Monday, May 25, 2015

నాకూ స్వతంత్రం వచ్చింది--1975



సంగీతం::చెళ్ళపిళ్ళ సత్యం  
రచన::D.C.నారాయణ రెడ్డి 
గానం::V.రామకృష్ణ,S.P..బాలు,నవకాంత్  
Film Directed By::P.Lakshmi Deepak  
Film Producer By::M.Prabhakar Reddy  
తారాగణం::కృష్ణంరాజు,రవికాంత్,జయప్రద,గుమ్మడి వెంకటేశ్వరరావు,నాగభూషణం,పద్మనాభం,రాజబాబు,M.ప్రభాకర్ రెడ్డి,అల్లు రామలింగయ్య,రావు గోపాల్ రావు,త్యాగరాజు,సాక్షి రంగారావు,కాకరాల,మాడా,షావుకారు జానకి,ప్రభ,శుభ,K.విజయ.

పల్లవి:: 

బతుకు బతక నివ్వరురా వున్నోళ్ళు
పడవ సాగనివ్వరురా పెద్దోళ్ళు
పెద్ద పెద్దోళ్ళు..పెద్ద పెద్దోళ్ళు..పెద్ద పెద్దోళ్ళు 

బతుకు బతక నివ్వరురా వున్నోళ్ళు
పడవ సాగనివ్వరురా పెద్దోళ్ళు
పెద్ద పెద్దోళ్ళు..పెద్ద పెద్దోళ్ళు..పెద్ద పెద్దోళ్ళు 

చరణం::1
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
యెముకలే కొయ్యలుగా..నరాలే తాళ్ళుగా
కట్టుకున్న పడవలనే..తగల బెట్టినారురా..ఆ ఆ ఆ 
యెముకలే కొయ్యలుగా..నరాలే తాళ్ళుగా
కట్టుకున్న పడవలనే..తగల బెట్టినారురా..ఆ ఆ ఆ 
పేదోళ్ళ నోళ్ళలో..మట్టి గొట్టినారురా..మట్టి గొట్టినారురా
బతుకు బతక నివ్వరురా..ఆ ఆ ఆ..వున్నోళ్ళు
పడవ సాగనివ్వరురా పెద్దోళ్ళు
పెద్ద పెద్దోళ్ళు..పెద్ద పెద్దోళ్ళు..పెద్ద పెద్దోళ్ళు 

చరణం::2

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఎలుతురెవడి సొమ్మురా..నీరెవడి సొత్తురా
ఎలుతురులో కలిగెనోళ్ళే..ఎలగాలంట..ఆ ఆ ఆ
ఎలుతురెవడి సొమ్మురా..నీరెవడి సొత్తురా
ఎలుతురులో కలిగెనోళ్ళే..ఎలగాలంట..ఆ ఆ ఆ
నీటిపైన ఆళ్ళమాటే..సెల్లాలంట..సెల్లాలంట
బతుకు బతక నివ్వరురా..ఆ ఆ ఆ..వున్నోళ్ళు
పడవ సాగనివ్వరురా పెద్దోళ్ళు
పెద్ద పెద్దోళ్ళు..పెద్ద పెద్దోళ్ళు..పెద్ద పెద్దోళ్ళు 

చరణం::3

కట్టలేసి నిలిపారా..పాలుపోసి పెంచరా
ఉప్పునీట గాలికి పెరిగే..సేపలపైన..ఆ ఆ
ఒళ్లు వంచని సోమరిపోతుల..పెత్తనాలా..బోడి పెత్తనాలా
బతుకు బతక నివ్వరురా..ఆ ఆ ఆ..వున్నోళ్ళు
పడవ సాగనివ్వరురా పెద్దోళ్ళు
పెద్ద పెద్దోళ్ళు..పెద్ద పెద్దోళ్ళు..పెద్ద పెద్దోళ్ళు 

చరణం::4

నిలపలేరు..పొద్దుపొడుపును
ఆపలేరు బతుకు..పడవను
చీకటెంత..ముసిరినగానీ
పొద్దుపొడుపు..తప్పదురా..ఆ ఆ ఆ  
నిలపలేరు..పొద్దుపొడుపును
ఆపలేరు బతుకు..పడవను
చీకటెంత..ముసిరినగానీ
పొద్దుపొడుపు..తప్పదురా..ఆ ఆ ఆ  
నిలువునా..కాల్చిన గానీ
బతుకు పడవ..ఆగదురా..ఆ 
బతుకు పడవ..ఆగదురా..ఆ ఆ ఆ ఆ

