Saturday, June 02, 2007

గీత--1973







పాట ఇక్కడ వినండి


సంగీతం::KV.మహదేవన్
సాహిత్యం::GK.మూర్తి
గానం::S.P.బాలు

పూచే పూలలోనా..వీచే గాలిలోనా
నీ అందమే దాగెనే..నీ అందెలే మ్రోగెనే
పూచే పూలలోన..వీచే గాలిలోన
నీ అందమే దాగెనే..నీ అందెలే మ్రోగెనే
ఓ చెలీ..ఓ చెలీ..

నా ఊహలో నీవు ఉయ్యాలలూగేవు
నా ఊపిరై నీవు నాలోన సాగెవు
నీవు నా సర్వమే..నీవు నా స్వర్గమే
నీవు నా సర్వమే..నీవు నా స్వర్గమే
నీవు లేకున్న ఈ లోకమే..శూన్యమే

పూచే పూలలోన..వీచే గాలిలోన
నీ అందమే దాగెనే..నీ అందెలే మ్రోగెనే
ఓ చెలీ..ఓ చెలీ..

ఎన్నో జన్మల బంధము మనదీ
ఎవ్వరు ఏమన్నా ఇది వీడనిదీ
నీవు నా గానమె..నీవు నా ధ్యానమే
నీవు లేకున్న ఈ లోకమే శూన్యమే

పూచే పూలలోన..వీచే గాలిలోన
నీ అందమే దాగెనే..నీ అందెలే మ్రోగెనే

ముందడుగు--1958




సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::మాధవపెద్ది సత్యం,జిక్కి

Film Directed By::Krishna Rao
తారాగణం::జగ్గయ్య,,R..నాగేశ్వరరావు,కుటుంబరావు,బాలకృష్ణ,జానకి,గిరిజ,హేమలత,సీత. 

పల్లవి::

కోడెకారు చిన్నవాడా
వాడిపోని వన్నెకాడా
కోడెకారు చిన్నవాడా
వాడిపోని వన్నెకాడా
కోటలోనా పాగా వేసావా
చల్ పువ్వుల రంగా
మాటతోనే మనసు దోచావా
చల్ పువ్వుల రంగా
మాటతోనే మనసు దోచావా

చింత పూల రైక దానా
చిలిపి చూపుల చిన్నాదానా
చింత పూల రైక దానా
చిలిపి చూపుల చిన్నాదానా
కోరికలతో కోటే కట్టావా
చల్ నవ్వుల రాణీ
దోరవలపుల దోచుకున్నావా
చల్ నవ్వుల రాణీ
దోరవలపుల దోచుకున్నావా
చల్ నవ్వుల రాణీ
దోరవలపుల దోచుకున్నావా

చరణం::1

చెట్టు మీద పిట్ట ఉంది
పిట్ట నోట పిలుపు ఉంది
చెట్టు మీద పిట్ట ఉంది
పిట్ట నోట పిలుపు ఉంది
పిలుపు ఎవరికో తెలుసుకున్నావా
చల్ పువ్వుల రంగా
తెలుసుకుంటే కలిసి ఉంటావా
చల్ పువ్వుల రంగా
తెలుసుకుంటే కలిసి ఉంటావా

పిలుపు విన్నా తెలుసుకున్నా
పిల్లదానా నమ్ముకున్నా
పిలుపు విన్నా తెలుసుకున్నా
పిల్లదానా నమ్ముకున్నా
తెప్పలాగా తేలుతున్నానే
చల్ నవ్వుల రాణీ
నాకు జోడుగా నావా నడిపేవా
చల్ నవ్వుల రాణీ
నాకు జోడుగా నావా నడిపేవా

చరణం::2

నేల వదిలి నీరు వదిలి
నేను నువ్వను తలపు మాని
నేల వదిలి నీరు వదిలి
నేను నువ్వను తలపు మాని
ఇద్దరొకటై ఎగిరిపోదామా
చల్ పువ్వుల రంగా
గాలి దారుల తేలి పోదామా
చల్ పువ్వుల రంగా
గాలి దారుల తేలి పోదామా

ఆడదాని మాట వింటే
తేలిపోటం తేలికంటే
ఆడదాని మాట వింటే
తేలిపోటం తేలికంటే
తేల్చి తేల్చి ముంచుతారంటా
చల్ నవ్వుల రాణీ
మునుగుతుంటే నవ్వుతారంటా
చల్ నవ్వుల రాణీ
మునుగుతుంటే నవ్వుతారంటా

కోడె కారు చిన్న వాడా
వాడిపోని వన్నె కాడా
కోటలోనా పాగా వేసావా
చల్ పువ్వుల రంగా
మాటతోనే మనసు దోచావా
చల్ పువ్వుల రంగా
మాటతోనే మనసు దోచావా

చింత పూల రైకదానా
చిలిపి చూపుల చిన్నాదానా
కోరికలతో కోటే కట్టావా
చల్ నవ్వుల రాణీ
దోర వలపుల దోచుకున్నావా
చల్ నవ్వుల రాణీ
దోర వలపుల దోచుకున్నావా

అమాయకురాలు--1971::మోహన::రాగం





సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::దాశరధి
గానం::P.సుశీల

తారాగణం::అక్కినేని,శారద,కాంచన,నాగభూషణం,గుమ్మడి,చంద్రమోహన్,సూర్యకాంతం,రమాప్రభ,రాజబాబు,చలం,అల్లురామలింగయ్య.

