Saturday, July 25, 2015

జయభేరి--1959



సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు 
రచ::శ్రీశ్రీ 
గానం::ఘంటసాల 
తారాగణం::అక్కినేని,అంజలీదేవి,S.V.రంగారావు,నాగయ్య,గుమ్మడి,శాంతకుమారి.

పల్లవి:: 

అధికులనీ..అధములని 
నరుని..దృష్టిలోనే భేదాలు 
శివుని దృష్టిలో..అంతా సమానురే
ఏ..ఏ..ఏ..ఏ..ఏ..ఏ..ఏ..ఏ..ఏ..ఏ..ఏ 

నందుని చరితము వినుమా..ఆ..ఆ..ఆ..ఆ
పరమానందము గనుమా..ఆ..ఆ..ఆ..ఆ 
పరమానందము గనుమా..ఆ..ఆ..ఆ 
నందుని చరితము వినుమా..ఆ..ఆ..ఆ..ఆ 
పరమానందము గనుమా..ఆ..ఆ..ఆ..ఆ 
పరమానందము గనుమా

చరణం::1 

ఆదనూరులో మాలవాడలో
ఆదనూరులో..మాలవాడలో 
పేదవాడుగా..జనియించి 
చిదంబరేశ్వరుని పదాంబుజములే 
మదిలో నిలిపి..కొలిచేను  

నందుని చరితము వినుమా..ఆ..ఆ ..ఆ..ఆ
పరమానందము గనుమా..ఆ..ఆ..ఆ..ఆ 
పరమానందము గనుమా

చరణం::2 

తన యజమానుని ఆనతి వేడెను 
శివుని చూడగా మనసు పడి 
తన యజమానుని ఆనతి వేడెను
శివుని చూడగా మనసు పడి 
పొలాల సేద్యము..ముగించి రమ్మని 
పొలాల సేద్యము..ముగించి రమ్మని 
గడువే విధించె యజమాని 

యజమాని ఆనతిచ్చిన గడువులో
ఏ రీతి పొలము పండిచుటో ఎరుగక 
అలమటించు తన భక్తుని కార్యము 
ఆ శివుడే నెరవేర్చె..ఏ..ఏ..ఏ..ఏ 

పరుగున పోయెను చిదంబరానికి
భక్తుడు నందుడు ఆత్రమున 
పరుగున పోయెను చిదంబరానికి 
భక్తుడు నందుడు ఆత్రమున 
చిదంబరములో శివుని దర్శనం 
చేయగరాదనె పూజారి
ఆశాభంగము పొందిన నందుడు 
ఆ గుడి ముందే మూర్చిల్లె 
అంతట శివుడే అతనిని బ్రోచి 
పరంజ్యోతిగా వెలయించె

తెనాలి రామకృష్ణ--1956



సంగీతం::M.S.విశ్వనాథన్-రామమూర్తి 
రచన::సముద్రాల రాఘవాచార్య(సీనియర్) 
గానం:::ఘంటసాల 
తారాగణం::అక్కినేని,N.T.రామారావు,P.భానుమతి,జమున,నాగయ్య,సంధ్య. 

పల్లవి: 

చేసేది ఏమిటో చేసెయ్యి సూటిగా వేసేయ్యి పాగా ఆ ఆ ఆ ఈ కోటలో.. 
చేసేది ఏమిటో చేసెయ్యి సూటిగా వేసేయ్యి పాగా ఈ కోటలో.. 
చేసేది ఏమిటో చేసెయ్యి సూటిగా వేసేయ్యి పాగా ఈ కోటలో.. 
ఎన్ని కష్టాలు రానీ నష్టాలు గానీ.. నీ మాట దక్కించుకో బాబయ 
ఎన్ని కష్టాలు రానీ నష్టాలు గానీ.. నీ మాట దక్కించుకో బాబయా.. 
బాబయ... చేసేది ఏమిటో చేసెయ్యి సూటిగా వేసేయ్యి పాగా ఈ కోటలో.. 

చరణం 1: 

నాటేది ఒక్క మొక్క వేసేది నూరు కొమ్మ... 
కొమ్మ కొమ్మ విరగబూసి వేలాదిగా... 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
నాటేది ఒక్క మొక్క వేసేది నూరు కొమ్మ... 
కొమ్మ కొమ్మ విరగబూసి వేలాదిగా ... 
ఇక కాయాలి బంగారు కాయలు... భోంచేయ్యాలి మీ పిల్లకాయలు 
కాయాలి బంగారు కాయలు... భోంచేయ్యాలి మీ పిల్లకాయలు 
చేసేది ఏమిటో చేసెయ్యి సూటిగా ...వేసేయ్యి పాగా ఈ కోటలో 

చరణం 2: 

రహదారి వెంట మొక్కనాటి పెంచరా 
కలవాడు లేనివాడు నిన్ను తలచురా 
రహదారి వెంట మొక్కనాటి పెంచరా 
కలవాడు లేనివాడు నిన్ను తలచురా 

భువిని తరతరాల నీదు పేరు నిలుచురా 
పనిచేయువాడే ఫలములారగింతురా 

చేసేది ఏమిటో చేసెయ్యి సూటిగా... వేసేయ్యి పాగా ఈ కోటలో 
ఎన్ని కష్టాలు రానీ నష్టాలు గానీ... నీ మాట దక్కించుకో బాబయా 
బాబయా చేసేది ఏమిటో చేసెయ్యి సూటిగా... వేసేయ్యి పాగా ఈ కోటలో