Nakoo Swathanthram Vachindi--1975
Music::Chellapilla Satyam
Lyrics::D.C.Naraayana Reddi
Singer's::V.Raamakrishna,S.P.Baalu,Navakaant 
Film Directed By::P.Lakshmi Deepak  
Film Producer By::M.Prabhakar Reddy  
Caste::Krishnamraju,Ravikanth,Jayapradha,Gummadi Venkateshwara Rao,Nagabhushanam,Padmanabham,Rajababu,M Prabhakar Reddy,Allu Ramalingaiah,Rao Gopal Rao,Thyagaraju,Sakshi Rangarao,Kakarala,Jaggarao,Mada,Savukaru Janaki,Prabha,Subha,K Vijaya.

::::::::::::::::

batuku bataka nivvaruraa vunnOLLu
paDava saaganivvaruraa peddOLLu
pedda peddOLLu..pedda peddOLLu..pedda peddOLLu 

batuku bataka nivvaruraa vunnOLLu
paDava saaganivvaruraa peddOLLu
pedda peddOLLu..pedda peddOLLu..pedda peddOLLu 

::::1

aa aa aa aa aa aa aa aa aa aa aa 
yemukalE koyyalugaa..naraalE taaLLugaa
kaTTukunna paDavalanE..tagala beTTinaaruraa..aa aa aa 
yemukalE koyyalugaa..naraalE taaLLugaa
kaTTukunna paDavalanE..tagala beTTinaaruraa..aa aa aa 
pEdOLLa nOLLalO..maTTi goTTinaaruraa
batuku bataka nivvaruraa..aa aa aa..vunnOLLu
paDava saaganivvaruraa peddOLLu
pedda peddOLLu..pedda peddOLLu..pedda peddOLLu 

::::2

aa...aa....aa.....aa..........aa 
eluturevaDi sommuraa..neerevaDi sotturaa
eluturulO karigenOLLE..elagaalanTa..aa aa aa
eluturevaDi sommuraa..neerevaDi sotturaa
eluturulO karigenOLLE..elagaalanTa..aa aa aa
neeTipaina ALLamaaTE..sellaalanTa..sellaalanTa
batuku bataka nivvaruraa..aa aa aa..vunnOLLu
paDava saaganivvaruraa peddOLLu
pedda peddOLLu..pedda peddOLLu..pedda peddOLLu 

::::3

kaTTalEsi nilipaaraa..paalupOsi pencharaa
uppuneeTa gaaliki perigE..sEpalapaina..aa aa aa
kaTTalEsi nilipaaraa..paalupOsi pencharaa
uppuneeTa gaaliki perigE..sEpalapaina..aa aa aa
oLlu vanchani sOmaripOtula..pettanaalaa..bODi pettanaalaa
batuku bataka nivvaruraa..aa aa aa..vunnOLLu
paDava saaganivvaruraa peddOLLu
pedda peddOLLu..pedda peddOLLu..pedda peddOLLu 

::::4

nilapalEru..poddupoDupunu
ApalEru batuku..paDavanu
chiikaTenta..musirinagaanii
poddupoDupu..tappaduraa..aa aa aa
nilapalEru..poddupoDupunu
ApalEru batuku..paDavanu
chiikaTenta..musirinagaanii
poddupoDupu..tappaduraa..aa aa aa
niluvunaa..kaalchina gaanii
batuku paDava..Agaduraa..aa aa
batuku paDava..Agaduraa..aa aa aa

నాకూ స్వతంత్రం వచ్చింది--1975



సంగీతం::చెళ్ళపిళ్ళ సత్యం  
రచన::మైలవరపు గోపి
గానం::V.రామకృష్ణ,S.జానకి,కోరస్  
Film Directed By::P.Lakshmi Deepak  
Film Producer By::M.Prabhakar Reddy  
తారాగణం::కృష్ణంరాజు,రవికాంత్,జయప్రద,గుమ్మడి వెంకటేశ్వరరావు,నాగభూషణం,పద్మనాభం,రాజబాబు,M.ప్రభాకర్ రెడ్డి,అల్లు రామలింగయ్య,రావు గోపాల్ రావు,త్యాగరాజు,సాక్షి రంగారావు,కాకరాల,మాడా,షావుకారు జానకి,ప్రభ,శుభ,K.విజయ.

