సంగీతం::ఇళయ రాజ
రచన::వేటూరి
గానం: SP.బాలు,S.జానకి
Cast::Kamal Hassan, Jayapradha, Sarath Babu, S.P.Shailaja, Sakshi Ranga Rao, Geetha, Manju Bhargavi
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
మౌనమేల నోయీ....
మౌనమేల నోయీ
ఈ మరపు రాని రేయి
మౌనమేల నోయి ఈ మరపు రాని రేయి
ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా
ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా
తారాడే హాయిలో....
!! ఇక మౌనమేల నోయి
ఈ మరపు రాని రేయి !!
పలికే పెదవీ వణికింది ఎందుకో....
వణికే పెదవీ వెనకాల ఏమిటొ....2
కలిసే మనసులా...విరిసే వయసులా
కలిసే మనసులా..విరిసే వయసులా
నీలి నీలి ఊసులూ లేత గాలి బాసలూ
ఏమేమో అడిగినా....
!! మౌన మేల నోయి
ఈ మరపు రాని రేయి !!
హిమమే కురిసే చందమామ కౌగిటా....
సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిటా....2
ఇవి ఏడడుగులా వలపూ మడుగులా....
ఇవి ఏడడుగులా వలపూ మడుగులా....
కన్నె ఈడు ఉలుకులూ కంటి పాప కబురులూ..
ఎంతెంతో తెలిసినా....
!! మౌన మేల నోయి ఈ మరపు రాని రేయి...
ఇక మౌనమేల నోయి ఈ మరపు రాని రేయి
ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా
ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా
తారాడే హాయిలో....
ఇక మౌనమేల నోయి ఈ మరపు రాని రేయి !!