Saturday, July 04, 2015

శ్రీ కృష్ణార్జున యుద్ధం--1963::కాపీ::రాగం



సంగీతం::పెండ్యాల నాగేశ్వర రావు
రచన::పింగళి నాగేంద్ర రావు 
గానం::P.సుశీల 
తారాగణం::N.T. రామారావు,అక్కినేని,కాంతారావు,B. సరోజాదేవి,S. వరలక్ష్మి, ధూళిపాళ,
అల్లు రామలింగయ్య.
కాపీ::రాగం 

పల్లవి::

నీకై వేచితినయ్యా..ఓ..ఏకాంత రామయ్యా..ఆ
నీకై కాచితినయ్యా..ఆ..ఆ

నీకై వేచితినయ్యా..ఓ..ఏకాంత రామయ్యా..ఆ
నీకై కాచితినయ్యా..ఆ..ఆ..నీకై కాచితినయ్యా 

చరణం::1

నీవీ క్షణమున వచ్చెదవోయని
ఎదురులు చూచితినయ్యా..ఆ
ఎదురులు చూచితినయ్యా..ఆ
నీవు నడతువని త్రోవ త్రోవల
పూవుల పరచితినయ్యా..ఆ
నీకై వేచితినయ్యా..ఓ..ఏకాంత రామయ్యా
నీకై కాచితినయ్యా..ఆ

చరణం::2

చిగురాకులలో గాలి కదిలినా
నీవని భ్రమచితినయ్యా..ఆ
నీవని భ్రమచితినయ్యా..ఆ
చిలుక పలికినా నీ పిలుపేయని
ఉలుకున కలగితినయ్యా..ఆ
నీకై వేచితినయ్యా..ఓ..ఏకాంత రామయ్యా
నీకై కాచితినయ్యా..ఆ

చరణం::3 

నీకు ప్రియముగా విరిసిన పూవుల 
మాలికలల్లితినయ్యా..ఆ..మాలికలల్లితినయ్యా
మనసున నిలిచిన మంగళ రూపము
ఎన్నడు చూచెదనయ్యా..ఆ
నీకై వేచితినయ్యా..ఓ..ఏకాంత రామయ్యా..ఆ
నీకై కాచితినయ్యా..ఆ..ఆ..నీకై కాచితినయ్యా