పల్లవి:: 

స్వాతంత్రం వొచ్చింది..మన పంతం నెగ్గింది 
స్వాతంత్రం వొచ్చింది..మన పంతం నెగ్గింది 
హేయ్..చెయ్యెత్తి జే కొట్టరా..ఆ ఆ ఆ ఆ 
మన కష్టం తీరిందీ..మన ఇష్టం సాగిందీ
స్వాతంత్రం వొచ్చింది..రా..ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఏహే..అహ ఒహొ..ఏహే..ఏహే..అహ ఒహొ..ఏహే..అహ ఒహొ..

చరణం::1

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 
వున్నోళ్ళు యెన్నేళ్ళు కట్టారు..మా నోళ్ళు 
ఈరోజే తెరిచాము..మా కళ్ళు..ఆహా
నల్లోడే తెల్లోడై..నడి నెత్తిన కూకుంటే
ఎందాక చేతులు..కట్టుకు మొక్కేమూ..ఓహో
పెత్తందారులకు..బత్తెందారును
దోచే హక్కు..లేదన్నామూ
స్వాతంత్రం వొచ్చింది..మన పంతం నెగ్గింది 
హేయ్..చెయ్యెత్తి జే కొట్టరా..ఆ ఆ ఆ ఆ 
మన కష్టం తీరిందీ..మన ఇష్టం సాగిందీ
స్వాతంత్రం వొచ్చింది..రా..ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
స్వాతంత్రం వొచ్చింది..మన పంతం నెగ్గింది 
ఏహే..అహ ఒహొ..ఏహే..ఏహే..అహ ఒహొ..ఏహే..అహ ఒహొ..

చరణం::2

ఈ రోజే తెలిసింది..ఎన్నెల్లో కమ్మదనం
పడచుపిల్ల ఓరచూపులో..సక్కదనం..ఆహా 
ఈయాళే దొరికింది..సిరుగాలి సల్లదనం
నచ్చినోడి..కౌగిలిలోని..ఎచ్చదనం..ఓహో
సీకటి తొలగే..ఎలుగొచ్చిందీ
బతుకు ఏమిటో..తెలిసొచ్చిందీ

స్వాతంత్రం వొచ్చింది..మన పంతం నెగ్గింది 
హేయ్..చెయ్యెత్తి జే కొట్టరా..ఆ ఆ ఆ ఆ ఆ
మన కష్టం తీరిందీ..మన ఇష్టం సాగిందీ
స్వాతంత్రం వొచ్చింది..రా ఆ ఆ ఆ ఆ
స్వాతంత్రం వొచ్చింది..ఈ 


Nakoo Swathanthram Vachindi--1975
Music::Chellapilla Satyam
Lyrics::Mailavarapu Gopi 
Singer's::V.Raamakrishna,S.Jaanaki,Coras
Film Directed By::P.Lakshmi Deepak  
Film Producer By::M.Prabhakar Reddy  
Caste::Krishnamraju,Ravikanth,Jayapradha,Gummadi Venkateshwara Rao,Nagabhushanam,Padmanabham,Rajababu,M Prabhakar Reddy,Allu Ramalingaiah,Rao Gopal Rao,Thyagaraju,Sakshi Rangarao,Kakarala,Jaggarao,Mada,Savukaru Janaki,Prabha,Subha,K Vijaya.

::::::::::::::::

swaatantram vochchindi..mana pantam neggindi 
hEy..cheyyetti jE koTTaraa..aa
mana kashTam teerindii..mana ishTam saagindii
swaatantram vochchindi..mana pantam neggindi 

::::1

vunnOLLu yennELLu kaTTaaru..maa nOLLu 
iirOjE terichaamu..maa kaLLu
nallODE tellODai..naDi nettina kookunTE
endaaka chEtulu..kaTTuku mokkEmoo
pettandaarulaku..battendaarunu
dOchE hakku..lEdannaamoo
swaatantram vochchindi..mana pantam neggindi 

::::2

ii rOjE telisindi..ennellO kammadanam
paDachupilla OrachoopulO..sakkadanam 
iiyaaLE dorikindi..sirugaali salladanam
nachchinODi..kougililOni..echchadanam
seekaTi tolagE..elugochchindii
batuku EmiTO..telisochchindii

swaatantram vochchindi..mana pantam neggindi 
hEy..cheyyetti jE koTTaraa..aa
mana kashTam teerindii..mana ishTam saagindii
swaatantram vochchindi..mana pantam neggindi