Monday, May 28, 2007

ముద్దుల కొడుకు--1979



సంగీతం::K.V.మహదేవన్
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::అక్కినేని,మురళీమోహన్,జయసుధ,శ్రీదేవి,గిరిజ,జయమాలిని
పల్లవి::

ANR::
చిటపట చినుకుల మేళం..తడిపొడి తపనల తాళం
చిటపట చినుకుల మేళం..తడిపొడి తపనల తాళం
జోరు మీద మోగింది..జోడు సన్నాయి మేళం
జోరు మీద మోగింది..జోడు సన్నాయి మేళం
అందమైన అనుభవాలకు..ఇదే ఆది తాళం

శ్రీదేవి::

చిటపట చినుకుల మేళం..తడిపొడి తపనల తాళం
చిటపట చినుకుల మేళం..తడిపొడి తపనల తాళం
జోరు మీద మోగింది..జోడు సన్నాయి మేళం
జోరు మీద మోగింది..జోడు సన్నాయి మేళం
అందమైన అనుభవాలకు..ఇదే ఆది తాళం
చిటపట చినుకుల మేళం..తడిపొడి తపనల తాళం

చరణం::1

ANR::

వాన చినుకు కాటేస్తే..వయసు నిన్ను వాటేస్తే
వలపుటేరు పోటొస్తే..వరద గట్లు తెగుతుంటే
వాన చినుకు కాటేస్తే..వయసు నిన్ను వాటేస్తే
వలపుటేరు పోటొస్తే..వరద గట్లు తెగుతుంటే

శ్రీదేవి::
ముద్దముద్దగా తడిసి..ముద్దుముద్దుగా కలిసి
ముద్దముద్దగా తడిసి..ముద్దుముద్దుగా కలిసి
ఇద్దరమా ఒక్కదనం..ఇచ్చిపుచ్చుకుంటుంటే

శ్రీదేవి::తహతహ తహతహ తహతహలో
ANR::తహతహ తహతహ తహతహలో

శ్రీదేవి::
చిటపట చినుకుల మేళం..తడిపొడి తపనల తాళం
ANR::
చిటపట చినుకుల మేళం..తడిపొడి తపనల తాళం

చరణం::2

ANR::

వడగళ్ళ వానలో..వడగాలి దెబ్బలు
మనసున్న కళ్ళకే..మసకేసే మబ్బులు
వడగళ్ళ వానలో..వడగాలి దెబ్బలు
మనసున్న కళ్ళకే..మసకేసే మబ్బులు

శ్రీదేవి::
బిగిసే కౌగిళ్ళలో..ఒకటే తబ్బిబ్బులు..హాయ్
బిగిసే కౌగిళ్ళలో..ఒకటే తబ్బిబ్బులు
వయసున్న వాళ్ళకే..వల్లమాలిన జబ్బులు

శ్రీదేవి::తహతహ తహతహ తహతహలో
ANR::తహతహ తహతహ తహతహలో

శ్రీదేవి::
చిటపట చినుకుల మేళం..తడిపొడి తపనల తాళం
ANR::
ఆఆఆ..చిటపట చినుకుల మేళం..తడిపొడి తపనల తాళం

చరణం::3

ANR::
చలి మంటై సెగపెడుతుంటే..చెలి జంటై సగమౌతుంటే
చలి మంటై సెగపెడుతుంటే..చెలి జంటై సగమౌతుంటే
మన కోసం ప్రతి మాసం..మాఘమాసమై పోతుంటే

శ్రీదేవి::
మన ఇద్దరి మధ్యన ఏదో..హద్దు వద్దు వద్దంటుంటే
మన ఇద్దరి మధ్యన ఏదో..హద్దు వద్దు వద్దంటుంటే
ఈ వద్దుకు అర్ధం మారి..మన హద్దులు రద్దౌతుంటే

ANR::తహతహ తహతహ తహతహలో
శ్రీదేవి::తహతహ తహతహ తహతహలో

ANR::
చిటపట చినుకుల మేళం..తడిపొడి తపనల తాళం
శ్రీదేవి::
జోరుమీద మోగింది..జోడు సన్నాయి మేళం
అందమైన అనుభవాలకు..ఇదే ఆది తాళం

ANR::
చిటపట చినుకుల మేళం..తడిపొడి తపనల తాళం
ఇద్దరు::
చిటపట చినుకుల మేళం..తడిపొడి తపనల తాళం