Wednesday, December 04, 2013

మాయాబజార్--1957
















సంగీతం::సాలూరి రాజేశ్వర్ రావు 
రచన::పింగళి నాగేంద్ర రావు 
గానం::ఘంటసాల , సత్యం , P.సుశీల , P.లీల 

పల్లవి::

దయచేయండి దయచేయండి తమంత వారిక లేరండి
దయచేయండి దయచేయండి తమంత వారిక లేరండి
తమంత వారిక లేరండి హై తమంత వారిక లేరండి
అతి ధర్మాత్ములు అతి పుణ్యాత్ములు
అతిథీమంతులు మీరండి అతిథీమంతులు మీరండి
తగువైకారం తగు సత్కారం తగు మాత్రంగా గైకోండి
తమంతవారిక తమరండి ఈ తతంగమంతా తమకండి
హై హై వై వై కై కై గై గై జియ్యా

చరనం::1

పెళ్ళికుమారా రావయ్యా మా భాగ్యం కొద్దీ దొరికావయ్యా
పెళ్ళికుమారా రావయ్యా మా భాగ్యం కొద్దీ దొరికావయ్యా
ముల్లోకాలను వెతకి తెచ్చిన అల్లుడవంటే నీ వయ్యా
ముల్లోకాలను గాలించి తెచ్చిన అల్లుడవంటే నీ వయ్యా
పల్లకి దిగిదిగి రావయ్యా తతంగమంతా నీకయ్యా
ఈ తతంగమంతా నీకయ్యా
హై హై వై వై కై కై గై గై జియ్యా

చరణం::2

కిరీటాలు కిరీటాలు వజ్రాల కిరీటాలు ధగ ధగ కిరీటాలు
ధరించినంతనే తలలో మెరయును
భలే యోచనలు బ్రహ్మాండముగా..భలే యోచనలు బ్రహ్మాండముగా
శిరస్త్రాణములు శిరోధార్యములు శిరోజరక్షలు కిరీటాలివి
అందుకోండయ్యా దొరలు ముందుకు రండయ్యా
అందుకోండయ్యా దొరలు ముందుకు రండయ్యా 

చరణం::3

హారాలు మణిహారాలు
హారాలు మణిహారాలు పతకాలు నవపతకాలు
హారాలు మణిహారాలు పతకాలు నవపతకాలు
మణిబంధాలు భుజబంధాలు అందాలకు అనుబంధాలు
అందాలకు అనుబంధాలు
వింతచీరలు వింతముసుగులు
వింతచీరలు వింతముసుగులు సంతోషాలకు సంబంధాలు
అందుకోండమ్మా తల్లులు ముందుకు రండమ్మా
అందుకోండమ్మా తల్లులు ముందుకు రండమ్మా

చరణం::4

రక్షలు రక్షలు పాదరక్షలు నాట్య శిక్షలో బాల శిక్షలు
రక్షలు రక్షలు పాదరక్షలు నాట్య శిక్షలో బాల శిక్షలు
తొడిగినతోడనే తోధిమి తోధిమి అడుగువేయగానే తైతక్క తైతక్క
తొడిగినతోడనే తోధిమి తోధిమి అడుగువేయగానే తైతక్క తైతక్క
నేలమీదనిక నిలువనీయక కులాసాగ మిమ్ము నర్తింపజేసే
రక్షలు రక్షలు పాదరక్షలు నాట్య శిక్షలో బాల శిక్షలు
రక్షలు రక్షలు పాదరక్షలు నాట్య శిక్షలో బాల శిక్షలు

చరణం::5

ఒకటే మా వయసు ఓ రాజా ఒకటే మా సొగసు
ఒకటే మా వయసు ఓ రాజా ఒకటే మా సొగసు
నయగారము నా కళరా వయ్యారము నా వలరా
నయగారము నా కళరా వయ్యారము నా వలరా
హోయ్ నేనే నీజోడురా నేనే నీ ఈడురా
వన్నెచిన్నెలెన్నరావో రాజా..వన్నెచిన్నెలెన్నరావో రాజా
ఒకటే మా వయసు ఓ రాజా ఒకటే మా సొగసు
సరసతలో ఇది జాణరా రసికతలో ఇది రాణిరా
సరసతలో ఇది జాణరా రసికతలో ఇది రాణిరా
హోయ్ నిన్నే కోరితిరా నిన్నే చేరితిరా
వన్నెచిన్నెలెన్నరావో రాజా..వన్నెచిన్నెలెన్నరావో రాజా 
ఒకటే మా వయసు ఓ రాజా ఒకటే మా సొగసు
ఒకటే మా వయసు ఓ రాజా ఒకటే మా సొగసు

