Wednesday, September 28, 2011

బుల్లెమ్మా బుల్లోడు --1972

సంగీతం::చెళ్ళపిళ్ళ సత్యం
రచన::రాజశ్రీ
గానం::S.P.బాలు

తారాగణం::చలం,సత్యనారాయణ,ధూళిపాళ,త్యాగరాజు,విజయలలిత,పండరీబాయి,బాలకృష్ణ 

::::::::::

బుడిగి బుడిగి నిన్నే నిన్నే చూడు బుల్లెమ్మా
మాటాడు చిలకమ్మ నీకు నాకు జోడి రాసాడు ఆ బ్రహ్మా
నీకు నాకు జోడి రాసాడు ఆ బ్రహ్మా

నవ్వులలోన పువ్వులు రువ్వే కొంటె చిట్టెమ్మా
నవ్వులలోన పువ్వులు రువ్వే కొంటె చిట్టెమ్మా
నువ్వేలే నారాణి నీమీద ఒట్టమ్మా

బుడిగి బుడిగి నిన్నే నిన్నే చూడు బుల్లెమ్మా
మాటాడు చిలకమ్మ నీకు నాకు జోడి రాసాడు ఆ బ్రహ్మా

ఆమె::ఏయ్ అలా చూస్తావే
ఎలాఉంది ఒళ్ళు
కావాలా నోర్మూయ్ ఛిపో..

అతడు::-
నోటితో నువు పొమ్మంటున్నా చూపునన్నే రమ్మంటుంది
కన్నె పొగరు వద్దంటున్నా మనసు నన్నే కావాలంటుంది
ఈ కోపం ఈ పంతం అంతా నాటకం..

బుడిగి బుడిగి నిన్నే నిన్నే చూడు బుల్లెమ్మా
మాటాడు చిలకమ్మ నీకు నాకు జోడి రాసాడు ఆ బ్రహ్మా

ఆమె::-ఏయ్ మీద పడతావేం
ఒంటరిదాన్ననా వెంటపడుతున్నావ్
హా..నన్నే పట్టుకొంటావా నీకెన్ని గుండెలు ఛీపో..

గుండెల్లోనా గాలమేసీ ఒడుపుగ నువ్వు దోచావు నన్ను
అడుగుదాటి కదలనీను నీడలాగ ఉంటాను నేను
నీ అలక నా పులక పెనవేసుకోవాలి

బుడిగి బుడిగి నిన్నే నిన్నే చూడు బుల్లెమ్మా
మాటాడు చిలకమ్మ నీకు నాకు జోడి రాసాడు ఆ బ్రహ్మా
హాయ్..నీకు నాకు జోడి రాసాడు ఆ బ్రహ్మా

పసివాడి ప్రాణం --1987

సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు , P.సుశీల 

పల్లవి::

అందం శరణం గచ్చామి
అధరం శరణం గచ్చామి
ఈ సాయంత్ర వేళ నీ ఏకాంతసేవ
అతి మధురం అనురాగం
ఒదిగే వయ్యారం

ప్రణయం శరణం గచ్చామి
హృదయం శరణం గచ్చామి
ఈ సింధూర వేళ నీ శృంగార లీల
సుఖ శిఖరం శుభయోగం
అది నా సంగీతం

చరణం::1

ఇంతకు తీరని ఎదలో ఆశలేమో
అడగరానిదై చెప్పరానిదై
పెదవుల అంటింతనై
మాటతో తీరని మదిలో దాహమే
చిలిపి ముద్దుకై చినుకు తేనెకై
కసికసి కవ్వింతలై
నీ నవ్వు నాలో నాట్యాలు చేసే
కౌగిట్లో సోకమ్మ వాకిట్లో
తెరిచే గుప్పిళ్ళలోన 

ప్రణయం శరణం గచ్చామి
హృదయం శరణం గచ్చామి

చరణం::2

చూపుతో గిచ్చక వయసే లేతదమ్మా
వలపు గాలికే వాడుతున్నది
విసరకు పూబాణమే
చేసుకో మచ్చిక వరసే కొత్తదమ్మా
చలికి రేగిన ఒడికి చేరిన
చెరి సగమీ ప్రాణమే
నీ ఊపిరే నాలో పూలారబోసి
అందాలో నా ప్రేమ గంధాలో
ముసిరే ముంగిళ్ళలోన

అందం శరణం గచ్చామి
హృదయం శరణం గచ్చామి
ఈ సాయంత్ర వేళ నీ ఏకాంతసేవ
సుఖ శిఖరం శుభయోగం

అది నా సంగీతం