Wednesday, December 28, 2011

బంగారు చెల్లెలు--1979

సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::P.సుశీల

పల్లవి::

అన్నయ్య హృదయం దేవాలయం
చెల్లెలే ఆ గుడి మణిదీపం..ఊ..ఊ..
అన్నయ్య హృదయం దేవాలయం
చెల్లెలే ఆ గుడి మణిదీపం
అనురాగమే కొలువున్న దైవం
అనుబంధమే గోపురం
మా అనుబంధమే గోపురం

అన్నయ్య హృదయం దేవాలయం..ఊ..ఊ..

చరణం::1

పంచుకొన్నది ఒకటే రక్తం..పెంచుకొన్నది ఒకటేపాశం
పంచుకొన్నది ఒకటే రక్తం..పెంచుకొన్నది ఒకటేపాశం

పంచుకొన్నది ఒకటే రక్తం..పెంచుకొన్నది ఒకటేపాశం
పంచుకొన్నది ఒకటే రక్తం..పెంచుకొన్నది ఒకటేపాశం
బ్రతుకున్నది ఆ పాశం కోసం..బ్రతుకున్నది ఆ పాశం కోసం
కోరుకొన్నది ఇద్దరి క్షేమం....

అన్నయ్య హృదయం దేవాలయం
చెల్లెలే ఆ గుడి మణిదీపం
అన్నయ్య హృదయం దేవాలయం

చరణం::2

ఊయలలూపి జోలలు పాడే తల్లి నెరగను..ఊ..ఊ..
మోసుకు తిరిగి ముచ్చట తీర్చే తండ్రినెరగనూ..ఊ..ఊ..
కళ్ళు తెరచి నే చూచినదే ఆ కరుణామూర్తినీ
మాట నేర్చి నే పిలిచినదే అన్నా.. అన్నదీ

అన్నయ్య హృదయం దేవాలయం
చెల్లెలే ఆ గుడి మణిదీపం

చరణం::3

కృష్ణుడు పల్కిన గీతవాక్కు..వేదం అయినాయినా ఎందుకు నాకూ..ఊ..ఊ..
కృష్ణుడు పల్కిన గీతవాక్కు..వేదం అయినాయినా ఎందుకు నాకూ..ఊ..ఊ..
నా పాలి వేదం అన్నయ్య పలుకు..నా పాలి వేదం అన్నయ్య పలుకు
అన్నయ్య నవ్వే నా దారి వెలుగు..ఊ..ఊ..

అన్నయ్య హృదయం దేవాలయం
చెల్లెలే ఆ గుడి మణిదీపం
అనురాగమే కొలువున్న దైవం
అనుబంధమే గోపురం
మా అనుబంధమే గోపురం

అన్నయ్య హృదయం దేవాలయం..ఊ..ఊ..