Thursday, May 08, 2014

మహాత్ముడు--1976



సంగీతం::T.చలపతిరావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల 
తారాగణం::అక్కినేని,శారద,ప్రభ,G.వరలక్ష్మి,జయమాలిని,సత్యనారాయణ,కాంతారావు,అల్లు రామలింగయ్య

పల్లవి::

పాడనా..ఆ..ఈ రేయి పాడనా..ఆఆఆ  
నీ కోసమే..ఏఏఏ..పాడనా..ఆ
చందమామ వీణియపైన..తెలివెన్నెల తీగలపైన..ఆ
చందమామ వీణియపైన..తెలివెన్నెల తీగలపైన 
కరిగే కలలే కరిగే కలలే..స్వరాలుగా..ఆఆఆ
పాడనా..ఆ..నే పాడనా..ఆ

చరణం::1

మనసులోన మెరిసే రూపం.. మౌనంలో కరిగింది
మనసులోన మెరిసే రూపం..మౌనంలో కరిగింది 
పెదవిపైన విరిసే రాగం..హృదయంలో వెలిగింది..ఈ
హృదయంలో..ఓ..వెలిగింది
మౌనంలోన గానంలోన..మౌనంలోన గానంలోన 
మౌనంలోన గానంలోన..మౌనంలోన గానంలోన 
మధురిమ ఏదో వున్నదనీ..ఈ
పాడనా..ఆఆఆ..పాడనా..ఆ 
చందమామ వీణియపైన తెలివెన్నెల తీగలపైన
చందమామ వీణియపైన తెలివెన్నెల తీగలపైన 
కరిగే కలలే కరిగే కలలే స్వరాలుగా..ఆ
పాడనా..ఆఆఆ...నే..పాడనా

చరణం::2

ఏ రెమ్మకు..పూచిన సుమమో 
నీ పూజకు..నిలిచింది..ఈ 
ఏ జన్మల..నోముల ఫలమో..ఓ
ఇరువురినీ కలిపింది..ఇరువురినీ కలిపింది
ఆరాధనలో ఆవేదనలో..ఆరాధనలో ఆవేదనలో
ఆశల పున్నమి..వున్నదనీ 
పాడనా..ఆఆఆ..పాడనా..ఆ 
చందమామ వీణియపైన..తెలివెన్నెల తీగలపైన
చందమామ వీణియపైన..తెలివెన్నెల తీగలపైన 
కరిగే కలలే..కరిగే కలలే స్వరాలుగా..ఆ

ఓ సీత కథ--1974

















http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4809
సంగీతం::K.V.మహాదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::చంద్రమోహన్,కాంతారావు,అల్లు రామలింగయ్య,రోజారమణి,శుభ,రమాప్రభ

పల్లవి::

పుత్తడి బొమ్మ మా పెళ్ళిపడుచు
పున్నమి రెమ్మ మా పెళ్ళిపడుచు
పుత్తడి బొమ్మ మా పెళ్ళిపడుచు
పున్నమి రెమ్మ మా పెళ్ళిపడుచు
ఆ బొమ్మకున్న ఆభరణం
అందాలకందని మంచి గుణం
అందాలకందని మంచి గుణం

మహరాజు కాడు మా పెళ్ళికొడుకు
మనసైనవాడు మా పెళ్ళి కొడుకు
మహరాజు కాడు మా పెళ్ళికొడుకు
మనసైనవాడు మా పెళ్ళి కొడుకు
మావాడికున్న వింత గుణం
తన మాట తప్పని మంచితనం 

పుత్తడి బొమ్మ మా పెళ్ళి పడుచు
పున్నమి రెమ్మ మా పెళ్ళి పడుచు


చరణం::1

గళమున లేవు ఏ ముత్యాల సరాలు
ఉన్నవిలే హరినామ స్మరాలు
కరమున లేవు బంగారు కడియాలు
ఉన్నవిలే శివపూజ కుశుమాలు
మదిలో లేవు సంపదల మీద ఆశలు
మదిలో లేవు సంపదల మీద ఆశలు
ఉన్నవిలే పతి సేవా కాంక్షలు
ఆ బొమ్మకున్న ఆభరణం
అందాలకందని మంచి గుణం
అందాలకందని మంచి గుణం

పుత్తడి బొమ్మ మా పెళ్ళి పడుచు
పున్నమి రెమ్మ మా పెళ్ళి పడుచు
మహరాజు కాడు మా పెళ్ళికొడుకు
మనసైనవాడు మా పెళ్ళి కొడుకు

