ఈ పాట ఇక్కడ వినండి
సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు, P.సుశీల
పల్లవి::
అదిరింది మావా అదిరిందిరో
ముదిరింది ప్రేమ ముదిరిందిరో
ఉడుకు పుట్టి ఇన్నినాళ్లు
ఉగ్గబట్టి ఉండబట్టి
వయసు పోరు తీరాలిరో
వలపు జోరు తేలాలిరో
అదిరింది పిల్లా అదిరిందిలే
కుదిరింది పెళ్లీ కుదిరిందిలే
ఉడుకు పుట్టి ఇన్నినాళ్లు
ఉగ్గబట్టి ఉండబట్టి
వయసు పోరు తీరాలిరో
వలపు జోరు తేలాలిరో
చరణం::1
ఆకులిస్తా పోకలిస్తా
కొరికిచూడు ఒక్కసారి
ఆశలన్ని వరసపెట్టి
తన్నుకొచ్చి గిల్లుతాయి
బుగ్గమీద పంటిగాటు
పడుతుంది ప్రతిసారి
సిగ్గుచీర తొలగిపోయి
నలుగుతుంది తొలిసారి
మాపటేల మేలుకున్న
కళ్ల ఎరుపు తెల్లవారి
మావ గొప్ప ఊరికంత
చాటుతుంది మరీ మరీ
ఒకసారి కసిపుడితే
మరుసారి మతిచెడితే
వయసు పోరు తీరాలిరో
వలపు జోరు తేలాలిరో
అదిరింది పిల్లా అదిరిందిలే
కుదిరింది పెళ్లీ కుదిరిందిలే
ఉడుకు పుట్టి ఇన్నినాళ్లు
ఉగ్గబట్టి ఉండబట్టి
వయసు పోరు తీరాలిరో
వలపు జోరు తేలాలిరో
చరణం::2
పూలపక్క ముళ్లలాగ
మారుతుంది ఎప్పుడంట
పూనుకున్న కౌగిలింత
సడలిపోతే తప్పదంట
మొదటిరేయి పెట్టుబడికి
గిట్టుబాటు ఎప్పుడంట
మూడునాళ్ల ముచ్చటంతా
డస్సిపోతే గిట్టదంట
రేయి రేయి మొదటిరేయి
కావాలంటే ఎట్టాగంట
సూరీడొచ్చి తలపుతడితే
తియ్యకుంటే చాలంట
తొలిరేయి గిలిపుడితే
తుదిరేయి కలబడితే
వయసు పోరు తీరాలిరో
వలపు జోరు తేలాలిరో
అదిరింది పిల్లా అదిరిందిలే
కుదిరింది పెళ్లీ కుదిరిందిలే
ఉడుకు పుట్టి ఇన్నినాళ్లు
ఉగ్గబట్టి ఉండబట్టి
వయసు పోరు తీరాలిరో
వలపు జోరు తేలాలిరో
తాన తాన తానాననా...