Wednesday, September 05, 2007

దాగుడుమూతలు--1964::తిలక్ కామోద్::రాగం



సంగీతం:K.V.మహదేవన్
రచన:దాసరథి
గానం:ఘంటసాల
Film Directed By::Adoorti Subbaa Rao 
తారాగణం::నందమూరి తారక రామారావు,
పద్మనాభం,గుమ్మడి,అల్లురామలింగయ్య,రమణారెడ్డి,రావికొండల్‌రావు,పేకాట శివరాం,రాధాకుమారి,అన్నపూర్ణ,నాగయ్య,సూర్యకాంతం,బి,సరోజినీదేవి,శారద,

రాగం::తిలక్ కామోద్
ఈ రాగాన్ని " నాట " క్రింద కూడా పేర్కొనబడింది


పల్లవి::


గోరంక గూటికే చేరావు చిలకా
గోరంక గూటికే చేరావు చిలకా
భయమెందుకే నీకు బంగారు మొలకా
గోరంక గూటికే చేరావు చిలకా

చరణం::1


ఏ సీమదానివో ఎగిరెగిరి వచ్చావు
అలసి ఉంటావు మనసు చెదరి ఉంటావు
ఏ సీమదానివో ఎగిరెగిరి వచ్చావు
అలసి ఉంటావు మనసు చెదరి ఉంటావు
మా మల్లె పూలు నీకు మంచి కధలు చెప్పునే
మా మల్లె పూలు నీకు మంచి కధలు చెప్పునే
ఆదమరచి ఈ రేయి హాయిగా నిదురపో

!! గోరంక గూటికే చేరావు చిలకా
భయమెందుకే నీకు బంగారు మొలకా
గోరంక గూటికే చేరావు చిలకా !!

చరణం::2


నిలవలేని కళ్ళు నిదర పొమ్మన్నాయి
దాగని చిరునవ్వులు వద్దన్నాయి అబ్బ ఉండన్నాయి
నిలవలేని కళ్ళు నిదర పొమ్మన్నాయి
దాగని చిరునవ్వులు వద్దన్నాయి అబ్బ ఉండన్నాయి
పైట చెంగు రెపరెపలు పదపద లెమ్మన్నాయి
పైట చెంగు రెపరెపలు పదపద లెమ్మన్నాయి
పలుకైనా పలుకవా బంగారు చిలకా

!! గోరంక గూటికే చేరావు చిలకా
భయమెందుకే నీకు బంగారు మొలకా
గోరంక గూటికే చేరావు చిలకా !!

దాగుడు మూతలు--1964




సంగీతం::K.V.మహాదేవన్
రచన:: దాశరథి
గానం:
:P. సుశీల , 

Film Directed By::Adoorti Subbaa Rao 
తారాగణం::నందమూరి తారక రామారావు,పద్మనాభం,గుమ్మడి,అల్లురామలింగయ్య,
రమణారెడ్డి,రావికొండల్‌రావు,పేకాట శివరాం,రాధాకుమారి,అన్నపూర్ణ,నాగయ్య,
సూర్యకాంతం,B,సరోజినీదేవి,శారద,

పల్లవి::

అందలం ఎక్కాడమ్మా
అందకుండపోయాడమ్మా
ఇంతవాడు ఇంతకు ఇంతై
ఎంతో ఎదిగిపోయాడమ్మా
2

చరణం::1


నిన్నరేతిరి తాను పొన్నచెట్టు నీడ
నిన్నరేతిరి తాను పొన్నచెట్టు నీడ
ఎన్ని ఊసులో చెప్పి ఎన్ని బాసలో చేసి
ఎన్ని ఊసులో చెప్పి ఎన్ని బాసలో చేసి
ఒడిలోన ఒదిగినాడమ్మా..ఆ..ఆ..
నా ఎదనిండా నిండినాడమ్మా ..ఆ..ఆ..

!! అందలం ఎక్కాడమ్మా
అందకుండపోయాడమ్మా
ఇంతవాడు ఇంతకు ఇంతై
ఎంతో ఎదిగిపోయాడమ్మా
!!

