Thursday, October 29, 2009

తాసిల్దారు గారి అమ్మాయి--1971
























సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::J.V.రాఘవులు,P.సుశీల
తారాగణం::శోభన్‌బాబు, జమున, చంద్రకళ, రాజబాబు,నాగభూషణం, రావికొండలరావు 

పల్లవి::

అల్లరి చేసే..వయసుండాలి
ఆశలు రేపే..మనసుండాలి 
అల్లరి చేసే..వయసుండాలి
ఆశలు రేపే..మనసుండాలి
ఏదీ లేని బావా నీతో..ఏం చెయ్యాలి
నేనేం చెయ్యాలి..నేనేం చెయ్యాలి 
అల్లరి చేసే..వయసుండాలి
ఆశలు రేపే..మనసుండాలి
ఏదీ లేని బావా నీతో..ఏం చెయ్యాలి
నేనేం చెయ్యాలి? 

చరణం::1

పిల్లగాలి వీస్తుంటె పైట యెగిరి పడుతుంటె 
పచ్చికొబ్బరంటిపిల్ల పైన పైన పడుతుంటె
పిల్లగాలి వీస్తుంటె పైట యెగిరి పడుతుంటె 
పచ్చికొబ్బరంటిపిల్ల పైనపైన పడుతుంటె
పలక్కుంటె ఉలక్కుంటె..ఏం చెయ్యాలి
పనికిరాడని ఒదిలెయ్యాలీ..పనికొచ్చే దెప్పుడనో..ఆ!
అల్లరి చేసే..వయసుండాలి
ఆశలు రేపే..మనసుండాలి
ఏదీ లేని బావా నీతో..ఏం చెయ్యాలి
నేనేం చెయ్యాలి? 

చరణం::2

పట్టెమంచం వేసుకున్నాపట్టుపరుపు పరుచుకున్న
కనులకింత కునుకురాక మనసుకసలుకుదురులేక
పట్టెమంచం వేసుకున్నాపట్టుపరుపు పరుచుకున్న
కనులకింత కునుకురాక మనసుకసలుకుదురులేక
రాతిరంత గడుస్తుంటె..ఏం చెయ్యాలి
పగలంతా పనిచెయ్యాలి..అదేమిటో నువ్వే చెప్పాలి..ఆ ఆ 
ఆఆఆ..అల్లరి చేసే వయసుండాలి
ఆశలు రేపే..మనసుండాలి 
ఏదీ లేని బావా నీతో..ఏం చెయ్యాలి 
నేనేం చెయ్యాలి? 

చరణం::3

మంచి చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని 
అద్దంలో చూచుకుంటె ఇంత అందమెందుకని
మంచి చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని 
అద్దంలో చూచుకుంటె ఇంత అందమెందుకని
గుండెనిండా గుబులైతె..ఏంచెయ్యాలి
పెద్దవాళ్ళతో చెప్పి..పెళ్ళిచెయ్యాలి
అయ్యో..ఈమొద్దు స్వరూపానికి ఎలాచెప్పాలి 
అల్లరి చేసే..వయసుండాలి
ఆశలు రేపే..మనసుండాలి 
ఏదీ లేని బావా నీతో..ఏం చెయ్యాలి
నేనేం చెయ్యాలి..నేనేం చెయ్యాలి?  

రాముడు కాదు కృష్ణుడు--1983


















సంగీతం::చక్రవర్తి
రచన::దాసరి నారాయణ రావ్
గానం::P.సుశీల, S.P.బాలు

పల్లవి::

ఒక లైలా కోసం..తిరిగాను దేశం
ఒక లైలా కోసం..తిరిగాను దేశం
ప్రతి రోజూ ప్రతి రాత్రీ..ప్రతి పాటా ఆమె కోసం
లైలా..ఆ..లైలా..ఆ..లైలా..ఆ

ఒక మజ్ఞూ కోసం..వెతికాను లోకం
ఒక మజ్ఞూ కోసం..వెతికాను లోకం
ప్రతి పగలూ ప్రతి రాత్రీ..ప్రతి తలపూ అతని కోసం
మజ్ఞూ..ఊ..మజ్ఞూ..ఊ..మజ్ఞూ..ఊ
ఒక లైలా కోసం తిరిగాను దేశం

చరణం::1

ఆకాశానికి నిచ్చెన..వేసీ
చుక్కల..పట్టుకొనడిగానూ
లైలా ఏదనీ..నా లైలా ఏదనీ
స్వర్గానికి నే దారులు..వెతికీ
ఇంద్రుని..పట్టుకొనడిగానూ
లైలా ఏదనీ..నా లైలా ఏదనీ

దిక్కుల నడుమా..నేనుంటే 
చుక్కల..పట్టుకొనడిగావూ
కన్నుల ముందూ..నేనుంటే 
కన్నులు మూసుకు..వెదికావూ
ప్రతి చూపూ..ప్రతి పిలుపూ
ప్రతి చోటా..నీకోసం

ఒక మజ్ఞూ కోసం..వెతికాను లోకం
ప్రతి పగలూ ప్రతి రాత్రీ..ప్రతి తలపూ అతని కోసం

లైలా..ఆ..లైలా..ఆ..లైలా..ఆ
ఒక లైలా కోసం..తిరిగాను దేశం

చరణం::2

పగలూ రేయీ..పందెం వేసీ
సృష్టిని పట్టుకు..బ్రతిమాలాయి
మజ్ఞూ ఏడనీ..నా మజ్ఞూ ఏడనీ
రంభా ఊర్వశి..ధైర్యం చేసీ
స్వర్గం విడిచీ..వచ్చారూ
లైలా నేననీ హహహ..ఆ లైలా నేననీ

ఇల్లూ వాకిలి..వదిలొస్తే
రంభా ఊర్వశి..అంటావూ
నీకోసం..నే పుట్టొస్తే 
ఎవ్వరి వెంటో..పడతావూ
ప్రతి రాత్రీ ప్రతి పగలూ ..ప్రతి తలపూ నీ కోసం
ఒక మజ్ఞూ కోసం..వెతికాను లోకం
ప్రతి పగలూ ప్రతి రాత్రీ..ప్రతి తలపూ అతని కోసం
మజ్ఞూ..ఊ..మజ్ఞూ..ఊ..మజ్ఞూ..ఊఊ

ఒక లైలా కోసం..తిరిగాను దేశం
ప్రతి రోజూ ప్రతి రాత్రీ..ప్రతి పాటా ఆమె కోసం
లైలా..ఆ..లైలా..ఆ..లైలా..ఆ