రుణానుబంధం--1960



సంగీతం::ఆదినారాయణ రావు
రచన::సముద్రాల జూనియర్
గానం::ఘంటసాల 
Film Directed By::Vedaantam Raghavayya
తారాగణం::అక్కినేని నాగేశ్వరరావు,అంజలిదేవి,గిరిజ,రేలంగి,గుమ్మడి.

సాకీ::

ఋణానుబంధ రూపేణ పశుపత్నీ సుతాలయా

పల్లవి::

ఏనాటిదొ ఈ బంధం ఈ జీవుల సంబంధం
తెలియగరాని ఈ అనుబంధం
ఋణానుబంధం అంతా ఋణానుబంధం

ఏనాటిదొ ఈ బంధం ఈ జీవుల సంబంధం
తెలియగరాని ఈ అనుబంధం
ఋణానుబంధం అంతా ఋణానుబంధం

చరణం::1

ఆహా..ఆ..కడుపున కన్న తల్లొకరు
కనని తల్లియై పెంచేదొకరు
కడుపున కన్న తల్లొకరు
కనని తల్లియై పెంచేదొకరు
పుట్టేదీ ఒక చోటా..పెరుగుట వేరొక చోట
హు..ఎవరికి ఎవరో..ఏమౌతారో

ఋణానుబంధం అంతా ఋణానుబంధం

చరణం::2

ఆహా..జీవితమే చదరంగం
జీవుల పావుల రణరంగం
జీవితమే చదరంగం
జీవుల పావుల రణరంగం
దేవునకది తెరలాటా..తెలియదు మనకే బాట
హు..ఎవరికి ఎవరో..ఏమౌతారో

ఋణానుబంధం అంతా ఋణానుబంధం

ఏనాటిదొ ఈ బంధం ఈ జీవుల సంబంధం
తెలియగరాని ఈ అనుబంధం
ఋణానుబంధం అంతా ఋణానుబంధం




సాకీ::

ఆపదలన్నీ సహించాలీ
అన్నమాట సాధించాలీ
అన్నమాట సాధించాలీ

పల్లవి::

మాటే జీవిత లక్ష్యం..మాటే మానవ ధర్మం
మాటకు నిలచి మనగలవారి చరిత సార్ధకం
వారి బ్రతుకె సార్ధకం
మాటే జీవిత లక్ష్యం..మాటే మానవ ధర్మం

చరణం::1

ఓహో..ఓ..కడుపున కన్న తల్లొకరు
కనని తల్లియై పెంచేదొకరు
ఓహో..ఓ..కడుపున కన్న తల్లొకరు
కనని తల్లియై పెంచేదొకరు
పుట్టేదీ ఒక చోటా..పెరుగుట వేరొక చోట
ఎవరికి ఎవరో..ఏమౌతారో

ఋణానుబంధం అంతా ఋణానుబంధం
మాటే జీవిత లక్ష్యం..మాటే మానవ ధర్మం
మాటకు నిలచి మనగలవారి చరిత సార్ధకం
వారి బ్రతుకె సార్ధకం
మాటే జీవిత లక్ష్యం..మాటే మానవ ధర్మం
వారి బ్రతుకె సార్ధకం 

పిచ్చి పుల్లయ్య--1953


















పిచ్చి పుల్లయ్య--1953
సంగీతం::T.V.రాజు
రచన::అనిసెట్టి సుబ్బారావు
గానం::ఘంటసాల

పల్లవి::

ఆలపించనా..అనురాగముతో
ఆలపించనా..అనురాగముతో
ఆనందామృతమావరించగా
అవనీ గగనం..ఆలకించగా
ఆలపించనా..ఆలపించనా

చరణం::1

చక్కని పూవులు..విరిసి ఆడగా
చల్లని గాలులు..కలిసి పాడగా
పున్నమి వెన్నెల..పులకరించగా
పుడమిని సుఖాలు..పొంగులెగరగా
ఆలపించనా

