Wednesday, June 06, 2012

పెళ్ళికాని పిల్లలు--1961




సంగీతం::మాష్టర్ వేణు
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల

తారాగణం:: జమున..జగ్గయ్య ,కాంతారావు..హరనాథ్..G.రామకృష్ణ..B.పద్మనాభం..రమణారెడ్డి
చలం..సూర్యకాంతం..హేమలత

పల్లవి::

ప్రియతమా రాధికా
ప్రియతమా రాధికా రావే 
రయమున కలియవె ప్రేమాభిసారిక
ప్రియతమా రాధికా రావే
రయమున కలియవె ప్రేమాభిసారిక
ప్రియతమా రాధికా

చరణం::1

పరువము నీ మేన పరుగులు తీయా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ  
పరువము నీ మేన పరుగులు తీయా
చరణాల కింకిణులు స్వరమేళ పాడా
చరణాల కింకిణులు స్వరమేళ పాడా 
ప్రియతమా రాధికా రావే
రయమున కలియవె ప్రేమాభిసారిక
ప్రియతమా రాధికా 

చరణం::2

కడవ నిడుకొనీ కలహంస నడతో
విడువని బిడియాన వేమారు వెదకీ
కడవ నిడుకొనీ కలహంస నడతో
విడువని బిడియాన వేమారు వెదకీ
అడుగులు తడబడ నడుమల్లాడా 
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ 
అడుగులు తడబడ నడుమల్లాడా
వడి వడిగ నడిచేటి వనితా లలామా
ప్రియతమా రాధికా..రావే
రయమున కలియవె ప్రేమాభిసారిక 
ప్రియతమా..రాధికా 
ఆ ఆ ఆ....ప్రియతమా రాధికా 
ఆ ఆ ఆ....ప్రియతమా రాధికా 
ఆఆఆ ఆఆఆ
నిరిరి నిగరిరిమ గమగ గదమమని 
గారిసనిద సానిదపమ దాపమగరి
గమదని గరిసనిదని గరిగరినిదనిద 
గరిసనిదప మదపమగరిగరిసని 
ప్రియతమా..రాధికా రావే 
రయమున కలియవె ప్రేమాభిసారిక 
ప్రియతమా రాధికా..ఆ..ఆ..ఆ

ప్రియతమా రాధికా రాధికా రాధికా..ఆ..ఆ

పెళ్ళికాని పిల్లలు--1961

మధురమైన ఈ పాట మీకు వినాలని ఉంటే ఇక్కడ క్లిక్ చేయండి

సంగీతం::మాష్టర్ వేణు
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల,ఘంటసాల

తారాగణం::జగ్గయ్య,జమున,కాంతారావు,చలం,హరనాధ్,రామకృష్ణ,పద్మనాభం.

పల్లవి::

మొన్న నిన్ను చూసాను..నిన్న మనసు కలిపాను
నేటినుండి నిన్నే తలచి..వెర్రివాడనయినాను

మొన్న నిన్ను చూసాను..నిన్న మనసు కలిపాను
నేటినుండి నిన్నే తలచి..వెర్రివాడనయినాను
మొన్న నిన్ను చూసాను.

చరణం::1

లోకానికి చల్లని గాలి..నా పాలిట వడగాలి
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
లోకానికి చల్లని గాలి..నా పాలిట వడగాలి
పగలే పెనుచీకటి కాగా..నీ మోమే జాబిలి
తాళలేను జాలి తలచి..నీ వానిగ చేయాలి

మొన్న నిన్ను చూసాను..నిన్న మనసు కలిపాను
నేటినుండి నిన్నే తలచి..వెర్రివాడనయినాను
మొన్న నిన్ను చూసాను.

చరణం::2

కనులు తెరచి జగమే మరచి..కలలు వేయి కంటాను
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
కనులు తెరచి జగమే మరచి..కలలు వేయి కంటాను
కలలోను మేను మరచి..చెలి మాటే వింటాను
నాలో కల తీయని బాధ..ఎలా తెలుపుకుంటాను

మొన్న నిన్ను చూసాను..నిన్న మనసు కలిపాను
నేటినుండి నిన్నే తలచి..వెర్రివాడనయినాను
మొన్న నిన్ను చూసాను.