగసరి వాడు
అందచందాల సొగసరి వాడు
విందు భోంచేయ వస్తాడు నేడు
చందమామా ఓహో..చందమామా
చందమామా ఓహో..చందమామా
ఓ....

ఓ...చూడ చూడంగ మనసగు వాడు
ఈడు జోడైన వలపులరేడు
ఓ..వాడు నీకన్న సోకైన వాడు
విందు భోంచేయ వస్తాడు నేడు
చందమామా ఓహో..చందమామా
చందమామా ఓహో..చందమామా
ఓ....

ఓ...వాని కన్నుల్లో వెన్నెల జాలు
వాని నవ్వుల్లో ముత్యాలు రాలు
ఓ..వాడు నీకన్న చల్లని వాడు
విందు భోంచేయ వస్తాడు నేడు
చందమామా ఓహో..చందమామా
చందమామా ఓహో..చందమామా
ఓ....

ఓ...మేటి పోటిల్లో గడుసరి వాడు
మాటపాటించు మగసిరి వాడు
ఓ..వాడు నీకన్న సిరిగలవాడు
విందు భోంచేయ వస్తాడు నేడు
చందమామా ఓహో..చందమామా
చందమామా ఓహో..చందమామా
అందచందాల..
అందచందాల సొగసరి వాడు
అందచందాల సొగసరి వాడు
విందు భోంచేయ వస్తాడు నేడు
చందమామా ఓహో..చందమామా
చందమామా ఓహో..చందమామా

దొంగ రాముడు--1955:::ఆభేరి::రాగం

















సంగీతం::పెండ్యాల
రచన::సముద్రాల
గానం::ఘంటసాల,P.సుశీల

రాగం::: ఆభేరి ::::


ఓ...చిగురాకులలో చిలకమ్మా
చిన్న మాట వినరావమ్మా
ఓ...మరుమల్లెలలో మామయ్యా
మంచి మాట సెలవీవయ్యా

పున్నమి వెన్నెల గిలిగింతలకు
పూచిన మల్లెల మురిపాలు
నీ చిరునవ్వుకు సరికావమ్మా
ఓ....ఓ.....
ఓ..చిగురాకులలో చిలకమ్మా

ఎవరన్నారో ఈ మాట
వింటున్నాను నీ నోట
తెలిసీ పలికిన విలువేల
ఆ...ఆ...ఆ..
ఓ...మరుమల్లెలలో మామయ్యా ...

వలచే కోమలి వయ్యారాలకు
తలచే మనసుల తియ్యదనాలకు
కలవా విలువలు సెలవీయా
ఓ...ఓ...ఓ....
చిగురాకులలో చిలకమ్మా ...
పై మెరుగులకే భ్రమ పడకయ్యా
మనసే మాయని సొగసయ్యా
గుణమే తరగని ధనమయ్యా
మ్మ్..మ్మ్..మ్మ్...
ఓ...చిగురాకులలో చిలకమ్మా
చిన్న మాట వినరావమ్మా
ఓ...మరుమల్లెలలో మామయ్యా
మంచి మాట సెలవీవయ్యా

దొంగ రాముడు--1955::అభేరి:: రాగం (నట భైరవి::రాగం )





సంగీతం::పెండ్యల నాగేశ్వర రావ్
రచన::సముద్రాల
గానం::P.సుశీల

అభేరి:: రాగం (నట భైరవి::రాగం )
అసావేరి హిందుస్తాని !!

ఆ ఆఅ ఆఆ
అనురాగము విరిసేనా ఓ రే రాజా
అనుతాపము తీరేనా
విను వీధినేలే రాజువే నిరుపేద చెలిపై మనసౌనా

!! అనురాగము విరిసేనా !!

నిలిచేవో మొయిలో మాటునా పిలిచేవో కనులా గీటునా
నిలిచేవో మొయిలో మాటునా పిలిచేవో కనులా గీటునా
పులకించు నాదు డెందము ఏ నాటి ప్రేమాబంధము

!! ఓ రే రాజా....
అనురాగం విరిసేనా !!

మును సాగే మొహాలేమో వెనుకాడే సందేహాలేమో
మును సాగే మొహాలేమో వెనుకాడే సందేహాలేమో
నీ మనసేమో తేటగా తెనిగించవయ్య మహరాజా

!! ఓ రే రాజా
అనురగము విరిసేనా !!