చరణం::2

చిలిపి గుండెలో..వలపు నిండగా
చిరునవ్వులలో..సిగ్గు చిందగా
చిలిపి గుండెలో..వలపు నిండగా
చిరునవ్వులలో..సిగ్గు చిందగా
అరమరలెరుగని..అమాయకునిలో
అరమరలెరుగని..అమాయకునిలో
ఆశయాలెవో..అవతరించగా
ఆశయాలెవో..అవతరించగా..ఆలపించనా

చరణం::3

కరుణ హృదయమే..తాజ్ మహల్గా
అనంత ప్రేమకు..ఆశ చెందగా
కరుణ హృదయమే..తాజ్ మహల్గా
అనంత ప్రేమకు..ఆశ చెందగా
నిర్మల ప్రేమకు..నివాళులెచ్చే
నిర్మల ప్రేమకు..నివాళులెచ్చే
కాంతిరేఖలే..కౌగలించగా
కాంతిరేఖలే..కౌగలించగా..ఆలపించనా

ఆలపించనా..అనురాగముతో
ఆనందామృతమావరించగా
అవనీ గగనం..ఆలకించగా..ఆలపించనా

అమరగాయకుడు, పద్మశ్రీ "ఘంటసాల" గారి జయంతి


                                     అమరగాయకుడు, పద్మశ్రీ "ఘంటసాల" గారి జయంతి




ఆనంద నిలయం --1971
సంగీతం::పెండ్యాల నాగేశ్వర రావు
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల

పల్లవి::

పదిమందిలో పాటపాడినా
అది అంకితమెవరో ఒకరికే
విరితోటలో పూలెన్ని పూసినా
గుడికి చేరేది నూటికి ఒకటే

పదిమందిలో పాటపాడినా
అది అంకితమెవరో ఒకరికే
విరితోటలో పూలెన్ని పూసినా
గుడికి చేరేది నూటికి ఒకటే

చరణం::1

గోపాలునికెంతమంది గోపికలున్నా
గుండెలోన నెలకొన్నా రాధ ఒక్కటే

గోపాలునికెంతమంది గోపికలున్నా
గుండెలోన నెలకొన్నా రాధ ఒక్కటే
   
ఆకాశవీధిలో తారలెన్ని ఉన్నా
అందాల జాబిల్లి అసలు ఒక్కటే

పదిమందిలో పాటపాడినా
అది అంకితమెవరో ఒకరికే

చరణం::2

ఏడాదిలో ఎన్ని ఋతువులున్ననూ
వేడుక చేసే..వసంతమొక్కటే    
ఏడాదిలో ఎన్ని ఋతువులున్ననూ
వేడుక చేసే..వసంతమొక్కటే   
నా కన్నులందు ఎన్నివేల కాంతులున్ననూ   
నా కన్నులందు ఎన్నివేల కాంతులున్ననూ   
ఆ కలిమి కారణం నీప్రేమ ఒక్కటే

పదిమందిలో పాటపాడినా
అది అంకితమెవరో ఒకరికే
విరితోటలో పూలెన్ని పూసినా
గుడికి చేరేది నూటికి ఒకటే





అమృతపు రుచి ఎలా ఉంటుందో చెప్పలేము గానీ అమృతధార ధార చెవిలో పడితే ఎంతటి పరవశంలో ఓలలాడతామో వారి స్వరం వింటే తెలుస్తుంది!
పలుకుల స్పష్టతే కాదు, మాటలకందని మాధుర్యం వారి మాటల్లో తొణికిసలాడుతుంది. 
అంబరమంటి మహోన్నత వ్యక్తిత్వం వారి ఆభరణం!
కృతజ్ఞతా, మంచితనమే వారి అష్టైశ్వర్యాలు!
సంగీత ప్రపంచంలో తానొక బింధువునైతే చాలనుకున్నారు! 
కానీ..సరస్వతీ ముద్దు బిడ్డయ్యి, జ్ఞానాన్ని ప్రసాదించే గీతా సారాన్ని స్వచ్చంగా స్పష్టంగా మనకందించారు!
వారెవరో ఈపాటికే తెలిసిపోయుంటుంది. అవును! మన ఘంటసాల గారు. 
ఈ రోజు ఘంటసాల వేంకటేశ్వర రావు గారి జయంతి సందర్భంగా వారిని స్మరించుకుందాం... 

