సంగీతం::S.P.కోదండపాణి
రచన::ఆరుద్ర
రచన::S.P.బాలు ,P.సుశీల
నటీ,నటులు::రామకృష్ణ, చంద్రమోహన్,వాణిశ్రీ,
S.V.రంగారావ్,హరినాత్,జయలలిత
పల్లవి::
ఓ..అందాలు చిందే ఆ కళ్ళలోనే
బంగారు కలలే దాగున్నవి
అందాలు చిందే ఆ కళ్ళలోనే
బంగారు కలలే దాగున్నవి
అవి రేకులు విరిసి నీకైవేచి
రేయీపగలు తీయని వగలై దాగున్నవి
ఓ..అందాలు చిందే ఆ కళ్ళలోనే
బంగారు కలలే దాగున్నవి
చరణం::1
చిరుగాలిలాగా సెలఏరులాగా
చెలరేగే తీయని పరువం ఏమన్నదీ
చిరుగాలిలాగా సెలఏరులాగా
చెలరేగే తీయని పరువం ఏమన్నదీ
అనురాగం జిల్లునసోకే ఆనందం వెల్లువదూకే
అనురాగం జిల్లునసోకే ఆనందం వెల్లువదూకే
ఆరోజు రానీరానీ అంటున్నదీ..
ఓ..అందాలు చిందే ఆ కళ్ళలోనే
బంగారు కలలే దాగున్నవి
చరణం::2
మనసైన నీవే పెనవేయగానే
అణువణువు ఏమో ఏమో అవుతున్నదీ
మనసైన నీవే పెనవేయగానే
అణువణువు ఏమో ఏమో అవుతున్నదీ
నీజడలో మల్లెలు పలికే..నా ఎదలో తేనెలు చిలికే
నీజడలో మల్లెలు పలికే..నా ఎదలో తేనెలు చిలికే
ఆ రేయి నేడే నేడే రానున్నదీ..
ఓ..అందాలు చిందే ఆ కళ్ళలోనే
బంగారు కలలే దాగున్నవి
అవి రేకులు విరిసి నీకైవేచి
రేయీపగలు తీయని వగలై దాగున్నవి
ఓ..అందాలు చిందే ఆ కళ్ళలోనే
బంగారు కలలే దాగున్నవి
లలలాల్లలాలా..లలల్లాల్లలాలా..
లలలాల్లలాలా..లలల్లాల్లలాలా..