" జోసప్ గారి స్వరమాధుర్యముతో సి.నారాయణ రెడ్డి గారి రచనలో భక్తి శౄంగారాలతో కలబోసి వీనులవిందుగా మన మనసులను దోచుకొన్న ఈ పాట "ఘంటసాల,సుశీల " గారి గొంతునుండి జాలువారిన మరో ఆణిముత్యం
సంగీతం:::జొసెప్-క్రిష్ణ మూర్తి
రచన::C.నారాయణ రెడ్డి.
గానం: :ఘంటసాల, p.సుశీల
!!ఆభేరి రాగ !!
నన్నుదోచుకొందువటే
వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు
నిన్నె నా స్వామి
నిన్నె నా స్వామి....
నన్ను దోచుకొందువటే...
తరియించును నీ చల్లని
చరణమ్ముల నీడలోన
తరియించును నీ చల్లని
చరణమ్ముల నీడలోన
పూల దండ వోలే
కర్పూర కళిక వోలే
కర్పూర కళిక వోలే
యెంతటి నెరజాణవు
నా అంత రంగమందు నీవు
యెంతటి నెరజాణవు
నా అంత రంగమందు నీవు
కలకాలము వీడని
సంకెలలు వేసినావు
సంకెలలు వేసి నావు
!! నన్ను దోచుకొందువటే
నన్ను దోచుకొందువటే
వన్నెల దొరసాని
కన్నులలొ దాచుకొందు
నిన్నె నా స్వామి
నిన్నె నా స్వామి....
నన్ను దోచుకొందువటే... !!
నా మదియే మందిరమై
నీవే ఒక దేవతవై
నా మదియే మందిరమై
నీవే ఒక దేవతవై
వెలసినావు నాలో
నె కలసిపోదు నీలో
కలసి పోదు నీలో
యేనాటిదొ మన బంధం
యెరుగ రాని అనుబంధం
యేనాటిదొ మన బంధం
యెరుగ రాని అనుబంధం
యెన్ని యుగాలైన ఇది
ఇగిరి పోని గంధం
ఇగిరిపొని గంధం
!!! నన్ను దోచుకొందువటే
వన్నెల దొరసాని
కన్నులలొ దాచుకొందు
నిన్నె నా స్వామి
నిన్నె నా స్వామి....
నన్ను దోచుకొందువటే...!!!