ఘంటసాల గారు 1922 డిసెంబర్ 4 న గుడివాడ దగ్గరలో చౌటపల్లి గ్రామములో ఘంటసాల సూర్యనారాయణ, రత్నమ్మ దంపతులకు జన్మించారు. సూర్యనారాయణ గారు మృదంగ వాయిద్యకారులు. వీరు మృదంగం వాయిస్తూ, భజనలు చేసేవారు. 
ఘంటసాలను భుజం పైన కూర్చోబెట్టుకొని పాటలు పాడుతూ సంగీత సభాస్థలికి తీసుకెళ్ళేవారు. 
బుల్లి ఘంటసాల అక్కడ జరుగుతున్న భజనలు వింటూ పాటలు పాడుతూ నాట్యం చేసేవారు.
ఘంటసాల 11వ ఏట తన తండ్రి మరణించారు. 
జీవితపు చరమాంకంలో ఆయన సంగీతం గొప్పదనాన్ని ఘంటసాలకు వివరించి ఘంటసాలను గొప్ప సంగీత విద్వాంసుడిని అవమని కోరారు. 
అయితే వీరి కుటుంబ బాధ్యతను ఘంటసాల గారి మేనమామ చూసుకునేవారు.
తండ్రి ఆశయం నెరవేర్చడానికి ఘంటసాల సంగీత గురుకులాలలో చేరినా, ఆ కట్టుబాట్లు తట్టుకోలేక వెనక్కు వచ్చేశారు. 
ఒక్క విజయానికి ముందు ఎన్నో ఓటములను దాటుకుని వెళ్ళాలన్నట్టు, 
ఒకసారి సమీప గ్రామంలో జరిగిన సంగీత కచేరీలో విద్వాంసులతో పోటీపడి ఓడిపోయి నవ్వులపాలయ్యారు. 
అంతే! అప్పటినుండి ఆయనలో పట్టుదల పెరిగింది. 
ఎలాగైనా సంగీతాన్ని నేర్చుకోవాలన్న దీక్ష తో,                      

