Sunday, December 20, 2009

భక్త కన్నప్ప--1976::మారు బిహాగ్::రాగం

చిమ్మటలోని ఈ ఆణి ముత్యం వింటూ--సాహిత్యాన్ని చూస్తూ పాడుకొందామా



సంగీతం::ఆదినారాయణ రావ్,సత్యం
రచన::వేటూరి
గానం::S.జానకి

(హిందుస్తాని~కర్నాటక)
రాగం:::మారు బిహాగ్


శివ శివ అననేలరా
శివ శివ అననేలరా
కౌగిలిలోనే కైలాసమందగా
కౌగిలిలో నే కైలాసమీయగా
శివ శివ అననేలరా

కొందరికేమో జన్మకో శివరాత్రి
ఈ సుందరికి ప్రతి రాత్రి నవరాత్రి
కొందరికేమో జన్మకో శివరాత్రి
ఈ సుందరికి ప్రతి రాత్రి నవరాత్రి
భక్తులకో బ్రతుకు గడుపగా గడుపగా ముక్తి
భక్తులకో బ్రతుకు గడుపగా గడుపగా ముక్తి
మనబోటి రక్తులకు ఘడియ ఘడియకు ముక్తి శివ శివా

శివ శివ అననేలరా
కౌగిలిలోనే కైలాసమందగా
కౌగిలిలో నే కైలాసమీయగా
శివ శివ అననేలరా రా

టక్కరి మరుని ముక్కడగించెను నాటి ముక్కంటి చూపు
కాలిన మదనుని మేలుకొలిపెను నేటి నీ కొంటె చూపు
టక్కరి మరుని ముక్కడగించెను నాటి ముక్కంటి చూపు
కాలిన మదనుని మేలుకొలిపెను నేటి నీ కొంటె చూపు
సగము మేనిలో మగువను నిలిపిన
సగము మేనిలో మగువను నిలిపిన చంద్రధరుడు ఆ హరుడు
తనువు తనువునే మరునికొసగిన రసికవరుడు ఈ హరుడు శివ శివా

శివ శివ అననేలరా
కౌగిలిలోనే కైలాసమందగా
కౌగిలిలో నే కైలాసమీయగా
శివ శివ
శివ శివ అననేల రా రా

భక్త కన్నప్ప--1976




సంగీతం::ఆదినారాయణ రావ్,సత్యం
రచన::ఆరుద్ర
గానం::SP.బాలుP.సుశీల


కిరాతార్జునీయం 
ఓం నమః శివాయా 

తకిటతకతకిట తకిట పదయుగళ
వికటశంభో ఝళిత మధుర పదయుగళా
హరిహరాంకిత పదా

జయ జయ మహాదేవ శివ శంకరా..
హర హర మహాదేవ అభయంకరా..

అని దేవతలు శివుని కొనియాడ 
పరవశమున శివుడు తాండవమాడగా 
కంపించెనింతలో కైలాసమావేళ 
కనిపించెనంత అకాల ప్రళయ జ్వాలా 
జగములేలిన వాని సగము నివ్వెరబోయే 
సగము మిగిలిన వాని మొగము నగవైపోయే 

ఓం నమః శివాయా 
ఓం నమః శివాయా 

అతడే అతడే అర్జునుడు 
పాండవ వీర యశోధనుడు(2) 
అనితరాసాధ్యము పాశుపతాస్త్రం 
కోరి ఇంద్ర గిరి చేరి శివునికై 
అహోరాత్రములు చేసెను తపస్సు 
ఇది సృష్టించెను దివ్య మహత్తు 

నెలవంక తలపాగ నెమలి ఈకగ మారే 
తలపైన గంగమ్మ తలపులోనికి జారే 
నిప్పులుమిసే కన్ను నిదురోయి బొట్టాయే 
భూతిపూతకుమారు పులి తోలు వలువాయే 
ఎరుక కలిగిన శివుడు ఎరుకగా మారగా 
తల్లి పార్వతి మారే తాను ఎరుకతగా 
ఓంకార ధనవుగా ఒదిగే త్రిశూలంబు 
కైలాసమును వీడి కదలి వచ్చెను శివుడు 
కైలాసమును వీడి కదలి వచ్చెను శివుడు 

శివుని ఆనతిని శిరమున దాల్చి 
మూకాశురుడను రాక్షసుడు 
వరాహ రూపము ధరించి వచ్చెను 
ధరతలంబే అధిరిపోవగా 
చిచ్చరపిడుగై వచ్చిన పందిని 
రెచ్చిన కోపముతో అర్జునుడు 
మట్టుబెట్టగా పట్టెబాణము 
ధనువొక చేతను అందుకొని 
చూసిన కంటను చూడకనే 
గురి చూసినంతనే .... 
వేచినంతనే ...తలలు రెండుగా 
బిల బిలలాడుతూ తనువు కొండగా 
గిర గిరతిరుగుతూ అటు ఇటు తగిలిన 
రెండు బాణముల అసువులు వీడెను వరాహము 
'కొట్టితి నేననీ అర్జునుడు 
'పడకొట్టితినేననీ శివుడు 
పట్టిన పట్టును వదలకనే 
తొడకొట్టిన వీరముతో అపుడు 
'వేట నాది వేటు నాది వేటాడే చోటు నాది 
వేటి తగవు పొమ్మని విను మీటి పలికే' శివుడు 
'చేవ నాది చేతనాది చేటెరుగని ఈటె నాది 
చేవుంటే రమ్మని కనుసైగ చేసే' అర్జునుడు 

గాంఢీవ పాండిత్య కళలుగా బాణాలు 
కురిపించే అర్జునుడు కానీ 
అపుడతను వేయి చేతుల కార్తవీర్యార్జునుడు 
ఓంకార ఘన ధనుష్టంకారములతోడ 
శరపరంపర కురిసే హరుడు 
అయినా నరునికాతడు మనోహరుడు 

చిత్రమేమో గురిపెట్టిన బాణములు మాయమాయే 
విధివిలాశమేమో పెట్టిన గురి వట్టిదాయే 
అస్త్రములే విఫలమాయే 
శస్త్రములే వికలమాయే 
సవ్యసాచి కుడియడమై సంధించుట మరచిపోయే.... 

జగతికి సుగతిని సాధించిన తల 
దిగంతాల కవతల వెలిగే తల 
గంగకు నెలవై కళకాధరువై 
హరి బ్రహ్మలకు తరగని పరువై 
అతి పవిత్రమై అకలవితమై 
శ్రీకరమై శుభమైన శివుని తల 
అదరగా సుదతి బెదరగా 

కాడి ఎద్దు గాంఢీవముతో ముక్కాడి ఎద్దు గా 
ఎదిగి అర్జునుడు చెండ కోపమున కొట్టినంతనే..... 

తల్లిదండ్రుల చలువ తనువైన దేవుడు 
కోరినవరాలిచ్చే కొండంత దేవుడు 
ఎదుట నిలిచెను శివుడు ఎదలోని దేవుడు 
పదములంటెను నరుడు భక్తి తో అపుడు 

" కరచరణ కృతంవా 
కర్మ వాక్కాయజంవా 
శ్రవణ నయనజంవా 
మానసంవాపరాధం 
విహితమహితంవా 
సర్వామే తక్షమస్వ 
శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో 

నమస్తే నమస్తే నమస్తె నమః