చరణం::2

ఆమాటలకు నేను మైమరిచిపోయాను
ఆ మత్తులో కాస్త కనుమూసి ఒరిగాను
భళ్లునా తెల్లారిపోయెనమ్మాఓ . .
ఒళ్ళు ఝల్లున చల్లారిపోయెనమ్మా

" అందాన్ని చూశానమ్మా
అందలం ఎక్కానమ్మా
ఎంతవాణ్ణి ఎంతైనా
నే నీలో ఇమిడిపోతానమ్మా


"" అందాన్ని చూశానమ్మా
అందలం ఎక్కానమ్మా
ఎంతవాణ్ణి ఎంతైనా
నే నీలో ఇమిడిపోతానమ్మా "


చరణం::3

వెన్నపూస వంటి కన్నెపిల్ల ఉంటే
వెన్నపూస వంటి కన్నెపిల్ల ఉంటే
సన్నజాజులే సిరులు,మల్లెపూవులే మణులు
సన్నజాజులే సిరులు,మల్లెపూవులే మణులు
నువులేక కలిమి లేదమ్మా,నీకన్నా కలిమి ఏదమ్మా
అందాన్ని చూశానమ్మా,అందలం ఎక్కానమ్మా
ఎంతవాణ్ణి ఎంతైనా నే నీలో ఇమిడిపోతానమ్మా

!! అందలం ఎక్కాడమ్మా
అందకుండపోయాడమ్మా
ఇంతవాడు ఇంతకు ఇంతై
ఎంతో ఎదిగిపోయాడమ్మా
!!

దాగుడుమూతలు--1964



సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆరుద్ర
గానం::పిఠాపురం,జమునరాణి

Film Directed By::Adoorti Subbaa Rao 
తారాగణం::నందమూరి తారక రామారావు,పద్మనాభం,గుమ్మడి,అల్లురామలింగయ్య,
రమణారెడ్డి,రావికొండల్‌రావు,పేకాట శివరాం,రాధాకుమారి,అన్నపూర్ణ,నాగయ్య,
సూర్యకాంతం,B,సరోజినీదేవి,శారద.

పల్లవి::

డివ్వి డివ్వి డీవ్విట్టం నువ్వంటేనే నాకిష్టం
డివ్వి డివ్వి డీవ్విట్టం నువ్వంటేనే నాకిష్టం
డీడిక్కంది అదృష్టం  గట్టెక్కింది మనకష్టం
డీడిక్కంది అదృష్టం  గట్టెక్కింది మనకష్టం
బాజాలతో బాజాలతో పందిట్లో ఇద్దరం ఒకటౌదం
బాజాలతో బాజాలతో పందిట్లో ఇద్దరం ఒకటౌదం

!!డివ్వి డివ్వి డీవ్విట్టం !!

చరణం::1


అందరు చుట్టాలు వస్తారు

ఆనందమానంద మంటారు
అందరు చుట్టాలు వస్తారు
ఆనందమానంద మంటారు
అబ్బాయి తొందర చూస్తారు
తాము అటుతిరిగి పకపకా నవ్వేరు ఒహో..

!!డివ్వి డివ్వి డీవ్విట్టం
డీడిక్కంది అదృష్టం  !!

చరణం::2


కవ్వించి సిరులన్ని కలిసొచ్చినా
కాబోవు పెళ్ళామే కడు పచ్చన
కొండకు వేసాము ఒక నిచ్చెనా
నీ కొంగు తగిలితే ఒళ్ళు నులివెచ్చనా

!! డీడిక్కంది అదృష్టం  గట్టెక్కింది మనకష్టం
ఒహో..డివ్వి డివ్వి డివ్విట్టం నువ్వంటేనే నాకిష్టం !!

