Monday, July 11, 2011

పుణ్యవతి--1967
సంగీతం::ఘంటసాల
రచన::C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల

ఎంత సొగసుగా ఉన్నావూ..ఎలా ఒదిగిపోతున్నావూ
కాదనకా..ఔననకా..కౌగిలిలో దాగున్నావూ
ఎంత సుగసుగా వున్నావూ..ఆహాహాహా..
ఎలా ఒదిగి పోతున్నావూ..ఆహహాహా...
కాదనకా..అహా..ఔననకా..ఆహా..
కౌగిలిలోదాగున్నావూ..ఎంతసొగసుగా ఉన్నావూ

అందీ అందని హంసల నడకలు..ముందుకు రమ్మనెనూ..ఆ ఆ
చిందీ చిందని చిరుచిరు నవ్వులు ఎందుకు పొమ్మనెనూ..ఆ ఆ
అందీ అందని హంసల నడకలు..ముందుకు రమ్మనెనూ
చిందీ చిందని చిరుచిరు నవ్వులు ఎందుకు పొమ్మనెనూ
నీ తనువే..తాకగనే..నామది ఝుమ్మనెనూ

ఎంత సుగసుగావున్నావూ..ఆహాహాహా..
ఎలా ఒదిగి పోతున్నావూ..ఆహహాహా...
కాదనకా..అహా..ఔననకా..ఆహా..
కౌగిలిలోదాగున్నావూ..ఎంతసొగసుగా ఉన్నావూ

తడిసీ తడియని నీలికురులలో..కురిసెనుముత్యాలూ..ఆ ఆ
విరిసీ విరియని వాలుకనులలో..మెరిసెను నీలాలూ..ఆ ఆ
తడిసీ తడియని నీలికురులలో..కురిసెనుముత్యాలూ
విరిసీ విరియని వాలుకనులలో..మెరిసెను నీలాలూ
పులకించే..పెదవులపై..పలికెను పగడాలూ

ఎంత సుగసుగావున్నావూ..ఆహాహాహా..
ఎలా ఒదిగి పోతున్నావూ..ఆహహాహా...
కాదనకా..అహా..ఔననకా..ఆహా..
కౌగిలిలోదాగున్నావూ..ఎంతసొగసుగా ఉన్నావూ
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్