Thursday, June 07, 2007

పెళ్ళిచేసి చూడు--1952 ::చక్రవాకం::రాగంరాగం : చక్రవాకం
అహిర్`భైరవ్ రాగ్ హిందుస్థాని
పింగళి నాగేశ్వర రావ్ గారి రచనలో
మన ఘంటశాల గారి స్వరమాధుర్యంతో
P.లీలగారి గానామౄతముతో
మనసు రంజింపచేసిన ఈ ఆణిముత్యాన్ని మీరూ వినండి .

ఏడుకొండలవాడ వెంకటారమణా 2
సద్దుచేయక నీవు నిదురపోవయ్యా
పాలసంద్రపుటల పట్టెమంచముగా
పున్నమీవెన్నెలలు పూలపానుపుగా 2
కనులలొలికే వలపు పన్నీరుజల్లుగా
అన్ని అమరించెనే అలువేలుమంగా 2
ఏడుకొండలవాడ
నాపాలిదైవమని నమ్ముకొన్నానయ్య
నాభాగ్య దైవమా నను మరువకయ్యా
బీబినాంచారమ్మ పొంచివున్నాదయ్య 2
చాటుచేసుకొని ఎటులో చెంతచేరదనయ్య
ఏడుకొండలవాడ

పెళ్ళి చేసి చూడు--1952::కల్యాణి::రాగంరచన::పింగళిగానం::ఘంటసాల
సంగీతం::ఘంటసాల

కల్యాణి::రాగంలో చక్కటి పాట !!

ఓ... భావి భారత భాగ్య విధాతలార

యువతీ యువకులార..ఆ..ఆ..
స్వానుభవమున చాటు నా సందేశమిదే వరెవహ్
పెళ్ళీ చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగ కాపురముండాలోయ్
ఎల్లరు సుఖము చూడాలోయ్ మీరెల్లరు హాయిగ ఉండాలోయ్

కట్నాల మోజులో మన జీవితాలనే బలి చేసి
కాపురములు కూల్చు ఘనులకు శాస్తి కాగా
పట్నాల పల్లెల దేశ దేశాల మన పేరు చెప్పుకొని ప్రజలు సుఖపడగా

ఇంటా బయట జంట కవుల వలె అంటుకు తిరగాలోయ్ "పరంపం"ఇంటా బయట జంట కవుల వలె అంటుకు తిరగాలోయ్
కంటి పాపలై దంపతులెపుడు చంటి పాపలను సాకాలోయ్
కంటి పాపలై దంపతులెపుడు చంటి పాపలను సాకాలోయ్

!! పెళ్ళి చేసుకొని !!
నవ భావముల నవ రాగముల ఆ..ఆ..నవ జీవనమె నడపాలోయ్
నవ భావముల నవ రాగముల నవ జీవనమె నడపాలోయ్
భావ కవుల వలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్
భావ కవుల వలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్

!! పెళ్ళి చేసుకొని !!