http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=309
సంగీతం::K.V.మహాదేవన్
రచన::వేటూరి
గానం::P.సుశీల,S.జానకి
తారాగణం::N.T. రామారావు,జయప్రద,సత్యనారాయణ,
అల్లు రామలింగయ్య,జమున,జయమాలిని,హలం
పల్లవి::
దిక్కులెన్ని దాటాడో సుందరాంగుడు
చుక్కలెన్ని మీటాడో..గ్రంధసాంగుడు
దిక్కులెన్ని దాటాడో సుందరాంగుడు
చుక్కలెన్ని మీటాడో..గ్రంధసాంగుడు
సరస మధుర శృంగార నాయకుడు నావాడే
అప్సరసల తనులతా వైణికుడు నావాడే
నవ మద నుడు రసపురుషుడు ఈ మానవుడు మనవాడే
దిక్కులెన్ని దాటాడో సుందరాంగుడు
చరణం::1
నరుడైన సురుడల్లే తోచినాడే
పెదవుల్లో సుధలెన్నో దాచినాడే
భువి నుంచి దివిదాకా వచ్చినాడే
ఎదిగెదిగి ఎద దాటి పోయినాడే
క్షణమైన చాలే ఆ కౌగిలి
అమృతాధరుడైన అతనెంగిలి
క్షణమైన చాలే ఆ కౌగిలి
అమృతాధరుడైన అతనెంగిలి
కృతి లేని బ్రతుకే శృతిలేని వీణ
మనసున్న మనిషే మనకన్న మిన్న
దిక్కులెన్ని దాటాడో సుందరాంగుడు
చుక్కలెన్ని మీటాడో..గ్రంధసాంగుడు
దిక్కులెన్ని దాటాడో సుందరాంగుడు
చరణం::2
విరహంలో మోహాలే తెచ్చినాడే
విరిశయ్య దాహాలే పెంచినాడే
మన్మధుడే మానవుడై పుట్టినాడే
స్వర్గంలో దేవతగా మెట్టినాడే
ఏమివ్వగలదాన నీ నరునికి
ఏమివ్వగల నీ మనోహరునికి
ఏమివ్వగలదాన నీ నరునికి
ఏమివ్వగల నీ మనోహరునికి
కృతి లేని బ్రతుకే శృతిలేని వీణ
మనసున్న మనిషే మనకన్న మిన్న
దిక్కులెన్ని దాటాడో సుందరాంగుడు
చుక్కలెన్ని మీటాడో..గ్రంధసాంగుడు
దిక్కులెన్ని దాటాడో సుందరాంగుడు
Rajaputra Rahasyam--1978
Music::K.V.Mahaadevan
Lyrics::Veturi
Singer's::P.Suseela,S.Janaki
Cast::N.T.ramaRao,Jayaprada,Satyanarayana,Alluramalingayya,Jamuna,Jayamalini,Halm
:::::
dikkulenni daaTaaDO sundaraanguDu
chukkalenni meeTaaDO..grandhasaanguDu
dikkulenni daaTaaDO sundaraanguDu
chukkalenni meeTaaDO..grandhasaanguDu
sarasa madhura SRngaara naayakuDu naavaaDE
apsarasala tanulataa vaiNikuDu naavaaDE
nava mada nuDu rasapurushuDu ii maanavuDu manavaaDE
dikkulenni daaTaaDO sundaraanguDu
::::1
naruDaina suruDallE tOchinaaDE
pedavullO sudhalennO daachinaaDE
bhuvi nunchi dividaakaa vachchinaaDE
edigedigi eda daaTi pOyinaaDE
kshaNamaina chaalE aa kougili
amRtaadharuDaina atanengili
kshaNamaina chaalE aa kougili
amRtaadharuDaina atanengili
kRti lEni bratukE SRtilEni veeNa
manasunna manishE manakanna minna
dikkulenni daaTaaDO sundaraanguDu
chukkalenni meeTaaDO..grandhasaanguDu
dikkulenni daaTaaDO sundaraanguDu
::::2
virahamlO mOhaalE techchinaaDE
viriSayya daahaalE penchinaaDE
manmadhuDE maanavuDai puTTinaaDE
swargamlO dEvatagaa meTTinaaDE
Emivvagaladaana nee naruniki
Emivvagala nee manOharuniki
Emivvagaladaana nee naruniki
Emivvagala nee manOharuniki
kRti lEni bratukE SRtilEni veeNa
manasunna manishE manakanna minna
dikkulenni daaTaaDO sundaraanguDu
chukkalenni meeTaaDO..grandhasaanguDu
dikkulenni daaTaaDO sundaraanguDu