Friday, April 24, 2009

గోరంత దీపం--1978




గోరంత దీపం
సంగీతం::KV.మహాదేవన్
రచన::C.నారాయణ రెడ్డి
గానం::P.సుశీల
రాగం:::శివరంజనీ:::
(హిందుస్తానీ కర్నాటక)

రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా
బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా(పుణ్యకావ్యము రాయగా)
పడవనైనా కాకపోతిని స్వామికార్యము తీర్చగా
పాదుకైనా కాకపోతిని భక్తిరాజ్యము నేలగా
రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా
బోయనైనా కాకపోతిని పుణ్యకావ్యమురాయగా

అడవిలోపల పక్షినైతే అతివసీతను కాచనా
అందువలన రామచంద్రుని అమితకరుణను నోచనా
కడలి గట్టున ఉడతనైతే ఉడత సాయము చేయనా
కాలమెల్లా రామభద్రుని వేలిగురుతులు మోయనా
రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా
బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా
రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా
బోయనైనా కాకపోతిని పుణ్యకావ్యమురాయగా

కాకినైనా కాకపోతిని ఘాతుకమ్మును చేయుచూ
గడ్డిపోచను శరముచేసె ఘనత రాముడు చూపగా
మహిని అల్ప జీవులే ఈ మహిమ లన్నీ నోచగా
మనిషినై జన్మించినానే మచ్చరమ్ములు రేపగా
మద మచ్చరమ్ములు రేపగా
రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా
బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా
రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా
బోయనైనా కాకపోతిని పుణ్యకావ్యమురాయగా

గోరంత దీపం--1978



సంగీతం::KV.మహాదేవన్
రచన::C.నారాయణరెడ్డి
గానం::సుశీల,బాలు

VaniSri::గోరంత దీపం కొండంత వెలుగు
చిగురంత ఆశ జగమంత వెలుగు
Sridhar::గోరంత దీపం కొండంత వెలుగు
చిగురంత ఆశ జగమంత వెలుగు

Vani::కరి మబ్బులు కమ్మే వేళ మెరుపు తీగే వెలుగు
కారు చీకటి ముసిరే వేళ వేగు చుక్కే వెలుగు
కరి మబ్బులు కమ్మే వేళ మెరుపు తీగే వెలుగు
కారు చీకటి ముసిరే వేళ వేగు చుక్కే వెలుగు

Sridhar::మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు
మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు
దహియించే బాధల మధ్యన సహనమే వెలుగు
iddaru::ఆ హా హా హా ఆ ఆ ఆ
Vaniగోరంత దీపం కొండంత వెలుగు
Sri::చిగురంత ఆశ జగమంత వెలుగు

Vani::కడలి నడుమ పడవ మునిగితే కడ దాకా ఈదాలి
కడలి నడుమ పడవ మునిగితే కడ దాకా ఈదాలి

Sri::నీళ్ళు లేని ఎడారిలో..ఓ..ఓ..ఓ.
నీళ్ళు లేని ఎడారిలో కన్నీళ్ళైన తాగి బతకాలి
నీళ్ళు లేని ఎడారిలో కన్నీళ్ళైన తాగి బతకాలి

Vani::ఏ తోడు లేని నాడు నీ నీడే నీకు తోడు
Sri::ఏ తోడు లేని నాడు నీ నీడే నీకు తోడు

vani::జగమంతా దగా చేసినా
Sri::చిగురంత ఆశను చూడు
vaNi::చిగురంత ఆశ
Sri::జగమంత వెలుగు
iddaru::గోరంత దీపం కొండంత వెలుగు
చిగురంత ఆశ జగమంత వెలుగు