Tuesday, May 17, 2011

శంకరాభరణం--1980

సంగీతం::K.V.మహాదేవన్
రచన::మైసూర్ వాసుదేవాచార్య  
గానం::S.P.బాలు,వాణీజయరా  
తారాగణం::J.V.సోమయాజులు,చంద్రమోహన్,అల్లు రామలింగయ్య,మంజు భార్గవి,రాజ్యలక్ష్మి

పల్లవి::

బ్రోచేవారెవరురా నిను విన..నిను విన
రఘువరా..రఘువరా
నను బ్రోచేవారెవరురా నిను విన రఘువరా

నీ చరణాం భుజములు నే
నీ చరణాం భుజములు నే
విడజాల కరుణాలవాల
బ్రోచేవారెవరురా..ఆ..ఆ 

చరణం::1

ఓ చతురా ననాది వందిత..నీకు పరాకేలనయ్యా
ఓ చతురా ననాది వందిత..నీకు పరాకేలనయ్యా
ఓ చతురా ననాది వందిత..నీకు పరాకేలనయ్యా

నీ చరితము పొగడలేని నా చింత తీర్చి వరములీచ్చి వేగమే
నీ చరితము పొగడలేని నా చింత తీర్చి వరములీచ్చి వేగమే

స సనిదపద నిస నినిదదపమ
పాదమ గా మా పదాని సనిదపమ నీదాపమా
గమపద మగరిస సమా గమపద మాపదని
ససరిని నినిసదా దదనిపాద మపదని
సనిదప మగమనిదని పద మా పదనీ
సమా గరిస రిసానిదప సానిదపమ గామపదని
బ్రోచేవారెవరురా..ఆ ఆ

చరణం::2

సీతాపతే నాపై నీకభిమానము లేదా
సీతాపతే నాపై నీకభిమానము లేదా
వాతాత్మజార్చిత పాద నా మొరలను వినరాదా
భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా
భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా
భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా
నా పాతకమెల్ల పోగొట్టి గట్టిగ నా..చేయి పట్టి విడువక

స సనిదపద నిస నినిదదపమా
పాదమా గా మా పాదాని సనిదపమ నీదపమ
గమపద మగరిస సమా గమపద మాపదని
ససరిని నినిసదా దదనిపాద మపదని
సనిదప మగమనిదని పద మా పదనీ
సమా గరిస రిసానిదప సానిదపమా గామపదని
బ్రోచేవారెవరురా ఆ ఆ

రాముని మించిన రాముడు--1975

సంగీతం::సూరవరాజు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,V.రామకృష్ణ 
తారాగణం::N.T.రామారావు,ప్రభాకర రెడ్డి,త్యాగరాజు,అల్లు రామలింగయ్య,వాణిశ్రీ,శ్రీవిద్య,S.వరలక్ష్మి

పల్లవి :

ఎవ్వరిదీ యీ విజయం..ఎవ్వరిదీ యీ విజయం 
నీది నాదీ అందరిదీ..యీ విజయం 
అందరిదీ...యీ విజయం
మీ అందరిదీ...యీ విజయం 
దేశరక్షణకు ప్రాణాలొడ్డిన ధీరులదే యీ విజయం
అందరిదీ యీ విజయం..మీ అందరిదీ యీ విజయం 

చరణం::1

లార లార లార లార లా ల ల్ల ల్లా రా ల్లా రా
హిప్ హిప్ హూ రా..ఓహో హో హో హో హో
మంచు కొండలను నిలచీ మండు టెండలను సైచీ
మంచు కొండలను నిలచీ మండు టెండలను సైచీ
కంటికి కునుకే కరువై పోగా కన్నవారలే దూరంకాగా
రక్త తర్పణ౦ చేసిన సైనిక శక్తులదే యీ 
విజయం...విజయం...విజయం        
అందరిదీ యీ విజయం..మీ అందరిదీ యీ విజయం 
దేశరక్షణకు ప్రాణాలొడ్డిన ధీరులదే యీ విజయం
అందరిదీ యీ విజయం..మన అందరిదీ యీ విజయం 

చరణం::2

లార లార లార లార లా ల ల్ల ల్లా రా ల్లా రా
హిప్ హిప్ హూ రా..ఓహో హో హో హో హో
బాంబుల వర్షం కురిసినా ప్రళయ ఝ౦ఝలే వీచినా
బాంబుల వర్షం కురిసినా ప్రళయ ఝ౦ఝలే వీచినా
కుత్తుకలే తెగిపోతూ వున్నా గుండెలు రెండుగ చీలతువున్నా
ఎత్తిన జెండా దించని భారత పుత్రులదే యీ 
విజయం...విజయం...విజయం 
అందరిదీ యీ విజయం..మీ అందరిదీ యీ విజయం 
దేశరక్షణకు ప్రాణాలొడ్డిన ధీరులదే యీ విజయం
అందరిదీ యీ విజయం..మన అందరిదీ యీ విజయం 

చరణం::3

తుదిరక్తపు బిందువు చిందించిన మృతవీరులదే యీ విజయం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పెను మృత్యువునే ఎదిరించినట్టి క్షతగాత్రులదే యీ విజయం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
తుదిరక్తపు బిందువు చిందించిన మృతవీరులదే యీ విజయం
యీ విజయం
పెను మృత్యువునే ఎదిరించినట్టి క్షతగాత్రులదే యీ విజయం
యీ విజయం
ప్రాణ దాతలది..యీ విజయం..యీ విజయం
జాతి నేతలది యీ విజయం ఈ విజయం యీ విజయం
అందరిదీ యీ విజయం..మీ అందరిదీ యీ విజయం 
దేశరక్షణకు ప్రాణాలొడ్డిన ధీరులదే యీ విజయం
అందరిదీ యీ విజయం..మన అందరిదీ యీ విజయం 
లార లార లార లార లా ల ల్ల ల్లా రా ల్లా రా
లార లార లార లార లా ల ల్ల ల్లా రా ల్లా రా