Thursday, May 19, 2011

రాజా-రమేష్--1977



సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,జగ్గయ్య,కాంచన,విజయలలిత,జయమాలిని,K.V.చలం

పల్లవి::

చంద్రుడు..కనపడలేదనీ..ఈ..వెన్నెలా
వేరే చోటుకు వెళుతుందా..ఆహా 

చంద్రుడు..కనపడలేదనీ..ఈ..వెన్నెలా
వేరే చోటుకు వెళుతుందా..వేరే చోటుకు వెళుతుందా..ఆ 

మధుపం లేదని మందారం..తన మధువునూ 
కందిరీగకు అందిస్తుందా..వహ్‌వా  

మధుపం లేదని మందారం..తన మధువునూ
కందిరీగకు అందిస్తుందా

నాదిర్‌దిన్నా నాదిర్‌దిన్నా నాదిర్‌దిన్నా నాదిర్‌దిన్నా  
నాథాదింతా తకిటాదింతా తకిట తికట థా..థా థా
తకిట తికిట థా..థా థా తకిట తికిట థా థా

చరణం::1

తమలపాకు పాదాలైనా..తాండవనృత్యం చేయుటలేదా
తమలపాకు పాదాలైనా..తాండవనృత్యం చేయుటలేదా

పిడికెడు గుండె మనిషికి ఉన్నా..కడివెడు ప్రేమను మోయుటలేదా
పిడికెడు గుండె మనిషికి ఉన్నా..కడివెడు ప్రేమను మోయుటలేదా
కళ్ళకు కాటుక హద్దౌతుందా..కమ్మని కలలను వద్దంటుందా
తెల్లవారికి అది మిగిలుంటు ందా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
వెచ్చని ఎండకు వెన్నెల ఆగుతుందా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

చంద్రుడు..కనపడలేదనీ..వెన్నెలా
వేరే చోటుకు వెళుతుందా..ఆ ఆ ఆ ఆ 
వేరే చోటుకు వెళుతుందా..ఆ

Raajaa-Ramesh--1977
Music::K.V.Mahaadevan
Lyrics::Atreya
Singer's::S.P.baalu,P.Suseela 
Cast::Akkineni, Vanisri, Jaggayya,Kanchana,Vijayalalita,Jayamaalini,K.V.Chalam.

::::

chandruDu..kanapaDalEdanii..ii..vennelaa
vErE chOTuku veLutundaa..aahaa 

chandruDu..kanapaDalEdanii..ii..vennelaa
vErE chOTuku veLutundaa..vErE chOTuku veLutundaa..aa 

madhupam lEdani mandaaram..tana madhuvunuu 
kandireegaku andistundaa..vah^vaa  

madhupam lEdani mandaaram..tana madhuvunuu
kandireegaku andistundaa

naadir^dinnaa naadir^dinnaa naadir^dinnaa naadir^dinnaa  
naathaadintaa takiTaadintaa takiTa tikaTa thaa..thaa thaa
takiTa tikiTa thaa..thaa thaa takiTa tikiTa thaa thaa

:::1

tamalapaaku paadaalainaa..taanDavanRtyam chEyuTalEdaa
tamalapaaku paadaalainaa..taanDavanRtyam chEyuTalEdaa

piDikeDu gunDe manishiki unnaa..kaDiveDu prEmanu mOyuTalEdaa
piDikeDu gunDe manishiki unnaa..kaDiveDu prEmanu mOyuTalEdaa
kaLLaku kaaTuka haddoutundaa..kammani kalalanu vaddanTundaa
tellavaariki adi migilunTu ndaa..aa..aa..aa..aa..aa..aa
vechchani enDaku vennela Agutundaa..aa..aa..aa..aa..aa..aa

chandruDu..kanapaDalEdanii..vennelaa
vErE chOTuku veLutundaa..aa aa aa aa 
vErE chOTuku veLutundaa..aa

ప్రియ--1981



సంగీతం::చక్రవర్తి
రచన::ఆచార్య-ఆత్య్రేయ
గానం::P.సుశీల,S.P.బాలు,S.జానకి 
తారాగణం::చిరంజీవి,స్వప్న,చంద్రమోహన్,రాధిక.
     
పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నా హృదయమా..నా హృదయ ఉదయ రాగమా
మాయనీ తీయనీ..మధుర గీతి పాడుమా
మాయనీ తీయనీ..మధుర గీతి పాడుమా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అందమై..మకరందమై
మందబంధ మలయానిత..గంధమై
మదనుని విరివిల్లున..అరవిందమై
ఎలతేటి ఎద మీటు..ఆనందమై
ఎలతేటి ఎద మీటు..ఆనందమై
పులకరించు కుసుమమా..పులకరించు కుసుమమా
నా హృదయమా..నా హృదయ ఉదయ రాగమా

చరణం::1

ఆటవై..సయ్యాటవై
చిలిపి వలపులాడే..చెరలాటవై
తలపుల తత్తరల..తచ్చాటవై
పరువాల సరదాల..బూచాటవై
పరువాల సరదాల..బూచాటవై
కరిగిపోవు స్వప్నమా..కరిగిపోవు స్వప్నమా
నా హృదయమా..నా హృదయ ఉదయ రాగమా
మాయనీ తీయనీ..మధుర గీతి పాడుమా

చరణం::2

వాణివై..వర వీణవై
బృందావన సమ్మోహన..వేణువై
పదకవిత మృదుభాషల..బాణివై
అనురాగ రాగాల..నెరజాణవై
అనురాగ రాగాల..నెరజాణవై 
గానమైన...మౌనమా 
గానమైన...మౌనమా  
గాలివై..చిరుగాలివై
సిరిమల్లెల చిరుజల్లుల..వేళవై
కనుసన్నల తెలివెన్నెల..జాలువై
జోజోల ఉయ్యాల..జంపాలవై
జోజోల ఉయ్యాల..జంపాలవై 
సేదదీర్చు నేస్తమా..సేదదీర్చు నేస్తమా 
నా హృదయమా..నా హృదయ ఉదయ రాగమా
మాయనీ తీయనీ..మధుర గీతి పాడుమా  

సతీ అనసూయ--1971



సంగీతం::P.ఆదినారాయణ
రచన::ఆరుద్ర
గానం::S.జానకి
తారాగణం::N.T.రామారావ్,కాంతారావు,జమున,శోభన్ బాబు,శారద,రాజనాల,రాజబాబు,మీనాకుమారి,హలం. 

పల్లవి::

నటనమే చూడరా..ఆ ఆ ఆ
నటనమే...చూడరా  
ఆ ఆ ఆ..నా విలాసమంతా నీదేరా
నటనమే...చూడరా         

చరణం::1

ఓర చూపుల మనోజ్ఞభావం
దోరవయసు మరాళ నృత్యం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఓరచూపుల మనోజ్ఞభావం
దోరవయసు మరాళ నృత్యం
నగవు వగలు నవీననాట్యం
నగవు వగలు నవీననాట్యం
లతాంగి శోభ నితాంత లాస్యమే    
నటనమే చూడరా..ఆ ఆ ఆ 
నటనమే...చూడరా  

చరణం::2

రమణి హొయలే రసాల నిలయం
సుదతి సొగసే సుఖాల శిఖరం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
రమణి హొయలే రసాల నిలయం
సుదతి సొగసే సుఖాల శిఖరం
వధువై మధువై వరించు పరువం
వధువై మధువై వరించు పరువం
లభించె వలపు తరింప చేయరా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ   
నటనమే చూడరా..ఆ ఆ ఆ
నా విలాసమంతా..నీదేరా 
నటనమే చూడు..నటనమే చూడు
నటనమే చూడరా..చూడరా..చూడరా
తోం తోం తనన తోం తోం తనన
తోం తనన తోం తనన తనోంతనన
తోంతన తోంతన తనోం తోంతనన
తోంతన తోంతన తనోం తోంతనన
తజం తజం తజం తజం తజంత
నటనమే చూడరా..ఆ ఆ ఆ ఆ
నటనమే...చూడరా  
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