Monday, October 17, 2011

అభిమానవంతులు--1973




సంగీతం::S.P.కోదండపాణి
రచన::C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
నిర్మాత::M.రామకృష్ణారెడ్డి, బి. నరసింహారావు
దర్శకత్వం::K.S.రామిరెడ్డి
సంస్థ::శ్రీరామకృష్ణ ఫిలింస్
తారాగణం::కృష్ణంరాజు, శారద, ఎస్.వి.రంగారావు,అంజలీదేవి


పల్లవి:::

ఈ వీణపైన పలికిన రాగం
నాలోన విరిసిన అనురాగం

ఈ వీణపైన పలికిన రాగం
నాలోన విరిసిన అనురాగం
మీటితే మ్రోగేది రాగం
ఎలమాటుగా పెరిగేది అనురాగం
ఈ వీణపైన పలికిన రాగం
నాలోన విరిసిన అనురాగం

చరణం::1

కలిమిలోన మిడిసిపడనిది
లేమిలోన కలతపడనిది
ఇరువురి నడుమ ఎల్లలులేనిది
ఇరువురి నడుమ ఎల్లలులేనిది
వలచిన హృదయాల తొలికలయిక ఆ ఆ ఆ ఆ

ఈ వీణపైన పలికిన రాగం
నాలోన విరిసిన అనురాగం

చరణం::2

కనిపించు ఆతని చిరునవ్వులోన
కవితలకందని మధురభావన ఆ ఆ ఆ ఆ
కనిపించు ఆతని చిరునవ్వులోన
కవితలకందని మధురభావన
ఆ భావనయే ఆరాధనగా
ఆ భావనయే ఆరాధనగా
అతనికి నేనే ఒక కానుక ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ఈ వీణపైన పలికిన రాగం
నాలోన విరిసిన అనురాగం

అభిమానవంతులు--1973








సంగీతం::SP.కోదండపాణి
రచన:: C.నారాయణరెడ్డి
గానం::వాణి జయరాం (తొలి పాట)



పల్లవి:

ఎప్పటివలెకాదురా
ఎప్పటివలెకాదురా నా స్వామి ఎప్పటివలెకాదురా
ఈ ముద్దు ఈ మురిపమే పొద్దు ఎరుగములేరా
ఎప్పటివలెకాదురా నా స్వామి ఎప్పటివలెకాదురా

చరణం1:

పున్నమి కళలన్ని మోమున ముడిచి
అమృత మాధురులు అధరాన దాచి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పున్నమి కళలన్ని మోమున ముడిచి
అమృత మాధురులు అధరాన దాచి
నిన్నలేని రమణీయ రూప
నవనీత కాంతితో ఉన్నానురా
అభినయం నాదిరా అనుభవం నీదిరా
అభినయం నాదిరా అనుభవం నీదిరా
చిలుక కులుకులో పలుక పలుకులో
లలితరాగమును చిలకరించెరా
ఎప్పటివలెకాదురా నా స్వామి ఎప్పటివలెకాదురా

చరణం2:

పదును చూపుతో మదనుని కవ్వించి
చిగురు నవ్వుతో కథలను రగిలించి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పదును చూపుతో మదనుని కవ్వించి
చిగురు నవ్వుతో కథలను రగిలించి
అందలేని ఆనందలోక నవనందనాల తేలించేనురా
లాలనం నాదిరా పాలనం నీదిరా
లాలనం నాదిరా పాలనం నీదిరా
వసంత వేళల రసైక లీలల
నిశింకముల పరవశించెరా

ఎప్పటివలె
ఎప్పటివలెకాదురా నా స్వామి ఎప్పటివలెకాదురా
సా నినిసని ని దసనిద
మమదగ దగమమ నినిదగ నినినిని గరిస నిదని గమదనిరిస
ఎప్పటివలెకాదురా