చరణం::2

పెళ్ళిలకు మధుమాసం చైత్రమాసం
వచ్చే చైత్రమాసం
పెళ్ళికొడుకు ఊ అంటే మాకు సంతోషం
మరి మరీ సంతోషం

పెళ్ళిలకు మధుమాసం చైత్రమాసం
వచ్చే చైత్రమాసం
పెళ్ళికొడుకు ఊ అంటే మాకు సంతోషం
మరి మరీ సంతోషం

చరణం::3

రాచిలకల రప్పించు 
మావిడి తోరణాలు కట్టించు
కోయిలలను పిలిపించు
మంగళవాద్యాలను తెప్పించు
ఆకాశమంత పందిరి వేసి
భూలోకమంత పీఠ వేసి
పెళ్ళికొడుకును పెళ్ళిపడుచును 
పీటల మీద కూర్చోబెట్టి 
శ్రీదేవి భూదేవి శ్రీవాణి శ్రీగౌరి 
అందరు చల్లగ అక్షితలు చల్లగ
కల్యాణం జరిపించాలి..ఆ వైభోగం తిలకించాలి   

అమరశిల్పి జక్కన్న--1964


రచన::సముద్రాల రాఘవాచార్య
సంగీతం::S.రాజేశ్వర రావు
గానం::ఘంటసాల, P.సుశీల, బృందం
Film Directed By::B.S.Ranga
తారాగణం::ఆక్కినేని,B.సరోజ,హరినాథ్,V.నాగయ్య,రేలంగి,ధుళిపాళ,సూర్యకాంతం,గిరిజ,పుష్పవల్లి.  

సాకీ::

ఘంటసాల::
శ్రీ వేణుగోపాలా..ఆ..చిన్మయానందలీలా
నారాయణ విజయనారాయణ నారాయణా పాహీ..ఈ..ఈ

పల్లవి:: 

ఘంటసాల::
తరమా..వరదా..ఆ..కొనియాడ నీలీలా
తరమా..వరదా..ఆ..కొనియాడ నీలీలా
తనువూ..మనసూ..తరియించె ఈ వేళా
తరమా..వరదా..ఆ..కొనియాడ నీ లీలా..ఆ

చరణం::1 

ఘంటసాల::
ఎండిపోయిన గుండెలలోన పండువెన్నెల చిలికితివీవు

సుశీల::
తోడునీడగ మా దరినిలిచి కావుమా..కరుణాజలధి

ఇద్దరు::
తరమా..వరదా..ఆ..కొనియాడ నీ లీలా..ఆ

చరణం::2

శరణు చెన్నకేశవా..శరణు దీనబాంధవా..ఆ

బృందం::
శరణు చెన్నకేశవా..శరణు దీనబాంధవా..ఆ

ఇద్దరు::
నాట్యకళా మోహనా..సకలలోక పావనా

బృందం::
నాట్యకళా మోహనా..సకలలోక పావనా

శరణు చెన్నకేశవా..శరణు దీనబాంధవా
శరణు చెన్నకేశవా..శరణు దీనబాంధవా

చరణం::3

ఇద్దరు::
నీవే తల్లివి తండ్రివి మాకు జీవనదాతవు నీవె ప్రభూ

బృందం::
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

ఇద్దరు::
నీదు సేవయే జీవనరక్ష, నీదు సన్నిధే పెన్నిధిరా

బృందం::
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ

ఇద్దరు::
నందనందనా గోవిందా..భక్తచందనా గోవిందా

బృందం::
నందనందనా గోవిందా..భక్తచందనా గోవిందా

ఇద్దరు::
నందనందనా గోవిందా..భక్తచందనా గోవిందా

ఘంటసాల::
నందనందనా గోవిందా..భక్తచందనా గోవిందా
చెన్నకేశవా..పాహీ చెన్నకేశవా..ఆ 
చెన్నకేశవా..పాహీ చెన్నకేశవా..ఆ 
చెన్నకేశవా..పాహీ చెన్నకేశవా..ఆ 
చెన్నకేశవా..పాహీ చెన్నకేశవా..ఆ

ఘంటసాల-బృందం::
చెన్నకేశవా చెన్నకేశవా చెన్నకేశవా చెన్నకేశవా
చెన్నకేశవా చెన్నకేశవా చెన్నకేశవా చెన్నకేశవా

ఘంటసాల::
నా..తరమా..వరదా..ఆ
కొనియాడ నీ లీలా..కేశవా..ఆ

బృందం::
చెన్నకేశవా..పాహీ చెన్నకేశవా
చెన్నకేశవా..పాహీ చెన్నకేశవా
చెన్నకేశవా..పాహీ చెన్నకేశవా
చెన్నకేశవా..పాహీ చెన్నకేశవా