Monday, November 03, 2014

వేట--1986





















సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి సుందర రామమూర్తి
గానం::K.J.ఏసుదాస్  

పల్లవి::

ఓ లేడి కూన..ఈ వేటలోన 
అలిసేవు..పరుగులోన
ఓ లేడి కూన..ఈ వేటలోన 
అలిసేవు..పరుగులోన
ఎవరూ..తోడు రారు
నడిరేయే..నీకు తోడు
విధి నిను తరిమిన..ఈ ఆట వేట

చరణం::1

పసుపు కుంకుమలు ఒకవైపు
ప్రేమ సంకెలలు ఒకవైపు
పసుపు కుంకుమలు ఒకవైపు
ప్రేమ సంకెలలు ఒకవైపు
జరిగే ఈ సంకుల సమరంలో
కన్నీరే మిగిలేను బ్రతుకంతా ఇక రగిలేను
ఏ రక్కసి..వికృత హాసమిది
ఏ కర్కశ..ముష్కర హస్తమిది
ఇది కత్తుల..బోనమ్మా
ఇది నెత్తుటి..వానమ్మా

ఓ లేడి కూన..ఈ వేటలోన 
అలిసేవు..పరుగులోన

చరణం::2

నమ్మిన నెచ్చెలి కోసమని
ఆశను ఊపిరి చేసుకుని
నమ్మిన నెచ్చెలి కోసమని
ఆశను ఊపిరి చేసుకుని
నరకాన్ని గెలిచినా ఫలితమిదా
గెలుపంతా ఓటమని
చెలి వలపంతా మోసమని
తెలిసిన హృదయం పగిలేను
పగతో సెగలై ఎగసేను
ఇది విషనాగుల లోకం
కసి బుస కొట్టే కాలం

ఓ లేడి కూన..ఈ వేటలోన 
అలిసేవు..పరుగులోన
ఎవరూ..తోడు రారు
నడిరేయే..నీకు తోడు
విధి నిను తరిమిన..ఈ ఆట వేట

మనుషుల్లో దేవుడు--1974


సంగీతం::T.V.రాజు S.హనుమంతరావు
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::S.P.బాలు
Film Directed By::B.V.Prasad
Barla Venkata Varaprasad 
తారాగణం::N.T.రామారావు,వాణిశ్రీ,గుమ్మడి,బి.సరోజ,కృష్ణంరాజు,శారద,సూర్యకాంతం,అంజలిదేవి,విజయలలిత,రాజబాబు,రమాప్రభ. 

పల్లవి::

హే రేఖా..శశిరేఖా..చిర్రు బుర్రులెందుకు
చెట్టా పట్టాలేసుకో..కోపమా..తాపమా
అయ్యొ రామా..అయ్యొ రామా..అయ్యొ రామా

చరణం::1

ఓ సఖీ..మండె చెకుముకి
చురచుర చూపులే చూడకూ
ముక్కున కోపమూ..మొదటికి మోసమూ
అదేనేమో..ఆడపిల్లకు అందమూ
అవునా?
కోపమా..తాపమా
కోపమా..తాపమా
అయ్యొ రామా..అయ్యొ రామా..అయ్యొ రామా

చరణం::2

ఓ చెలి..రగిలే జాబిలి..ఉరుములు మెరుపులు మానుకో
తొలకరి జల్లులు..తడిసిన మల్లెలా
తొలకరి జల్లులు..తడిసిన మల్లెలా..ఇలా ఇలా ఇలా ఒదిగిపో
ఏమంటావ్ ?
కోపమా..తాపమా..కోపమా..తాపమా
అయ్యొ రామా..అయ్యొ రామా..అయ్యొ రామా

చరణం::3

నీ మది..పొరబడుతున్నది..నిజమేదో ఎరుగకున్నది
అలజడి తగ్గితే..నిలకడ కుదిరితే
అలజడి తగ్గితే..నిలకడ కుదిరితే 
అదే అదే అదే తెలుస్తుందిలే..అసలు కథ
కోపమా..తాపమా..కోపమా..తాపమా
అయ్యొ రామా..అయ్యొ రామా..అయ్యో రామా

Manushullo Devudu--1974
Music::T.V.Raaju,S.Hanumantarao
Lyrics::D.C.Naaraayanareddi
Singer::S.P.Baalu
Film Directed By::B.V.Prasad
Barla Venkata Varaprasad 
Cast::N.T.RaamaaRao,Vaanisree,Gummadi VenkateswaraRao,Sooryakaantam,Saarada,Vijayalalita,KrishnamRaju,Anjalidevi,Raajabaabu,Ramaaprabha.

::::::::

hE rEkhaa..SaSirEkhaa..chirru burrulenduku
cheTTaa paTTaalEsukO..kOpamaa..taapamaa
ayyo raamaa..ayyo raamaa..ayyo raamaa

::::1

O sakhee..manDe chekumuki
churachura choopulE chooDakoo
mukkuna kOpamoo..modaTiki mOsamoo
adEnEmO..aaDapillaku andamoo
avunaa?
kOpamaa..taapamaa
kOpamaa..taapamaa
ayyo raamaa..ayyo raamaa..ayyo raamaa

::::2

O cheli..ragilE jaabili..urumulu merupulu maanukO
tolakari jallulu..taDisina mallelaa
tolakari jallulu..taDisina mallelaa..ilaa ilaa ilaa odigipO
EmanTaav ?
kOpamaa..taapamaa..kOpamaa..taapamaa
ayyo raamaa..ayyo raamaa..ayyo raamaa

::::3

nee madi..porabaDutunnadi..nijamEdO erugakunnadi
alajaDi taggitE..nilakaDa kudiritE
alajaDi taggitE..nilakaDa kudiritE 
adE adE adE telustundilE..asalu katha
kOpamaa..taapamaa..kOpamaa..taapamaa
ayyo raamaa..ayyo raamaa..ayyO raamaa