Thursday, May 29, 2014

సింహబలుడు--1978




సంగీతం::M.S.విశ్వనాథన్ 
రచన::వీటూరి సుందరరామూర్తి    
గానం::S.P.బాలు,P.సుశీల  
Film Directed By::k.Raghavendra Rao
తారాగణం::N.T.R.వాణిశ్రీ,మోహన్‌బాబు,జయమాలిని,అంజలిదేవి.

పల్లవి:

ఆ..అహా..అహహ..హా
ఆ..అహా..అహహ..హా
ఆహహా..ఉమ్మ్.ఉమ్మ్..ఉ 

ఓ చెలి..చలి చలి..ఇదేమి మంటలే
ఓ చెలి..చలి చలి..ఇదేమి మంటలే

నా ప్రియా..చలి గిలి మన ప్రేమ మంటలే
నా ప్రియా..చలి గిలి మన ప్రేమ మంటలే

నడి రేయిలో ఎదో ఎదో..తొలి హాయి రేగెలే
ఓ చెలి..చలి చలి..ఇదేమి మంటలే

అందమైన ఆ చలి..కోరే కౌగిలి
అందమైన ఆ చలి..కోరే కౌగిలి
ఆపలేని  నా చలి..తీర్చవే చెలి
ఓ చెలి..చలి చలి..ఇదేమి మంటలే 

చరణం::1

నేనే గువ్వనై..నా నువ్వే గూడువై..హా
నేనే గువ్వనై..నా నువ్వే గూడువై
తోడుగా..నీడగా..ఈడుగా..జోడుగా..నువ్వుంటే చాలులే

గుడిలో గంటగా..నా ఒడిలో జంటగా
గుడిలో గంటగా..నా ఒడిలో జంటగా
నీవు నా ప్రాణమై..నేను నీదాననై..మనముంటే చాలులే 

ఓ చెలి..చలి చలి..ఇదేమి మంటలే
నా ప్రియా..చలి గిలి మన ప్రేమ మంటలే
నడి రేయిలో ఎదో..ఎదో తొలి హాయి రేగెలే
ఓ చెలి..చలి చలి..ఇదేమి మంటలే   

చరణం::2

నవ్వే కన్నుల..నా నువ్వే వెన్నెల
నవ్వే కన్నుల..నా నువ్వే వెన్నెల
నింగినై పొంగనా..తారనై చేరనా..ఇక నీలో నీవుగా

ఎదలో కోరికా..నా ఎదుటే తీరగా
ఎదలో కోరికా..నా ఎదుటే తీరగా
అందమే పండగా..బంధమై ఉండనా..ఇక నేనే నీవుగా

ఓ చెలి చలి చలి..ఇదేమి మంటలే..హహా
నా ప్రియా చలి గిలి మన..ప్రేమ మంటలే
నడి రేయిలో ఎదో ఎదో..తొలి హాయి రేగెలే 
ఓ చెలి చలి చలి..ఇదేమి మంటలే
లలలలలలల..లలలలలలలా

SimhaBaludu--1978
Music::M.S.Viswanathan
Lyrics::Veetoori Sundararaamoorti
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::K.Raghavendra Rao
Cast::N.T.R. Vanisri,Mohanbabu,Jayamaalini,Anjalidevi.

::::::::::::::::::

aa..ahaa..ahaha..haa
aa..ahaa..ahaha..haa
aahahaa..umm.umm..u 

O cheli..chali chali..idEmi manTalE
O cheli..chali chali..idEmi manTalE

naa priyaa..chali gili mana prEma manTalE
naa priyaa..chali gili mana prEma manTalE

naDi rEyilO edO edO..toli haayi rEgelE
O cheli..chali chali..idEmi manTalE

andamaina aa chali..kOrE kaugili
andamaina aa chali..kOrE kaugili
aapalEni  naa chali..teerchavE cheli
O cheli..chali chali..idEmi manTalE 

