Sunday, October 02, 2011

గాంధి పుట్టిన దేశం--1973



పాట ఇక్కడ క్లిక్ చేసి చిమ్మట ఖజానాలో వినండి


సంగీతం::S.కోదండపాణి
రచన::మైలవరపు గోపి
గనం::P.సుశీల

గాంధిపుట్టినదేశం రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం
ఇది సమతకు మమతకు సంకేతం

గాంధిపుట్టినదేశం రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం
ఇది సమతకు మమతకు సంకేతం

రఘుపతి రాఘవ రాజారాం
పతిత పావన సీతారాం
ఈశ్వర అల్లా తేరేనాం
సబకో సన్నుతి హే భగవాన్

బేధాలన్నీ మరచీ మోసం ద్వేషం విడచీ
బేధాలన్నీ మరచీ మోసం ద్వేషం విడచీ
మనిషి మనిషిగా బ్రతకాలి
ఏనాడూ నీతికి నిలవాలీ
మనిషి మనిషిగా బ్రతకాలి
ఏనాడూ నీతికి నిలవాలీ బాపూ...
ఈ కమ్మని వరమే మాకివ్వు
అవినీతిని గెలిచే వరమివ్వు
అవినీతిని గెలిచే వరమివ్వూ

గాంధీ పుట్టినదేశం రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం
ఇది సమతకు మమతకు సంకేతం

రఘుపతి రాఘవ రాజారాం
పతిత పావన సీతారాం
ఈశ్వర అల్లా తేరేనాం
సబకో సన్నుతి హే భగవాన్

ప్రజలకు శాంతి సౌఖ్యం
కలిగించే దేశమే దేశం
ప్రజలకు శాంతి సౌఖ్యం
కలిగించే దేశమే దేశం
బానిస భావం విడనాడి
ఏ జాతి నిలుచునో అది జాతీ..
బానిస భావం విడనాడి
ఏ జాతి నిలుచునో అది జాతీ..
బాపూ..ఊ..నీ చల్లని దీవెన మాకివ్వు
నీ బాటను నడిచే బలమివ్వు..
నీ బాటను నడిచే బలమివ్వు..

గాంధీ పుట్టినదేశం రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం
ఇది సమతకు మమతకు సంకేతం

రఘుపతి రాఘవ రాజారాం
పతిత పావన సీతారాం
ఈశ్వర అల్లా తేరేనాం
సబకో సన్నుతి హే భగవాన్
రఘుపతి రాఘవ రాజారాం
పతిత పావన సీతారాం

పవిత్ర బంధం--971

Gandhi jayanthi shubakankshalu andariki
((గాంధీజయంతి సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు.))






సంగీతం::S.రాజేశ్వరరావ్
రచన::శ్రీ శ్రీ
గానం::ఘంటసాల


గాంధి పుట్టిన దేశమా ఇది?నెహ్రు కోరినా సంఘమా ఇది?
గాంధి పుట్టిన దేశమా ఇది?నెహ్రు కోరినా సంఘమా ఇది?
సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా..
గాంధి పుట్టిన దేశమా...

సస్యశ్యామల దేశం..అయినా నిత్యం క్షామం
సస్యశ్యామల దేశం..అయినా నిత్యం క్షామం
ఉప్పొంగే నదుల జీవజలాలు ఉప్పు సముద్రంపాలు
యువకుల శక్తికి భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలు
ఉన్నది మనకూ ఓటూ..బ్రతుకు తెరువుకే లోటూ...

గాంధి పుట్టిన దేశమా ఇది?నెహ్రు కోరినా సంఘమా ఇది?
సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా ఇది...
గాంధి పుట్టిన దేశమా..

సమ్మె ఘెరావూ దొమ్మీ..బస్సుల దహనం లూఠీ
సమ్మె ఘెరావూ దొమ్మీ..బస్సుల దహనం లూఠీ
శాంతీ సహనం సమధర్మంపై విరిగెను గూండా లాఠీ
అధికారంకై పెనుగులాటలో అన్నాదమ్ముల పోటీ
హెచ్చెను హింసాద్వేషం..ఏమవుతుందీ దేశం?

గాంధి పుట్టిన దేశమా ఇది?నెహ్రు కోరినా సంఘమా ఇది?
సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా ఇది...
గాంధి పుట్టిన దేశమా????

వ్యాపారాలకు పర్మిట్వ్య..వహారాలకు లైసెన్స్
అర్హతలేని ఉద్యోగాలూ లంచం ఇస్తే ఓయెస్
సిఫార్సు లేనిదె శ్మశానమందూ దొరకదు రవ్వంత చోటు
పేరుకి ప్రజలది రాజ్య పెత్తందార్లదె భోజ్యం

గాంధి పుట్టిన దేశమా ఇది?నెహ్రు కోరినా సంఘమా ఇది?
సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా ఇది?
గాంధి పుట్టిన దేశమా????