సంగీతం::K.V.మహాదేవన్
రచన::కోసరాజు రాఘవయ్య
గానం::S.జానకి
తారాగణం::N.T. రామారావు,లక్ష్మి,అల్లు రామలింగయ్య,ప్రభాకరరెడ్డి,పండరీబాయి,రాజబాబు,రమాప్రభ.
పల్లవి::
ఇది మరో లోకం ఇది అదో మైకం
ఇది మరో లోకం ఇది అదో మైకం
తెల్లని చీకటి నల్లని వెలుతురు
తెల్లని చీకటి నల్లని వెలుతురు
అల్లిన రంగుల వలా ఆ ఆ ఆ
ఇది మరో లోకం ఇది అదో మైకం
చరణం::1
ఇక్కడి వాళ్ళంతా వింత యోగులు
ఇక్కడి వాళ్ళంతా వింత యోగులు
వావిలేదు వరసలేదు వావిలేదు వరసలేదు
అతడులేదు ఆమెలేదు మనసుకు తెరలే లేవు
వావి లేదు వరస లేదు అతడు లేదు
ఆమె లేదు మనసుకు తెరలే లేవు
వంటికి పొరలూ అసలే లేవు లేవు
ఇది మరో లోకం ఇది అదో మైకం
చరణం::2
ఇక్కడి వాళ్ళంతా అపరదేవతలు
ఇక్కడి వాళ్ళంతా అపరదేవతలు
పగలు లేదు రాత్రి లేదు
గతం లేదు మతం లేదు
వయసెంతయినా ఒకే మత్తు
పగలు లేదు రాత్రి లేదు
గతం లేదు మతం లేదు
వయసెంతయినా ఒకే మత్తు
సొగసేదైనా అందరి పొత్తు
ఇది మరో లోకం ఇది అదో మైకం
తెల్లని చీకటి నల్లని వెలుతురు అల్లిన రంగుల వలా
ఆ ఆ ఆ ఇది మరో లోకం ఇది అదో మైకం