Monday, March 08, 2010

ఇలవేలుపు--1956::ఆభేరి::రాగం





















సంగీతం::సుసర్ల దక్షిణామూర్తి 
రచన::సదాశివబ్రహ్మం 
గానం::P.లీల, రఘునాధ్, P.సుశీల 
తారాగణం::అక్కినేని,చలం,జమున,గుమ్మడి,అంజలీదేవి,రేలంగి, రమణారెడ్డి,సూర్యకాంతం
ఆభేరి::రాగం

పల్లవి::

చల్లనిరాజా ఓ చందమామ 
చల్లనిరాజా ఓ చందమామ 
నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ..నా చందమామ 
చల్లనిరాజా ఓ చందమామ 
నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ..నా చందమామ

చరణం::1

పరమేశుని జడలోన చామంతివి 
నీలిమేఘాల నానేటి పూబంతివి 
పరమేశుని జడలోన చామంతివి 
నీలిమేఘాల నానేటి పూబంతివి 
నిను సేవించగా నను దయచూడవా 
ఓ వెన్నెల వన్నెల నా చందమామ 

చల్లనిరాజా ఓ చందమామ 
నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ..నా చందమామ

చరణం::2

చల్లనిరాజా ఓ చందమామ..చల్లనిరాజా ఓ చందమామ 
నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ..నా చందమామ

నిను చూచిన మనసెంతో వికసించుగా 
తొలి కోరికలెన్నో చిగురించుగా 
ఆశలూరించునే చెలి కనిపించునే 
చిరునవ్వుల వెన్నెల కురిపించులే 
చల్లనిరాజా ఓ చందమామ..చల్లనిరాజా ఓ చందమామ 
చల్లనిరాజా ఓ చందమామ.. 
నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ నా చందమామ 

చరణం::3

నను చూడవు పిలచిన మాట్లాడవు 
చిన్నదానను వదలను ప్రియురాలను 
నను చూడవు పిలచిన మాట్లాడవు 
చిన్నదానను వదలను ప్రియురాలను 
నిన్నే కోరానురా నన్నే కరుణించరా 
ఈ వెన్నెల కన్నెతో విహరించరా..ఆ.. 
చల్లనిరాజా ఓ చందమామ 
నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ..నా చందమామ

Ilavelpu--1956
Music::Susarla DakshinaaMoorti 
Lyrics::SadaaSivaBrahmam
Singer'S::P.Leela, Raghunaadh,P.Suseela 
Cast::Akkieni,Chalam,Jamuna,Gummadi,Anjaleedevi,Relangi, Ramanareddi,Sooryakaantam

:::

challaniraajaa o chandamaama 
challaniraajaa o chandamaama 
nee kathalanni telisaayi o chandamaama..naa chandamaama 
challaniraajaa o chandamaama 
nee kathalanni telisaayi o chandamaama..naa chandamaama

:::1

paramesuni jadalona chaamantivi 
neelimeghaala naaneti poobantivi 
paramesuni jadalona chaamantivi 
neelimeghaala naaneti poobantivi 
ninu sevinchagaa nanu dayachoodavaa 
o vennela vannela naa chandamaama 

challaniraajaa o chandamaama 
nee kathalanni telisaayi o chandamaama..naa chandamaama

:::2

challaniraajaa o chandamaama..challaniraajaa o chandamaama 
nee kathalanni telisaayi o chandamaama..naa chandamaama

ninu choochina manasento vikasinchugaa 
toli korikalenno chigurinchugaa 
aasaloorinchune cheli kanipinchune 
chirunavvula vennela kuripinchule 
challaniraajaa o chandamaama..challaniraajaa o chandamaama 
challaniraajaa o chandamaama.. 
nee kathalanni telisaayi o chandamaama naa chandamaama 

:::3

nanu choodavu pilachina maatlaadavu 
chinnadaananu vadalanu priyuraalanu 
nanu choodavu pilachina maatlaadavu 
chinnadaananu vadalanu priyuraalanu 
ninne koraanuraa nanne karunincharaa 
ee vennela kanneto viharincharaa..aa.. 
challaniraajaa o chandamaama 
nee kathalanni telisaayi o chandamaama..naa chandamaama

విప్రనారాయణ--1954



























సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::సముద్రాల రాఘవాచార్యులు (సముద్రాల సీనియర్)
గానం::A.M.రాజా, P.భానుమతి

తారాగణం::అక్కినేని,P.భానుమతి,రేలంగి,V.శివరాం,సంధ్య,అల్లు రామలింగయ్య,
R.నాగేశ్వరరావు

పల్లవి::

మధురమధురమీ..చల్లనిరేయి
మరువ తగనిది..ఈ..ఈహాయి
మధురమధురమీ..చల్లనిరేయి
మరువ తగనిది..ఈ..ఈహాయి
మధురమధురమీ..చల్లనిరేయి

చరణం::1

నవ్వుల వెన్నెల నాలో వలపుల
నవ్వుల వెన్నెల నాలో వలపుల
కవ్వించునదే దేవీ..ఈ..
స్వాముల సోయగమెంచి
పులకించునదేమో రేరాణి..ఈ..