రాగం::మోహన

పల్లవి::

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
పాడెద నీ నామమే..గోపాలా
పాడెద నీ నామమే..గోపాలా
హృదయములోనే..పదిలముగానే
నిలిపెద నీ రూపమేరా
పాడెద నీ నామమే..గోపాలా

చరణం::1

మమతలలోనే..మాలికలల్లి
నిలిచితి..నీకోసమేరా
మమతలలోనే..మాలికలల్లి
నిలిచితి..నీకోసమేరా
ఆశలతోనే..హారతి చేసి
పదములు..పూజింతు రారా
పాడెద నీ నామమే..గోపాలా

చరణం::2

నీ మురళీ గానమే..పిలిచెరా
కన్నుల నీమోము..కదలెనులేరా
నీ మురళీ గానమే..పిలిచెరా
పొన్నలు పూచే..బృందావనిలో
వెన్నెల కురిసే..యమునాతటిపై
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
పొన్నలు పూచే..బృందావనిలో 
వెన్నెల కురిసే..యమునాతటిపై
నీ సన్నిధిలో..జీవితమంతా
కానుక చేసేను..రారా 

పాడెద నీ నామమే..గోపాలా
హృదయములోనే..పదిలముగానే
నిలిపెద నీ రూపమేరా
పాడెద నీ నామమే..గోపాలా

Amayakuralu--1971
Music::Saluri Rajeswara Rao
Lyricis::Dasarathi
Singer's::P.Suseela 

Mohana::Ragam

:::::

aa aa aa aa aa aa aa aa..
paadeda nee naamame..gopaalaa
paadeda nee naamame..gopaalaa
hrudayamulone..padilamugaane
nilipeda nee roopameraa
paadeda nee naamame..gopaalaa

:::1

mamatalatone..maalikalalli
nilichiti..nee kosameraa
mamatalatone..maalikalalli
nilichiti..nee kosameraa
Asalatone..Arati chesi
padamulu..poojintu raaraa
paadeda nee naamame..gopaalaa

:::2

nee muralii gaaname..pilicheraa
kannula nee moomu kadilenu leraa
nee muralii gaaname..pilicheraa
kannula nee moomu kadilenu leraa
ponnalu pooche..brundaavanilo
vennela kurise..yamunaataTipai
aa aa aa aa aa aa aa aa..
ponnalu pooche..brundaavanilo
vennela kurise..yamunaataTipai
nee sannidhilO..jeevita mantaa
kaanuka chesenu..raaraa

paadeda nee naamame..gopaalaa
hrudayamulone..padilamugaane
nilipeda nee roopameraa
paadeda nee naamame..gopaalaa

దేవుడులాంటి మనిషి--1975


సంగీతం::K.V.మహాదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల,S.P.బాలు
తారాగణం::కృష్ణ,మంజుల, శ్రీదేవి,నాగభూషణం,రాజబాబు,చంద్రమోహన్, మాడ 

పల్లవి::

చారడేసీ కళ్ళేమి చేసుకుంటావూ
ఓరబ్బీ నీ అందం చూసుకుంటానూ
చూచుకున్న అందమేమి చేసుకుంటావూ
కాటుకలా రంగరించి పూసుకుంటానూ
చారడేసీ కళ్ళేమి చేసుకుంటావూ
ఓరబ్బీ నీ అందం చూసుకుంటానూ
సింగారి సింగారి పిల్లా
బంగారు బంగారు మామా
సింగారి సింగారి పిల్లా
బంగారు బంగారు మామా

చరణం::1

ఏటికి ఎదురీదే గండుమీనులా
ఎందుకే తుళ్ళి తుళ్ళి పడుతున్నావూ
ఏటికి ఎదురీదే గండుమీనులా
ఎందుకే తుళ్ళి తుళ్ళి పడుతున్నావూ
తగినోడు కాదగినోడూ - తగినోడు కాదగినోడూ 
నే జిక్కేది ఎప్పుడని చూస్తున్నానూ
చేజిక్కితే వాణేమి చేసుకుంటావూ?
నా కొప్పులో గుప్పున ముడిచేసుకుంటానూ
చారడేసీ కళ్ళేమి చేసుకుంటావూ
ఓరబ్బీ నీ అందం చూసుకుంటానూ

చరణం::2

పట్టు దొరకని పరువంలాగా
పడవెళ్ళిపొతుందే పడుచుదానా
వీలుచూసీ వాలుచూసీ
వీలుచూసీ వాలుచూసీ
ఎత్తరా తెరచాప బుల్లిరాయడా
ఓ నా బుజ్జి నాయనా
నేను బుజ్జోణ్ణయితే ఎమిచేసుకుంటావూ
పాల బువ్వెట్టి ఎదలో దాచేసుకుంటానూ

చరణం::3

పంట చేనిపై పైర గాలిలా
ఎందుకో చక్కిలిగిలి పెడుతున్నావూ
పంట చేనిపై పైర గాలిలా
ఎందుకో చక్కిలిగిలి పెడుతున్నావూ
మూణ్ణాళ్ళకా రెణ్ణాళ్ళకా
మూణ్ణాళ్ళకా రెణ్ణాళ్ళకా 
మూడు ముళ్ళు ఎప్పుడని అడుగుతున్నానూ
ఆ మూడు ముళ్ళు వేసి ఏమి చేసుకుంటావూ
నిన్ను ప్రతి జన్మకు నా దానిగ చేసుకుంటానూ
చారడేసీ కళ్ళేమి చేసుకుంటావూ
ఓరబ్బీ నీ అందం చూసుకుంటానూ
సింగారి సింగారి పిల్ల
బంగారు బంగారు మామా
సింగారి సింగారి పిల్ల
బంగారు బంగారు మామా