Sunday, May 06, 2007

నిత్యకళ్యాణం పచ్చతోరణం--1960

సంగీతం::పెండ్యాల 
రచన::ఆరుద్ర 
గానం::P.B.శ్రీనివాస్, P.సుశీల
తారాగణం::చలం, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు, గుమ్మడి, రామకృష్ణ, కృష్ణకుమారి,హేమలత, రాజశ్రీ

పల్లవి::

నీమది పాడెను..ఏమని 
నిజానికి నీవే..నేనని
నీమది పాడెను..ఏమని 
నిజానికి నీవే..నేనని

చరణం::1

తీయని మనసుల..వీణలు మీటి 
తుమ్మెద ఏమనె..పూవులతోటీ
తీయని మనసుల..వీణలు మీటి 
తుమ్మెద ఏమనె..పూవులతోటీ
చెలిమికి సాటియె..లేదనెను 
విభేదము వలపున..రాదనెను
నీమది పాడెను..ఏమని 
నిజానికి నీవే..నేనని
నీమది పాడెను..ఏమని 
నిజానికి నీవే..నేనని

చరణం::2

చల్లగ సాగుతు..జీవిత నౌక 
మెల్లగ ఏమనె..ప్రేమిక 
చల్లగ సాగుతు..జీవిత నౌక 
మెల్లగ ఏమనె..ప్రేమిక 
ఇరువురినొకటే..కోరమనె
ఆ కోరిన తీరమూ..చేరమనె
నీమది పాడెను..ఏమని 
నిజానికి నీవే..నేనని
నీమది పాడెను..ఏమని 
నిజానికి నీవే..నేనని

చరణం::3

గూటికి చేరుచు..గువ్వల జంట 
గుస గుస లాడెను..ఏమని మింట 
గూటికి చేరుచు..గువ్వల జంట 
గుస గుస లాడెను..ఏమని మింట 
తమవలె మనమూ..ఏకమనే 
మన ప్రేమయె..మనకూ లోకమనే
నీమది పాడెను..ఏమని 
నిజానికి నీవే..నేనని
ఆఆఆఆ..ఆఆఆ..ఆఆఅ