చరణం::3


బుక్కావసంతాలు జల్లుకొంటాం
ఎంచక్కా తలంబ్రాలు పోసుకొంటాం
బుక్కావసంతాలు జల్లుకొంటాం
ఎంచక్కా తలంబ్రాలు పోసుకొంటాం
దీవించివేస్తారు అక్షంతలూ
ఇక అవుతాయి సౌక్యాల లక్షంతలూ
దీవించివేస్తారు అక్షంతలూ
ఇక అవుతాయి సౌక్యాల లక్షంతలూ

!!డివ్వి డివ్వి డీవ్విట్టం నువ్వంటేనే నాకిష్టం
డీడిక్కంది అదృష్టం గట్టెక్కింది మనకష్టం!!

దాగుడుమూతలు--1964



సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల

Film Directed By::Adoorti Subbaa Rao 
తారాగణం::నందమూరి తారక రామారావు,
పద్మనాభం,గుమ్మడి,అల్లురామలింగయ్య,రమణారెడ్డి,రావికొండల్‌రావు,పేకాట శివరాం,రాధాకుమారి,అన్నపూర్ణ,నాగయ్య,సూర్యకాంతం,B,సరోజినీదేవి,శారద.

పల్లవి::

దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం
దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం
మనుషులనేవారున్నారా అని దేవునికొచ్చెను అనుమానం
మనుషులనేవారున్నారా అని దేవునికొచ్చెను అనుమానం
దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం


చరణం::1


మనసులేని ఈ మనిషిని చూచి దేవుడు రాయైపోయాడు
మనసులేని ఈ మనిషిని చూచి దేవుడు రాయైపోయాడు
ఆ దేవుడు కనబడలేదని మనిషి నాస్తికుడైనాడు
ఆ దేవుడు కనబడలేదని మనిషి నాస్తికుడైనాడు
దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం


చరణం::2


పశువులకన్నా పక్షులకన్నా మనిషిని మిన్నగ చేశాడు
పశువులకన్నా పక్షులకన్నా మనిషిని మిన్నగ చేశాడు
బుద్ధిని ఇచ్చి హౄదయాన్నిచ్చి భూమే నీదని పంపాడు
బుద్ధిని ఇచ్చి హౄదయాన్నిచ్చి భూమే నీదని పంపాడు
బుద్ధికి హౄదయం లేక హౄదయానికి బుద్ధే రాక
బుద్ధికి హౄదయం లేక హౄదయానికి బుద్ధే రాక
నరుడే ఈలోకం నరకం చేశాడు
దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం


చరణం::3


తాము నవ్వుతూ నవ్విస్తారు కొందరు అందరినీ
తాము నవ్వుతూ నవ్విస్తారు కొందరు అందరినీ
తామేడుస్తూ ఏడ్పించుతారెందరో కొందరినీ
తామేడుస్తూ ఏడ్పించుతారెందరో కొందరినీ
నేను నవ్వితే ఈ లోకం చూడలేక ఏడ్చింది
నేనేడిస్తే ఈ లొకం చూసిచూసి నవ్వింది
దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం
మనుషులనేవారున్నారా అని దేవునికొచ్చెను అనుమానం
దేవుడనేవాడున్నాడా..ఆ....

దాగుడుమూతలు--1964::నటభైరవి::రాగం



సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల.

Film Directed By::Adoorti Subbaa Rao 
తారాగణం::నందమూరి తారక రామారావు,
పద్మనాభం,గుమ్మడి,అల్లురామలింగయ్య,రమణారెడ్డి,రావికొండల్‌రావు,పేకాట శివరాం,రాధాకుమారి,అన్నపూర్ణ,నాగయ్య,సూర్యకాంతం,B,సరోజినీదేవి,శారద,


నటభైరవి::రాగం 

పల్లవి::

మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా
మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా
మెత్తగ అడిగితే లేదనేది లేదుగా
మెత్తగ అడిగితే లేదనేది లేదుగా
మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా


చరణం::1


నీది కానిదేది లేదు నాలో నిజానికే నేనున్నది నీలో
నీది కానిదేది లేదు నాలో నిజానికే నేనున్నది నీలో
ఒక్కటే మనసున్నది ఇద్దరిలో
ఒక్కటే మనసున్నది ఇద్దరిలో
ఆ ఒక్కటీ చిక్కెనీ గుప్పిటిలో..ఆ..హా...
హా

మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా
మెత్తగ అడిగితే లేదనేది లేదుగా
మెత్తగ అడిగితే లేదనేది లేదుగా
మెల్ల మెల్ల మెల్లగా


చరణం::2


నిన్ను చూచి నన్ను నేను మరచినాను
నన్ను దోచుకొమ్మనీ నిలిచినాను
నిన్ను చూచి నన్ను నేను మరచినాను
నన్ను దోచుకొమ్మనీ నిలిచినాను
దోచుకుందమనే నేను చూచినాను


దోచుకుందమనే నేను చూచినాను
చూచి చూచి నువ్వె నన్ను దోచినావు


మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా
మెత్తగ అడిగితే లేదనేది లేదుగా
మెత్తగ అడిగితే లేదనేది లేదుగా
మెల్ల మెల్ల మెల్లగా


చరణం::3

కన్నులకు కట్టినావు ప్రేమ గంతలు
కన్నె మనసు ఆడినదీ దాగుడు మూతలు
కన్నులకు కట్టినావు ప్రేమ గంతలు
కన్నె మనసు ఆడినదీ దాగుడు మూతలు

దొరికినాము చివరకు తోడు దొంగలం
దొరికినాము చివరకు తోడు దొంగలం
దొరలమై ఏలుదాము వలపు సీమను..ఆ..హా...
హా


మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా
మెత్తగ అడిగితే లేదనేది లేదుగా
మెత్తగ అడిగితే లేదనేది లేదుగా


మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా

మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా

దాగుడుమూతలు--1964



సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల

Film Directed By::Adoorti Subbaa Rao 
తారాగణం::నందమూరి తారక రామారావు,
పద్మనాభం,గుమ్మడి,అల్లురామలింగయ్య,రమణారెడ్డి,రావికొండల్‌రావు,పేకాట శివరాం,రాధాకుమారి,అన్నపూర్ణ,నాగయ్య,సూర్యకాంతం,B,సరోజినీదేవి,శారద.

పల్లవి::

అడగక ఇచ్చిన మనసే ముద్దు
అందీ అందని అందమె ముద్ద
విరిసి విరియని పువ్వే ముద్ద
తెలిసి తెలియని మమతే ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు
అందీ అందని అందమె ముద్ద
విరిసి విరియని పువ్వే ముద్దు
తెలిసి తెలియని మమతే ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు


చరణం::1


నడకలలో నాట్యం చేసే
నడుము చూస్తే పిడికెడు ముద్దు
నడకలలో నాట్యం చేసే
నడుము చూస్తే పిడికెడు ముద్దు
పొగడి పొగడి బులిపించే
నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు
పొగడి పొగడి బులిపించే
నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు


చరణం::2

చకచకలాడే పిరుదులు దాటే
జడను జూస్తే చలాకి ముద్దు
చకచకలాడే పిరుదులు దాటే
జడను జూస్తే చలాకి ముద్దు
కలకాలం తలదాచుకొమ్మనే
ఎడదను జూస్తే ఏదో ముద్దు
కలకాలం తలదాచుకొమ్మనే
ఎడదను జూస్తే ఏదో ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు



పచ్చని చేలే కంటికి ముద్దు
నెచ్చెలి నవ్వు జంటకు ముద్దు
పచ్చని చేలే కంటికి ముద్దు
నెచ్చెలి నవ్వు జంటకు ముద్దు
చెట్టు చేమా జగతికి ముద్దు
నువ్వు నేను ఊహుహు.హూహు
చెట్టు చేమా జగతికి ముద్దు
నువ్వు నేను ముద్దుకు ముద్దు


అడగక ఇచ్చిన మనసే ముద్దు
అందీ అందని అందమె ముద్దు
విరిసి విరియని పువ్వే ముద్దు
తెలిసి తెలియని మమతే ముద
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు