Wednesday, April 01, 2009

బంగారు కలలు--1974



సంగీతం::S. రాజేశ్వరరావు
రచన::దాశరథి
గానం::P.సుశీల, V.రామకృష్ణ
తారాగణం::అక్కినేని,లక్ష్మి,వహీదా రెహమాన్ ( హిందీ తార), ఎస్.వి.రంగారావు

పల్లవి::

నీ కన్నులలో నే చూశానులే 
నీ కన్నులలో నే చూశానులే..అది నా రూపమే
అందుకనే యిద్దరిదీ వీడని బంధం..ఈ అనుబంధం

నా హృదయంలో నే దాచానులే..అది నీ రూపమే
అందుకనే యిద్దరిదీ వీడని బంధం..ఈ అనుబంధం  

చరణం::1

పున్నమి వెన్నెలలో..కన్నులు కలిపావూ
చిటపట చినుకులలో..చెంతకు చేరావూ
పున్నమి వెన్నెలలో..కన్నులు కలిపావూ
చిటపట చినుకులలో..చెంతకు చేరావూ
చలి చలి గాలులలో..వలపులు రేపావు
అందుకనే తొందరగా మెడలో తాళి..మెరిపించాలి

నా హృదయంలో నే దాచానులే..అది నీ రూపమే
అందుకనే యిద్దరిదీ వీడని బంధం..ఈ అనుబంధం 

చరణం::2

అల్లరి చూపులతో..ఆశలు పెంచావూ
చల్లని మాటలతో..మల్లెలు చల్లావూ
అల్లరి చూపులతో..ఆశలు పెంచావూ
చల్లని మాటలతో..మల్లెలు చల్లావూ
తీయని నవ్వులతో..తేనెలు చిందావూ
అందుకనే తొందరగా..ఆలూ మగలం..అయితే అందం     

నీ కన్నులలో నే చూశానులే..అది నా రూపమే
అందుకనే యిద్దరిదీ వీడని బంధం..ఈ అనుబంధం

నా హృదయంలో నే దాచానులే..అది నీ రూపమే
అందుకనే యిద్దరిదీ వీడని బంధం..ఈ అనుబంధం