Wednesday, January 03, 2007

బొబ్బిలియుద్ధం--1964


సంగీతం::S.రాజేశ్వర రావ్

రచన::శ్రీ శ్రీ
గానం::ఘంటసాల,P.సుశీల

పల్లవి::

అందాలరాణివే నీవెంత జాణవే కవించి సిగ్గుచెంద
నీకు న్యాయమా..ఆ..
విరాధి విరులే రణరంగ ధీరులే ఇదేమి వింత
ఏల ఇంత తొందరా ....విరాధి విరులే

చరణం::1

పరీక్ష చాలునే ఉపేక్ష ఏలనే సుఖాల తీరము ఇంకెంత దూరము (2)
ఉపేక్ష కాదిది అపేక్ష ఉన్నది నిరీక్ష చాలమంచిది (విరాధి విరులే)

క్రీగంటితో ననుదోచి నా గుండె దొంగిలి దాచి (2)
చాటుగా మాటుగా ఆడుటే చాలులే .. ఆడుటే చాలులే
చాలులే చాలులే

శ్రీవారి హృదయము నాచెంత పదిలము
నా ప్రేమ నిరతము కాపాడు కవచము

ప్రియురాలి రూపము రేగించె మోహము

నేనింక తాళజాలనే..ఏ..ఏ..ఏ..


(అందాలరాణివే)

చరణం::2


మీ వంటివారికి మేలా మేలెంచు పెద్దలు లేరా
వారిదే భారము ఏల ఈ ఆగము .. ఆగుము ఆగుము
ఆగను ఆగను
ఏకాంత సమయము ఆనంద నిలయము
నీవెన్ని అన్నిననూ నీ చేయి విడువను (2)
జగానికందము వివాహ భందము ఆనాడే తీరు వేడుకా

(అందాలరాణివే)