తనకు తెలిసిన కొందరు సంగీత విద్వాంసుల ఇళ్ళల్లో పనిచేస్తూ సంగీతం అభ్యసించడానికి నిశ్చయించుకున్నారు. 
తనదగ్గరున్న నలభై రూపాయల విలువగల ఉంగరాన్ని ఎనిమిది రూపాయలకు అమ్మి 
ఆంధ్రరాష్ట్రంలో ఏకైక సంగీత కళాశాల ఉన్న విజయనగరం చేరుకున్నారు. 
ఐతే ఆ కళాశాలలో చేరినప్పుడు వేసవి సెలవులు కావడంతో ఎక్కడ ఉండాలో తెలియని అనిశ్చితి! 
ప్రిన్సిపాల్ దగ్గరకువెళ్ళి అభ్యర్థించగా, ఆయన కళాశాల ఆవరణలో బసచేయడానికి అనుమతి ఇచ్చారు. 
ఘంటసాల అక్కడ ఉంటూ రోజుకొక ఇంట్లో భోజనం చేస్తూ వారాలబ్బాయిలా కొనసాగారు. 
ఇలా ఉండగా తోటివిద్యార్థులు చేసినతప్పుకు ఘంటసాలను కళాశాల నుండి బహిష్కరించారు. 
అది తెలిసి వారాలు పెట్టే కుటుంబాలవారు తమ ఇళ్ళకు రావద్దన్నారు. 
ఎటూ పాల్పోని స్థితిలో గత్యంతరంలేక ఆ వూరి ఎల్లమ్మ గుడికి వెళ్ళి తలదాచుకున్నారు.
అప్పుడు ఆ గుడికి వచ్చిన పట్రాయని సీతారామశాస్త్రి ఘంటసాల గురించి తెలుసుకొని, 
తన ఇంట ఉచితంగా సంగీతశిక్షణ ఇవ్వడానికి అంగీకరించారు.
శాస్త్రి గారు, ఘంటసాలకు భోజన సదుపాయాలు కల్పించలేని పేద స్థితి!. 
ఆకలితో ఉన్న ఘంటసాలకు ఒక సాధువు జోలెకట్టి మాధుకరం (ఇంటింటా అడుక్కోవడం) చేయడం నేర్పించారు. 
భుజాన జోలెకట్టుకొని వీధివీధి తిరిగి రెండుపూటలకు సరిపడే అన్నం తెచ్చుకొనేవారు. దేనికీ ఇబ్బంది పడలేదు. 
గురువు గారి ఆజ్ఞ శిరసావహించారు. ఉన్నదల్లా ఒక్కటే దీక్ష! సంగీతాన్ని నేర్చుకునే అకుంఠిత దీక్ష!
వేసవి సెలవులు పూర్తయ్యాక, తిరిగి ఘంటసాల కళాశాలలో చేరారు. 
శాస్త్రి శిక్షణలో నాలుగుసంవత్సరాల కోర్సును రెండు సంవత్సరాలలో పూర్తిచేసి, 
కొన్నాళ్ళు విజయనగరంలో సంగీత కచేరీలు చేసి మంచిపేరు తెచ్చుకొని తన సొంతవూరు అయిన చౌటపల్లెకుచేరుకున్నారు.
అక్కడ ఉత్సవాలలో, వివాహ మహోత్సవాలలో పాటలు పాడుతూ సంగీత పాఠాలు చెప్పేవారు. 
1942లో స్వాతంత్ర్య సమరయోధునిగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని రెండుసంవత్సరాలు అలీపూర్ జైల్లో నిర్బంధంలో కూడా ఉన్నారు.
ఘంటసాల సామర్థ్యం గ్రహించిన సముద్రాల రాఘవాచార్యులు ఘంటసాలను మద్రాసుకు వచ్చి కలుసుకోమన్నారు. 
ఘంటసాల రెండునెలలు కష్టపడి కచేరీలుచేసి, కొంత అప్పుచేసి మద్రాసుకుళ్ళారు. 
సముద్రాల ఘంటసాలను రేణుకా ఫిలింస్ కు తీసుకెళ్ళి చిత్తూరు నాగయ్య, బి.ఎన్.రెడ్డిల ముందు పాటకచేరీ చేయించారు.
సముద్రాలవారి ఇల్లు చాలాచిన్నది కావడంతో ఆయనకు ఇబ్బంది కలిగించడం ఇష్టంలేక 
ఘంటసాల తన మకాంను పానగల్ పార్కు వాచ్‌మన్‌కు నెలకు రెండురూపాయలు చెల్లించే పద్ధతిపై అక్కడకు మార్చారు. 
పగలంతా అవకాశాలకోసం వెతికి రాత్రికి పార్కులో నిద్రించేవారు. 
చివరికి సముద్రాల అప్పటి మద్రాసు రేడియో కేంద్రంలో లలితగీతాల గాయకుడి అవకాశాన్ని ఇప్పించారు. 
ఇలాపాటలు పాడుతూ మరోవైపు సినిమాల్లో చిన్నచిన్న వేషాలు వేస్తూ. 
మరోవైపు బృందగానాలు చేస్తూ నెమ్మదిగా సినీరంగ ప్రముఖుల గుర్తింపు పొందారు. 
ఘంటసాలచేత తరచు పాటలు పాడించుకొని ఆస్వాదించే చిత్తూరు నాగయ్య, 
బి.ఎన్.రెడ్డిలు తమ సినిమా అయిన స్వర్గసీమ లో మొదటిసారి నేపథ్యగాయకుడి అవకాశాన్ని ఇచ్చారు. 
భానుమతి పక్కన భయపడుతూ ఘంటసాల పాడుతుంటే భానుమతి, నాగయ్యలు ధైర్యం చెప్పేవారు. 
