సంగీతం::సత్యం
రచన::దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం::P.సుశీల
తారాగణం::చలం,వాణిశ్రీ,S.V. రంగారావు,జగ్గయ్య,రమణారెడ్డి,విజయలలిత,జ్యొతిలక్ష్మి
పల్లవి::
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ
రామా ఓ రామా..రావా కనరావా
రామా ఓ రామా..రావా కనరావా
నా మనసు చల్లగా..నా బ్రతుకు ఝల్లన
రామా ఓ రామా..రావా కనరావా
చరణం::1
ఎందుకు రామా ఈ కనులూ
నీ సుందర రూపం..చూడనినాడూ
ఎందుకు రామా..ఈ కనులూ
నీ సుందర రూపం..చూడనినాడూ
ఎందుకు స్వామీ..ఈ మేనూ
నీ ముందర నిలిచి..కొలువనినాడూ
ఏదీ ఏదీ నీ సన్నిధీ..ఏదీ ఏదీ నీ సన్నిధీ
ఏదీ ఏదీ..నా పెన్నిధీ
రామా ఓ రామా..రావా కనరావా
రామా ఓ రామా..రామా ఓ రామా
చరణం::2
చీకటి వేళల..నడిపించేదీ
ఒంటరి ఘడియల..వినిపించేదీ
చీకటి వేళల..నడిపించేదీ
ఒంటరి ఘడియల..వినిపించేదీ
ఏదీ ఏదీ నీ చేయూతా..ఏదీ ఏదీ నీ చేయూతా
ఏదీ ఏదీ..నీ పిలుపు
రామా ఓ రామా..రావా కనరావా