Sunday, July 31, 2011

ధర్మచక్రం--1981

















సంగీతం::సత్యం
రచన::మైలవరపు గోపి
గానం::S.P.బాలు,P. సుశీల 
తారాగణం::శోభన్ బాబు, జయప్రద,గుమ్మడి,ప్రభాకర రెడ్డి,మోహన్ బాబు,రమాప్రభ

పల్లవి::

కరిగిపొమ్మంది ఒక చినుకు 
కలిసిపొమ్మంది ఒక మెరుపు
ఈ చలిలో నీ ఒడిలో 
తీయని కౌగిలిలో..ఓఓఓఓఓ

కరిగిపొమ్మంది ఒక చినుకు 
కలిసిపొమ్మంది ఒక మెరుపు
ఈ చలిలో నీ ఒడిలో 
తీయని కౌగిలిలో..ఓఓఓఓఓ

కరిగిపొమ్మంది ఒక చినుకు 
కలిసిపొమ్మంది ఒక మెరుపు

చరణం::1 

నడకే మయూరమాయే
నడుమే వయ్యరమాయే 
మెరుపుగా మారిపోనా 
నీ కళ్లలో కలిసిపోనా

మైకం ఒకింత మైకం
బిడియం రవ్వంత బిడియం
చినుకుగా మారిపోనా 
నీ గుండె పై చేరిపోనా..ఆ

కరిగిపొమ్మంది ఒక చినుకు 
కలిసిపొమ్మంది ఒక మెరుపు 

చరణం::2

తడిసే చకోరి సొగసు
పొంగే పదారు వయసు 
నా పెదవి కోరుతోంది 
తొలిముద్దు కోరుతోంది

రానీ ముహూర సమయం 
కలలే ఫలించు తరుణం
వలపే నివాళి చేసి 
నిలువెల్ల అల్లుకోనా..ఆ

కరిగిపొమ్మంది ఒక చినుకు 
కలిసిపొమ్మంది ఒక మెరుపు

ధర్మచక్రం--1981

















సంగీతం::సత్యం
రచన::మైలవరపు గోపి 
గానం::జానకి  
తారాగణం::శోభన్ బాబు, జయప్రద,గుమ్మడి,ప్రభాకర రెడ్డి,మోహన్ బాబు,రమాప్రభ

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అమ్మో జలకాలే ఆడేను..సూరుడా కాసింత కనుమూయి
అమ్మో..ఓ..లేకుంటే నీ చూపూ యాడాడో వళ్ళంతా పాకేనూ
హహహహ్..సిగ్గౌతున్నాది లోన అగ్గౌతున్నాది..హహహా
సిగ్గౌతున్నాది లోన అగ్గౌతున్నాది
అమ్మో...ఓ..జలకాలే ఆడేను..సూరుడా కాసింత కనుమూయి
అమ్మో..ఓ..లేకుంటే నీ చూపూ యాడాడో వళ్ళంతా పాకేనూ

చరణం::1

ఈ ఉదయం ఏవేళా చూడని..సొగసులు చూసానూ
నా హృదయం ఏనాడూ కోరని..కోరిక కోరేనూ
అది చెప్పెదెట్టా..ముడివిప్పేదెట్టా..మరి ఆ ఊసు
నాలోన దాగేదెట్టా..మరి ఆ ఊసు నాలోన దాగేదెట్టా

అమ్మో...ఓ..జలకాలే ఆడేను..సూరుడా కాసింత కనుమూయి
అమ్మో..ఓ..హహహ..లేకుంటే నీ చూపూ యాడాడో వళ్ళంతా పాకేనూ

చరణం::2

చిరుగాలి నా కౌగిట చేరా..ముచ్చట పడుతోందీ
సెలఏరూ నే తాకిన చోటా..వెచ్చగ చూసిందీ
ఇది వలపనుకోనా..వయసు పిలుపనుకోనా
లేక రాబోవు చెలికాని తలుపనుకోనా

అమ్మో...ఓ..జలకాలే ఆడేను..సూరుడా కాసింత కనుమూయి..ఏయ్ 
అమ్మో..ఓ..లేకుంటే నీ చూపూ యాడాడో వళ్ళంతా పాకేనూ..హ్హుహ్హు 

సిగ్గౌతున్నాది లోన అగ్గౌతున్నాది..హా ఆ
సిగ్గౌతున్నాది..హ్హా..లోన అగ్గౌతున్నాది

అమ్మో...ఓ..జలకాలే ఆడేను..సూరుడా కాసింత కనుమూయి
అమ్మో..ఓ..లేకుంటే నీ చూపూ యాడాడో వళ్ళంతా పాకేనూ