Tuesday, February 24, 2015

ఒకే రక్తం--1977



సంగీతం::సత్యం
రచన::దాశరధి
గానం::S.P.బాలు
Film Directed by::P.Chandrashekar Reddy
తారాగణం::క్రిష్ణంరాజు,జయప్రద,నాగభుషణం,సత్యనారాయణ.

పల్లవి::

ఎహేహే..కాటుక కన్నుల అమ్మాయి
నీ మాటలు తీయని సన్నాయి

ఎహేహే..కాటుక కన్నుల అమ్మాయి
నీ మాటలు తీయని సన్నాయి 

అలకలెందుకే..కలతనేలనే
ఆశలు నీపై ఉన్నాయి 

ఎహేహే..కాటుక కన్నుల అమ్మాయి
నీ మాటలు తీయని సన్నాయి

చరణం::2

హా..చెంపల మీద ఎరుపు చూసి
కెంపులనుకొన్నాను..
పెదవులమీద ఎరుపుచూసి హరివిల్లనుకొన్నాను

హా..చెంపల మీద ఎరుపు చూసి
కెంపులనుకొన్నాను..
పెదవులమీద ఎరుపుచూసి హరివిల్లనుక్
ఏలా బిగువేలా..హ్హా..రావా నను చేర

ఎహేహే..చెంపల మీద ఎరుపు చూసి
కెంపులనుకొన్నాను..
పెదవులమీద ఎరుపుచూసి హరివిల్లనుక్

చరణం::2

కానివేళలో అవునంటావు..అదేమి అన్యాయం
ఐనవేళలో కాదంటావు..ఇదేమి విడ్డూరం..మ్మ్..మ్మ్..

కానివేళలో అవునంటావు..అదేమి అన్యాయం
ఐనవేళలో కాదంటావు..ఇదేమి విడ్డూరం
చాలూ..కోపాలూ..అహా నేనే నీపాలు

ఎహేహే..కాటుక కన్నుల అమ్మాయి
నీ మాటలు తీయని సన్నాయి

చరణం::3

అహ్హా..కలువలవంటీ..కన్నులతోటీ కత్తులు విసిరేవా
నిన్నే నమ్మిన..నీ చెలికాన్ని..చంపుకొనితింటావా..హ్హా

కలువలవంటీ..కన్నులతోటీ కత్తులు విసిరేవా
ఓయ్..నిన్నే నమ్మిన..నీ చెలికాన్ని..చంపుకొనితింటావా
రాదా దయరాదా..నాతో రారాదా

ఎహేహే..కాటుక కన్నుల అమ్మాయి
నీ మాటలు తీయని సన్నాయి

అలకలెందుకే..కలతనేలనే
ఆశలు నీపై ఉన్నాయి 

ఎహేహే..కాటుక కన్నుల అమ్మాయి
నీ మాటలు తీయని సన్నాయి