Tuesday, April 14, 2015

ఎగిరే పావురమా--1997::దర్బారీకానడ::రాగం


సంగీతం::S.V.కృష్ణారెడ్డి
రచన::సిరివెన్నెల
గానం::K.S.చిత్ర

దర్బారీకానడ::రాగం 

పల్లవి::

ఆ..ఆహా ఏమి రుచి అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ మోజే తీరనిదీ
తాజా కూరలలో రాజా ఎవరండీ
ఇంకా చెప్పాలా వంకాయేనండీ
ఆహా ఏమి రుచి అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ..మోజే తీరనిదీ

చరణం::1

అల్లం పచ్చిమిర్చీ శుచిగా నూరుకునీ..ఈ
ఆఆఆ  
దానికి కొత్తిమీరీ బాగా తగిలిస్తే
గుత్తొంకాయ కర్రీ ఆకలి పెంచుకదా
అది నా చేతుల్లో అమృతమే అవదా
ఒండుతూ ఉంటేనే రాదా
ఘుమఘుమ ఘుమఘుమ ఘుమఘుమలు
ఆహా ఏమి రుచి..అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ మోజే తీరనిదీ

చరణం::2

లేత వంకాయలతో వేపుడు చేసేదా
మపద..దనిసరి రిగరిగగరిస..నిసగప
మెట్టవంకాయలతో చట్నీ చేసేదా
టొమెటో కలిపి వండిపెడితే మీరు
అన్నమంత వదిలేసి ఒట్టి కూర తింటారు
ఒకటా రెండా మరి వంకాయ లీలలు 
తెలియగ తెలుపగ తరమా
ఆహా..ఏమి రుచి..అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ..మోజే తీరనిదీ
తాజా కూరలలో..రాజా ఎవరండీ
ఇంకా చెప్పాలా..వంకాయేనండీ
ఆఆఆ 

నారి నారి నడుమ మురారి--1990సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల

పల్లవి::

ఏం వానో తడుముతున్నదీ
ఇది ఏం గాలో తరుముతున్నదీ
చాటు మాటు దాటి అవీ ఇవీ చూసేస్తోందే
ఏం వానో ఉరుకుతున్నదీ
ఇది ఏం గోలో ఉరుముతున్నదీ
ఆట పాట చూపీ అటూ ఇటూ లాగేస్తోందే
ఏం వానో తడుముతున్నదీ
ఇది ఏం గాలో తరుముతున్నదీ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

చరణం::1

చినుకు పడు క్షణమేదో చిలిపి సడి చేసిందీ
ఉలికిపడి తలపేదో కలల గడి తీసిందీ
వానమ్మా వాటేస్తుంటే మేనంతా మీటేస్తుంటే
ఇన్నాళ్ళూ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఓరగ దాగెను వయ్యారం ఓగున పాడెను శృంగారం
ఏ గాలి కొట్టిందొ నీ దారి పట్టింది
ఏం వానో ఉరుకుతున్నదీ
ఇది ఏం గాలో తరుముతున్నదీ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

చరణం::2

మనకు గల వరసేదో తెలిసి ఎద వలచిందో
మునుపు గల ముడి ఏదో బిగిసి జత కలిపిందో
ఏమైందో ఏమోనమ్మా
ఏనాడో రాసుందమ్మా
ఇన్నాళ్ళూ ఆ..ఆ..ఆ
ఉడుకున ఉడికిన బిడియాలు ఒడుపుగ ఒలికెను చెలికాడు
నా చూపు నచ్చిందొ నాజూకు ఇచ్చింది
ఏం వానో తడుముతున్నదీ
ఇది ఏం గాలో తరుముతున్నదీ
చాటు మాటు దాటి అవీ ఇవీ చూసేస్తోందే
ఏం వానో తడుముతున్నదీ
ఇది ఏం గాలో తరుముతున్నదీ
హ్మ్..హుమ్మ్ 

