Wednesday, March 02, 2011

అనురాగాలు--1975

సంగీతం::సత్యం 
రచన::కొసరాజు 
గానం::P.సుశీల
తారాగణం::రవికాంత్ నాగభూషణం, రాజబాబు,అల్లు రామలింగయ్య,శుభ, కుమారి శ్రీదేవి,రమణమూర్తి 

పల్లవి::

కంటికి నిదురే రాదాయే మనసుకు శాంతే లేదాయే
మ్రోగించకోయీ మురళీ కృష్ణ మ్రోగించకోయీ మురళీ
మైమరపించెను నీ మురళీ పగలే దోచెను ఆ రవళి
మ్రోగించకోయీ మురళీ కృష్ణ మ్రోగించకోయీ మురళీ

చరణం::1

వెన్నదొంగ వనుకొన్నాను ఇన్నాళ్ళూ
నా మనసు దోచు దొంగవు నీవు ఐనావూ
పొంచి పొంచి పొన్నల మాటుకు వస్తానూ
కవ్వించే నీ వేణువును కాజేస్తానూ
చెంతకు చేరి ఎంత వేడిన! మ్మ్..హు.. 
ఇపుడు కాదు పొమ్మంటావు

కంటికి నిదురే రాదాయే మనసుకు శాంతే లేదాయే
మ్రోగించకోయీ మురళీ కృష్ణ మ్రోగించకోయీ మురళీ

చరణం::2

సందెవేళ బృందావనికి చేరేవూ..ఊ
చిలిపి చిలిపి చేష్టలు ఎన్నో చేసేవూ
తలచుకొంటే సిగ్గే ముంచుకు వచ్చేనూ
మనసులోన వలపుల వానలు కురిసేనూ
ఎవ్వరులేని యమునతటిపై వేణుఊది వేదించేవు 

కంటికి నిదురే రాదాయే మనసుకు శాంతే లేదాయే
మ్రోగించకోయీ మురళీ....   
మైమరపించెను నీ మురళీ పగలే దోచెను ఆ రవళి
మ్రోగించకోయీ మురళీ కృష్ణ మ్రోగించకోయీ మురళి
మ్రోగించకోయీ మురళీ కృష్ణ మ్రోగించకోయీ...

Anuraagaalu--1975
Music::Satyam
Lyrics::KosaRaju
Singer's::P.Suseela

Cast::Master Natraj, Ravikanth, Sridevi, Nagabhushanam, Rajbabu, Allu Ramalingaiah, Vedantam Shubha, Jhansi, Udayalaxmi, Janaki, Manjula, Y.V.Raju, Ramdasu, K.K.Sharma, P.J.Sharma, Chalapathi Rao, Suryanarayan, Shanthi, Girija Devi, Sudharani, Laxmi, Eeshwari, Sridhar, Ramana Murthy 

:::

kanTiki nidurE raadaayE manasuku SaantE lEdaayE
mrOginchakOyii muraLii kRshNa mrOginchakOyii muraLii
maimarapinchenu nee muraLii pagalE dOchenu A ravaLi
mrOginchakOyii muraLii kRshNa mrOginchakOyii muraLii

:::1

vennadonga vanukonnaanu innaaLLU
naa manasu dOchu dongavu neevu ainaavU
ponchi ponchi ponnala maaTuku vastaanU
kavvinchE nee vENuvunu kaajEstaanU
chentaku chEri enta vEDina! mm..hu.. 
ipuDu kaadu pommanTaavu

kanTiki nidurE raadaayE manasuku SaantE lEdaayE
mrOginchakOyii muraLii kRshNa mrOginchakOyii muraLii

:::2

sandevELa bRndaavaniki chErEvU..U
chilipi chilipi chEshTalu ennO chEsEvU
talachukonTE siggE munchuku vachchEnU
manasulOna valapula vaanalu kurisEnU
evvarulEni yamunataTipai vENuUdi vEdinchEvu 

kanTiki nidurE raadaayE manasuku SaantE lEdaayE
mrOginchakOyii muraLii....   
maimarapinchenu nee muraLii pagalE dOchenu A ravaLi
mrOginchakOyii muraLii kRshNa mrOginchakOyii muraLi

mrOginchakOyii muraLii kRshNa mrOginchakOyii...