మధురమధురమీ..చల్లనిరేయి
మరువ తగనిది..ఈ..ఈహాయి
మధురమధురమీ..చల్లనిరేయి

చరణం::2

విరికన్నెలు అరవిరిసిన
కన్నుల దరహసించునో దేవీ..ఈ..
విరికన్నెలు అరవిరిసిన
కన్నుల దరహసించునో దేవీ
మన అనురాగము చూసి..ఈ..
మన అనురాగము చూసి
చిరునవ్వుల చిలుకును స్వామీ..ఈ..

మధురమధురమీ..చల్లనిరేయి
మరువ తగనిది..ఈ..ఈహాయి
మధురమధురమీ..చల్లనిరేయి

చరణం::3

మీ వరమున నా జీవనమే
పావనమాయెను స్వామీ..ఈ.. 
మీ వరమున నా జీవనమే
పావనమాయెను స్వామీ..ఈ.. 
ఈ వనసీమయె నీ చెలిమి..ఆ..
ఈ వనసీమయె నీ చెలిమి
జీవనమాధురి చవిచూసినదే

మధురమధురమీ..చల్లనిరేయి
మరువ తగనిది..ఈ..ఈహాయి
మధురమధురమీ..చల్లనిరేయి

దొరలు దొంగలు--1976

సంగీతం::సత్యం
రచన::మల్లెమాల
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం::రామకృష్ణ,రంగనాద్,శ్రీధర్,చంద్రమోహన్,వాణిశ్రీ,S.వరలక్ష్మి

పల్లవి::

ఓలయ్యొ ఓలమ్మొ..ఓలయ్యొ ఓలమ్మో 
ఈయాల మనకంతా పండగా
ఏటికీ నీరోచ్చి౦ది ద౦డిగా
ఏటికీ నీరోచ్చి౦ది ద౦డిగా
ఓలయ్యొ ఓలమ్మొ..ఓలయ్యొ ఓలమ్మో 
ఈయాల మనకంతా పండగా
ఏటికీ నీరోచ్చి౦ది ద౦డిగా
ఏటికీ నీరోచ్చి౦ది ద౦డిగా

చరణం::1

రేవులోని అడుసంతా రూపుమాసీ పోయి౦ది
రేవులోని అడుసంతా రూపుమాసీ పోయి౦ది   
రేయే౦ది పగలే౦ది ఉతకండి జోరుగా
ఓలయ్యొ ఓలమ్మొ..ఓలయ్యొ ఓలమ్మో 
ఈయాల మనకంతా పండగా
ఏటికీ నీరోచ్చి౦ది ద౦డిగా
ఏటికీ నీరోచ్చి౦ది ద౦డిగా

చరణం::2

పట్టు పంచ పంచా౦గం పాపయ్యది
ఈ గళ్ళ కోక పూటకూళ్ళ గౌరమ్మది
పట్టు పంచ పంచా౦గం పాపయ్యది
ఈ గళ్ళ కోక పూటకూళ్ళ గౌరమ్మది
ఈ రెంటికి ఈ రెంటికి ల౦కెర పిచ్చి సన్యాసి
భాదర జతచేసి బండకేసి
ఓలయ్యొ ఓలమ్మొ..ఓలయ్యొ ఓలమ్మో 
ఈయాల మనకంతా పండగా
ఏటికీ నీరోచ్చి౦ది ద౦డిగా
ఏటికీ నీరోచ్చి౦ది ద౦డిగా

చరణం::3

ఎల్లాయి కుండఫైన ఎన్ని రంగులు
ఏందట్టా సూస్తావు యెర్రి గంగులు
ఎల్లాయి కుండఫైన ఎన్ని రంగులు
ఏందట్టా సూస్తావు యెర్రి గంగులు
ఏటి గాలి కెగిరింది ఫైట సెంగు
ఏటి గాలి కెగిరింది ఫైట సెంగు
బైట పడి కూకుంది వయసు పొంగు
ఓలయ్యొ ఓలమ్మొ..ఓలయ్యొ ఓలమ్మో  
ఈయాల మనకంతా పండగా
ఏటికీ నీరోచ్చి౦ది ద౦డిగా
ఏటికీ నీరోచ్చి౦ది ద౦డిగా