Thursday, December 13, 2012

విశాలి--1973



సంగీతం::పుహళేంది
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల
తారాగణం::కృష్ణంరాజు,శ్రీధర్,నాగయ్య,ధూళిపాళ,K.V. చలం, శారద,రమాప్రభ,విజయలలిత

పల్లవి::

నిన్నదాకా చిన్నదాన్నిరా..హోయ్
నీ కన్నుబడి...నే కన్నెనైనారా
నిన్నదాకా చిన్నదాన్నిరా..హోయ్
నీ కన్నుబడి...నే కన్నెనైనారా

మొన్నదాకా..మొండిదాన్నిరా..ఆఆ
నీ మోజులోన బేలనైనారా..అ అ అ ఆ
నిన్నదాకా చిన్నదాన్నిరా..హోయ్
నీ కన్నుబడి...నే కన్నెనైనారా

చరణం::1

చల్లగాలికిలా..జలదరించి ఎరుగను
మల్లెపూలకింత..మత్తుందను ఎరుగను
పైటకొంగు తొలగినా..పక్క నెవరు నడిచినా
పైటకొంగు తొలగినా..పక్క నెవరు నడిచినా
సిగ్గుపడి అటూ ఇటూ..చూచి ఎరుగనూ  
నిన్నదాకా చిన్నదాన్నిరా..హోయ్
నీ కన్నుబడి..నే కన్నెనైనారా

చరణం::2

వానైనా ఎండైన..వెన్నెలైన చీకటైన
నిన్న దాక..లెక్కలేదురా
నేడు వానంటె దిగులు..వెన్నెలంటె సెగలు
చీకటైతె గుబులు...గుబులురా
నిదుర రాదురా..ఆఆ..పొద్దుపోదురా..ఆ
ఈ అవస్త మొన్నదాక..నేను ఎరుగను 

నిన్నదాకా చిన్నదాన్నిరా..హోయ్  
నీ కన్నుబడి...నే కన్నెనైనారా

చరణం::3

కళ్ళు తెరుచుకునే..కలవరించి ఎరుగను
నిన్న కన్న కలలు..నెమరువేసి ఎరుగను
కోడె వయసు తరిమినా..కొసరి ముద్దులడిగినా..ఆ
మూడు ముళ్ళు పడేవరకు..నీకు దొరకను  

నిన్నదాకా చిన్నదాన్నిరా..హోయ్  
నీ కన్నుబడి..నే కన్నెనైనారా

మొన్నదాకా మొండిదాన్నిరా..ఆఆ
నీ మోజులోన బేలనైనారా..అ అ అ ఆ
నిన్నదాకా చిన్నదాన్నిరా..హోయ్
నీ కన్నుబడి...నే కన్నెనైనారా