::::1

nEnE guvvanai..naa nuvvE gooDuvai..haa
nEnE guvvanai..naa nuvvE gooDuvai
tODugaa..neeDagaa..iiDugaa..jODugaa..nuvvunTE chaalulE

guDilO ganTagaa..naa oDilO janTagaa
guDilO ganTagaa..naa oDilO janTagaa
neevu naa praaNamai..nEnu needaananai..manamunTE chaalulE 

O cheli..chali chali..idEmi manTalE
naa priyaa..chali gili mana prEma manTalE
naDi rEyilO edO..edO toli haayi rEgelE
O cheli..chali chali..idEmi manTalE   

::::2

navvE kannula..naa nuvvE vennela
navvE kannula..naa nuvvE vennela
ninginai ponganaa..taaranai chEranaa..ika neelO neevugaa

edalO kOrikaa..naa eduTE teeragaa
edalO kOrikaa..naa eduTE teeragaa
andamE panDagaa..bandhamai unDanaa..ika nEnE neevugaa

O cheli chali chali..idEmi manTalE..hahaa
naa priyaa chali gili mana..prEma manTalE
naDi rEyilO edO edO..toli haayi rEgelE 
O cheli chali chali..idEmi manTalE
lalalalalalala..lalalalalalalaa

మహాత్ముడు--1976



సంగీతం::T.చలపతిరావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల,V.రామకృష్ణ 
తారాగణం::అక్కినేని,శారద,ప్రభ,G.వరలక్ష్మి,జయమాలిని,సత్యనారాయణ,కాంతారావు,అల్లు రామలింగయ్య

పల్లవి::

చిట్టిపాపా..ఆ..చిన్నిపాపా
చిగురుపాపా..ఆ..చిన్నారిపాపా..ఆ 
ఎందుకో..ఆ..నిన్ను కన్నాను
ఇంకెందుకో..యిలా యిలా బ్రతికివున్నాను 
చిట్టిపాప..ఆ..చిన్నిపాప..ఆ
చిగురుపాపా..ఆ..చిన్నారిపాపా..ఆ 

చరణం::1

ఇల్లంతా..పసిడి వెలుగున్నా..ఆ
నీ తల్లిమనసు..చీకటిలా వున్నది..ఈ
ఇల్లంతా..పసిడి వెలుగున్నా..ఆ
నీ తల్లిమనసు..చీకటిలా వున్నది..ఈ
జీవితమే..ఏఏఏ..ఎడారిలా..ఆఆఅ
జీవితమే..ఎడారిలా..ఎదుట నిలిచినా..ఆ
నీ చిరునవ్వే..వూపిరిగా బ్రతికి వున్నది
బ్రతుకుతూ..ఊఊఊ..వున్నది  
చిట్టిపాపా..ఆ..చిన్నిపాపా
చిగురుపాపా..ఆ..చిన్నారిపాపా 
తీయగా..కలలే కన్నానూ
మనసు రాయిలా..ఇలాఇలా బ్రతికున్నాను
చిట్టిపాపా..ఆ..చిన్నిపాపా
చిగురుపాపా..ఆ..చిన్నారిపాపా

చరణం::2

మీ నాన్న..ఆ..నన్ను కదన్నా..ఆ
నా ప్రాణంలా నిన్ను చూసుకుంటాను 
మీ నాన్న..ఆ..నన్ను కదన్నా..ఆ
నా ప్రాణంలా..నిన్ను చూసుకుంటాను 
ఈలోకం ఆ దైవం..ఈలోకం ఆ దైవం ఏమంటున్నా 
ఈ పాపను కనుపాపగ కాచు కుంటాను..కాపాడుకుంటాను        
చిట్టిపాప..ఆ..చిన్నిపాప..ఆ..చిగురుపాపా చిన్నారిపాపా 
ఎందుకో..ఓఓ..నిన్ను కన్నాను..ఊఊ
మనసు రాయిగా..యిలా యిలా బ్రతికివున్నాను 
చిట్టిపాపా.ఆ..చిన్నిపాపా..ఆ..
చిగురుపాపా..ఆ..చిన్నారిపాపా..ఆ