Saturday, March 10, 2012

బండరాముడు--1959





సంగీతం::సుసర్ల దక్షిణామూర్తి
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::P..సుశీల

పల్లవి::

ఆగుమా...
ఒకసారి ఆగుమా...
ఒకసారి ఆగుమా
ఓ చందమామా
మనసార నా మాట ఆలించి పొమ్మా
ఒకసారి ఆగుమా
ఓ చందమామా
మనసార నా మాట ఆలించి పొమ్మా
ఒకసారి ఆగుమా
ఓ చందమామా

చరణం::1

నీలి మబ్బుల తెరచాటు మాటున
మాటి మాటికి ఇటు దాగనేల
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ
నీలి మబ్బుల తెరచాటు మాటున
మాటి మాటికి ఇటు దాగనేల

ఎందుకో కనలేవు సూటిగ
ఎందుకో కనలేవు సూటిగ
ఎదలోన నీవైన యోచించుకొమ్మా

ఒకసారి ఆగుమా
ఓ చందమామా
మనసార నా మాట ఆలించి పొమ్మా
ఒకసారి ఆగుమా
ఓ చందమామా

చరణం::2

పరుల సొమ్మును
హరియించు వాడె
పగటిపూటను
ఇలు వీడలేడోయ్‌........ ఓ ఓయ్..

పరుల సొమ్మును
హరియించు వాడె
పగటిపూటను
ఇలు వీడలేడోయ్‌........

మంచిగా మనవోయి జాబిలి
మంచిగా మనవోయి జాబిలి
మలినమ్ము ఇకనైన
తొలిగించుకొమ్మా

ఒకసారి ఆగుమా..
ఒకసారి ఆగుమా
ఓ చందమామా
మనసార నా మాట ఆలించి పొమ్మా

మారేనా నీ మనసు ఓ చందమామా
మారేనా నీ మనసు ఓ చందమామా
ఓ చందమామా...ఓ చందమామా