Friday, December 23, 2011

శభాష్ రాముడు--1959

ఈ పాట ఇక్కడ వినండి..సుశీలమ్మగారి మెలోడి సాగ్

సంగీతము::ఘంటసాల
రచన::సముద్రాల
గానం::P.సుశీల

పల్లవి::

రేయి మించెనోయి రాజా
హాయిగ నిదురించరా..ఆ.
హాయిగ నిదురించరా
రేయి మించెనోయి రాజా
హాయిగ నిదురించరా
హాయిగ నిదురించరా

చరణం::1

వెల్లి విరిసీ వెన్నెల్లు కాసి
చల్లని చిరుగాలి మెల్లంగా వీచే
వెల్లి విరిసీ వెన్నెల్లు కాసి
చల్లని చిరుగాలి మెల్లంగా వీచే

స్వప్నాల లోన స్వర్గాలు కంటూ
స్వర్గాలలోన దేవ గానాలు వింటూ
హాయిగ నీవింక నిదురించవోయి

రేయి మించెనోయి రాజా
హాయిగ నిదురించరా
హాయిగ నిదురించరా

చరణం::2

చీకటి వెంటా వెలుగే రాదా
కష్టసుఖాలు ఇంతే కాదా
చీకటి వెంటా వెలుగే రాదా
కష్టసుఖాలు ఇంతే కాదా
చింతా వంతా నీకేలనోయి
అంతా జయమౌను శాంతించవోయి
హాయిగ నీవింక నిదురించవోయి

రేయి మించెనోయి రాజా
హాయిగ నిదురించరా
హాయిగ నిదురించరా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్

దేవుడమ్మ--1973

ఈ పాట ఇక్కడ వినండి

సంగీతం::సత్యం
రచన::రాజశ్రీ
గానం::S.P.బాలు

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ............
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ............

ఎక్కడో దూరాన కూర్చున్నావు..ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడి చేస్తున్నావు..తమాష చూస్తున్నావు … సామీ …
ఎక్కడో దూరాన కూర్చున్నావు..ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడి చేస్తున్నావు..తమాష చూస్తున్నావు..సామీ
ఎక్కడో దూరాన కూర్చున్నావు..ఉ....

లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు..మమ్ము తోలుబొమ్మలను చేసి ఆడిస్తావు
లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు..మమ్ము తోలుబొమ్మలను చేసి ఆడిస్తావు
అంతా మా సొంతమని అనిపిస్తావు ..
అంతలోనే మూడునాళ్ళ ముచ్చటగా..హ హ హ..చేసేస్తావు..సామీ
ఎక్కడో దూరాన కూర్చున్నావు..ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడి చేస్తున్నావు..తమాష చూస్తున్నావు … సామీ …
ఎక్కడో దూరాన కూర్చున్నావు

పెరుగుతుంది వయసనీ అనుకుంటాము..కాని తరుగుతుంది ఆయువని తెలుసుకోము
పెరుగుతుంది వయసనీ అనుకుంటాము..కాని తరుగుతుంది ఆయువని తెలుసుకోము
కళ్ళు తెరిచి నిజమేదో తెలిసే లోగా
మా కళ్ళముందు మాయతెరలు..కప్పేస్తావు … సామీ
ఎక్కడో దూరాన కూర్చున్నావు..ఎక్కడో దూరాన కూర్చున్నావు
ఎక్కడో దూరాన కూర్చున్నావు..సామీ..ఎక్కడో దూరాన కూర్చున్నావు