స్రవంతి--1986


సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరి
గానం::S.P.బాలు


పల్లవి::

నవ్వుతూ వెళ్ళిపో..నువ్వుగా మిగిలిపో  
పువ్వులా రాలిపో..తావిలా మిగిలిపో 
వేసవిలో మల్లెలా..వేదనలో మనిషిగా
కలకాలం గగనంలో తారలా ఆరనీ దివ్వెలా
నవ్వుతూ వెళ్ళిపో..నువ్వుగా మిగిలిపో
పువ్వులా రాలిపో..తావిలా మిగిలిపో 

చరణం::1

మురిపించే చిరునవ్వే పసిపాపలలో అందమూ
పకపకలాడే పాపల నవ్వే బాపూజీకి రూపమూ 
పగనైన ప్రేమించు..ఆ నవ్వులు
శిలనైన కరిగించు..ఆ నవ్వులు
వేకువలో కాంతిలా..వేదనలో శాంతిలా
చిరకాలం నవ్వాలి స్వాతిలా..ఆరని జ్యోతిలా
నవ్వుతూ వెళ్ళిపో..నువ్వుగా మిగిలిపో 
పువ్వులా రాలిపో..తావిలా మిగిలిపో

చరణం::2

ఉదయించే తూరుపులో కిరణాలన్నీ నవ్వులే
వరములు కోరే దేవుడికిచ్చే హారతి కూడా నవ్వులే
మృతినైనా గెలిచేటి ఈ నవ్వులు నీ పేర మిగిలేటి నీ గురుతులు
నవ్వులతో సంతకం చేసిన..నా జీవితం
అంకితమే చేస్తున్నా..కవితలా తీరని మమతలా

నవ్వుతూ వెళ్ళిపో..నువ్వుగా మిగిలిపో 
పువ్వులా రాలిపో..తావిలా మిగిలిపో
వేసవిలో మల్లెలా..వేదనలో మనిషిగా
కలకాలం గగనంలో తారలా ఆరనీ దివ్వెలా

స్రవంతి--1986

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=12055
సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరి
గానం::S.P.బాలు,P.సుశీల 

పల్లవి::

మౌనం ఆలాపన..మధురం ఆరాధన
దొరికే దేవుని పరిచయం..కలిగే జీవన పరిమళం
కాలమా నిలిచిపో..కావ్యమై మిగిలిపో
తొలి రేయి నీడలో..హో
మౌనం ఆలాపన..మధురం ఆరాధన

చరణం::1

కలలే నిజమై..పది కాలాల బంధాలు ముందుంచగా
యుగమే క్షణమై..అనురాగాల హరివిల్లు అందించగా
దివిలో మెరిసే ఆ నక్షత్ర నాదాలు వినిపించగా
మధుమాసానికి పూల ఉగాది..శతమానానికి ప్రేమే నాంది
హే వసంతాలు సొంతాలుగా చేసుకో
మందహాసాల మందార పూదోటలో
ఆ..ఆ..ఆ
మౌనం ఆలాపన..మధురం ఆరాధన

చరణం::2

ఇహమో పరమో తీపి కన్నీటి కెరటాలు పొంగించగా
శుభమో సుఖమో..తేనె వెన్నెల్లో తెల్లారి పోతుండగా
ఒరిగే తులసీ మౌన గంధాల గానాలు వినిపించగా
కనివిని ఎరుగని సంగమ వేళ..గుప్పెడు మనసుల ఆశల హేల
లేత చిరునవ్వునే పాపగా పెంచుకో 
రాలు కుసుమాల రాగాలనే తెలుసుకో
ఆ..ఆ..ఆ
మౌనం ఆలాపన..మధురం ఆరాధన
దొరికే దేవుని పరిచయం..కలిగే జీవన పరిమళం
కాలమా నిలిచిపో..కావ్యమై మిగిలిపో
తొలి రేయి నీడలో
మౌనం ఆలాపన..మధురం ఆరాధన