ఆపాటకు ఆయనకు 116 రూపాయల పారితోషికం లభించింది.
తర్వాత భానుమతి, రామకృష్ణలు తీసిన రత్నమాల చిత్రానికి సహాయ సంగీతదర్శకునిగా చేసే అవకాశం వచ్చింది. 
తర్వాత బాలరాజు, మనదేశం వంటి హిట్ చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించారు.
1951లో పాతాళభైరవి విజయంతో ఘంటసాల పేరు ఆంద్రదేశమంతా మారుమ్రోగింది. 
అది మొదలు సినీ వినీలాకశంలో విజయ బావుటా ఎగరవేసారు. 
ఒక వైపు తనదంటూ ప్రత్యేకమైన బాణీ , మరో వైపు అన్ని రసాలనూ పలికించగల నేర్పు వారి గళానికే సొంతమై నిలిచింది. 
1970 వరకు దాదాపు ప్రతిపాట ఘంటసాల పాడినదే!
ఇక వీరి విశిష్ట వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే...ఘంటసాల ఎంత గొప్పస్థితికి చేరుకొన్నా తనను ఆదరించిన వారిని మరువలేదు. 
ఎన్నడూ మరొకరిని నొప్పించే మనస్థత్వం కాదు. కోరినవారికి కాదనక సహాయంచేసే ఔధార్యత.
"నాడు ఏతల్లి మొదటి కబళం నా జోలెలో వేసిందో ఆమె ఆవాత్సల్యపూరితమైన భిక్ష నాకు అష్టైశ్వర్యాలతో కూడిన భవిష్యత్తును ప్రసాదించింది " అని ఎన్నోసార్లు చెప్పేవారు.
మద్రాసులో ఇల్లుకొన్నపుడు గురువుగారైన సీతారామశాస్త్రిగారికి గృహప్రవేశానికి రావడానికై 
టికెట్లుకొని గృహప్రవేశం రోజు వెయ్యిన్నూటపదహార్లు, 
పట్టుబట్టలు వెండిపళ్ళెంలో సమర్పించి సాష్టాంగ నమస్కారంచేసి ఆయనపట్ల తన 
గౌరవాన్ని చాటుకున్న ఉన్నత శిశ్యులు మన ఘంటసాల. 
పానగల్ పార్కులో కష్టాల్లో ఉన్నపుడు కూడా తోటివారికి ఆకలిగా ఉన్నపుడు భోజనాలు కల్పించేవాడు.
సంగీతాభ్యాసం చేస్తున్నరోజుల్లో తనను 'అన్నా' అని పిలిచే స్నేహితుడు పాపారావుకు తాను గొప్పవాడినైతే వాచీ కొనిస్తానని చెప్పాడు. 
కొన్నేళ్ళకు పాపారావు 'అన్నా గొప్పవాడివయ్యావు కదా నా వాచీ ఏదీ' అని ఉత్తరం రాయగా నూరు రూపాయలు పంపించారు.
చివరి దశలో 1969 నుండి ఘంటసాల తరచు అనారోగ్యానికి గురయ్యేవారు.
1972లో ప్రదర్శన ఇస్తున్నపుడు గుండెనొప్పి అనిపించడంతో హాస్పిటల్లో చేరారు. 
అప్పటికే మధుమేహ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు.
అప్పుడే ఆయనకు భగవద్గీత పాడాలన్న కోరికకలిగింది. 
భగవద్గీత పూర్తిచేసిన తర్వాత ప్రేమ, యుగల గీతాలు లాంటి సినిమా పాటలు పాడకూడదు అని నిశ్చయించుకుని, 
1973లో భక్త తుకారాం, జీవన తరంగాలు, దేవుడు చేసిన మనుషులు మొదలైన హిట్ చిత్రాలకు పాటలు పాడారు. 
1974 నాటికి ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. చివరికి 1974 ఫిబ్రవరి 11న ఆస్పత్రిలో పరమపదించారు. 
యావదాంధ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. 'అయితేనేమీ.. భగవద్గీత ప్రతీ శ్లోకంలో వీరు చిరంజీవులే! 
చల్లని మలయమారుతంలో వీలి గాన మాధుర్యం యెప్పటికీ సజీవమే! ప్రతీ ప్రణయ గీతపు మాధుర్యంలోనూ జీవిస్తూనే ఉన్నారు. 
ప్రతీ సంగీతాభిమాని గుండెల్లో అనునిత్యం ఆలపిస్తూనే ఉన్నారు, ఉంటారు!! 'వారి గీతా పారాయణంలో.. వెంకన్న గానామృతంలో, 
మొత్తంగా సినీ వినీలాకాశ సంగీత పీఠం పై వీరి పేరెప్పుడూ రాజై ఇప్పటికీ ఎప్పటికీ రాజ్యమేలుతోంది.
ఘంటసాల మాష్టారు జయంతి సందర్భంగా అంజలి ఘటిస్తూ...___/\___ kavita chakra