పాతాళ భైరవి--1951



సంగీతం::ఘంటసాల
రచన::పింగళి నాగేంద్రరావు 
గానం::జిక్కి, రేలంగి
తారాగణం::N.T.రామారావు,అంజలీదేవి,గుమ్మడి,రాజనాల,రేలంగి, గిరిజ

పల్లవి::

వగలోయ్ వగలూ థళుకు బెళుకు వగలూ
వగలోయ్ వగలూ థళుకు బెళుకు వగలూ
బావలూ మామలూ బావలు మావలు భామలూ
లాలలూ లాలలూ లాలలు లాలలు లాలలు 
లాలలూ లాలలూ లాలలు లాలలు లాలలు లాలలో

చరణం::1

సింగారి వీధంట మావా..రంగేళి పిల్లంట బావా 
సింగారి వీధంట మావా..రంగేళి పిల్లంట బావా 
కొంగు తాకిందంటె..హేయ్..హేయ్
కొంగు తాకిందంటె..కూయి..కూయి..కూయునే
లాలలూ లాలలూ..లాలలు లాలలు లాలలు 
లాలలూ లాలలూ..లాలలు లాలలు లాలలు 
వగలోయ్ వగలూ..తళుకు బెళుకు వగలు 

చరణం::2

నీ వెంట వస్తాను..ఆ
నీ జంట ఉంటాను..నీ వెంట వస్తాను
నీ జంట ఉంటాను..యే?
సయ్యంటే బావా..ఊ అంటే మావా
సయ్యంటే బావా..ఊ అంటే మావా
చెలీయనీ భలేయని..సరే యనీ చలామణి
నా వెంట మీరంతా..గూమి గూమి గూడితే
లాలలూ లాలలూ..లాలలు లాలలు లాలలు
వగలోయ్ వగలు..తళుకు బెళుకు వగలు

ధీం తత తత ధీం తత..తత ధీం తత తత
వగలోయ్ వగలు..తలుకు బెలుకు వగలు
ఓ..ఓ..ఓ..ఓ..ఓ

చరణం::3

తరిగినతక..నకతకజం
ఝనంతరి తకిట..ఝంతకతోం
తకిటతై తకిటతై..తకిటతై తకిటతై
తలాంగుతోం..తలాంగుతోం తలాంగు

తాళలేనే..నే తాళలేనే
భామలారా..ఓయమ్మలారా
ఇందరిలోనూ..నీ సొమ్ములేవే
నా నాధుడేడే..శ్రీకృష్ణుడేడే
తాళలేనే..నే తాళలేనే
తాళలేనే..ఓ యమ్మా
అవునే..భామామణీ
తధిగినతోం..తధిగినతోం తధిగిన
తాళలేనే..నే..తాళలేనే 
తాళలేనే..నే..తాళలేనే
తాళలేనే..నే..తాళలేనే
తాళలేనే..తాళలేనే..తాళలేనేa

వారసత్వం--1964



సంగీతం::ఘంటసాల
రచన::నార్ల చిరంజీవి
గానం::ఘంటసాల, లీల
తారాగణం::N.T.రామారావు,అంజలీదేవి,గుమ్మడి,రాజనాల,రేలంగి, గిరిజ
పల్లవి::

చిలిపి కృష్ణునితోటి చేసేవు పోటీ
ఆ స్వామితో నీవు అన్నింట సాటి 
జో జో..జో జో
చిలిపి కృష్ణునితోటి చేసేవు పోటీ
ఆ స్వామితో నీవు అన్నింట సాటి


చరణం::1

చెరసాలలో పుట్టి వ్రేపల్లెలో వెలసి
గొల్ల తల్లుల మనసు కొల్లగొనినాడు
ఏ తల్లి ఒడి జారి ఏలాగు చేరావొ
ఆపదలె కాపుదలలాయేనె నీకు
జో అచ్యుతానంద జోజో ముకుందా 
రార పరమానంద రామగోవిందా 
జో జో..జో జో

చరణం::2

పలు వేసములు పూని పగవారు హింసింప
పల్పోకడలు చూపె బాలగోపాలుడూ
ఈ ఈడుకే ఎన్ని గండాలు గడిచాయొ
ఎంత జాతకుడమ్మ అనిపించినావు
జో అచ్యుతానంద జోజో ముకుందా
రార పరమానంద రామగోవిందా
జో జో..జో జో

చరణం::3

కాళింది పొగరణచి కంసుణ్ణి పరిమార్చి
కన్నవారికి చెరలు తొలగించినాడు
వసుదేవ తనయుని వారసత్వము నిలిపి
నీవారి వెతలెల్ల నీవె తీర్చేవు

చిలిపి కృష్ణునితోటి చేసేవు పోటీ
ఆ స్వామితో నీవు అన్నింట సాటి
చిలిపి కృష్ణునితోటి చేసేవు పోటీ
ఆ స్వామితో నీవు అన్నింట సాటి
జో జో..జో జో..జో జో..జో జో
జో జో..జో జో..జో జో..జో జో