Tuesday, May 26, 2009

చిన్ననాటి స్నేహితులు--1971


సంగీతం::T.V.రాజు
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం:: ఘంటసాల,P.సుశీల


అందాలా శ్రీమతికీ మనసైనా ప్రియసతికి
వలపుల కానుకగా..ఒక పాపను నేనివ్వనా
మబ్బులలో..విహరించే..మావారీ అనురాగం
వాడని మందారం..నా పాపిట సింధూరం..

మా బాబు నయనాలూ..లేత జాబిల్లి కిరణాలు..
మా బాబు నయనాలూ..లేత జాబిల్లి కిరణాలు
వీడే..ఇంతవాడై..అంతవాడై..వెలుగుతాడూ..
వీడే..ఇంతవాడై..అంతవాడై..వెలుగుతాడూ
కలలు నిండారగా..సిరులుపొంగారగా..

అందాలా శ్రీమతికీ మనసైనా ప్రియసతికి
వలపుల కానుకగా..ఒక పాపను నేనివ్వనా
మబ్బులలో..విహరించే..మావారీ అనురాగం
వాడని మందారం..నా పాపిట సింధూరం

సౌర్యంలో..నేతాజీ..
శరణంలో..గాంధిజీ..
శాంతిగుణంలో నెహౄజీ..
శాంతిగుణంలో నెహౄజీ..
సాహసంలో శాస్త్రిజీ..
ఒరవడిగా..వడివడిగా..
నీ నడవడి తీర్చి దిద్దుకొనీ..
ఒరవడిగా..వడివడిగా..
నీ నడవడి తీర్చి దిద్దుకొనీ..
సరిహద్దులలో పొంచిన ద్రోహుల
తరిమి తరిమి కొట్టాలీ..
వీరసైనికుడవై భరతావని..పేరును నిలబెట్టాలీ
వందేమాతరం..వందేమాతరం.. వందేమాతరం..

చిన్ననాటి స్నేహితులు--1971
























సంగీతం::T.V.రాజు
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::S.P.బాలు,P.సుశీల


అడగాలని వుంది ఒకటడగాలని వుంది
అడగాలని వుంది ఒకటడగాలని వుంది
అదిగినదానికి బదులిస్తే ఇస్తే?
అందుకు బహుమానం ఒకటుంది
అడగాలని వుంది ఒకటడగాలని వుందీ..

అడగాలని వుంది ఒకటడగాలని వుంది
అడగాలని వుంది ఒకటడగాలని వుంది
అదిగినదానికి బదులిస్తే ఇస్తే?
అందుకు బహుమానం ఒకటుంది
అడగాలని వుంది ఒకటడగాలని వుందీ..

ఎదురుగా నిలుచుంటే..ఎంతో ముద్దుగ మెరిసేదేదీ
ఎదురుగా నిలుచుంటే..ఎంతో ముద్దుగ మెరిసేదేదీ
అందీ అందకుంటే..అందీ అందకుంటే..
ఇంకెంతో అందంచిందేదేదీ

చేప..ఉహు..చూపు..ఆహ..సిగ్గు..ఉహు
మొగ్గా..ఆహా..మొగ్గకాదు..కన్నెపిల్ల బుగ్గా..

అడగాలని వుంది ఒకటడగాలని వుంది
అడగాలని వుంది ఒకటడగాలని వుంది
అదిగినదానికి బదులిస్తే ఇస్తే?
అందుకు బహుమానం ఒకటుంది
అడగాలని వుంది ఒకటడగాలని వుందీ..

కొత్తగా రుచి చూస్తుంటే మత్తుగా వుండేదేదీ..
కొత్తగా రుచి చూస్తుంటే మత్తుగా వుండేదేదీ..
మళ్ళి తలచుకొంటే..మళ్ళి తలచుకొంటే
మరింత రుచిగ వుండేదేదీ..

వెన్నా..మ్మ్హు..జున్ను..ఉహు..తీపీ..ఉహూ..
ఆ..పులుపూ.....
అహా..పులుపు కాదూ తొలివలపూ.....
అడగాలని వుంది ఒకటడగాలని వుందీ..

ఎంతగా చలి వేస్తుంటే అంతగా మనసయ్యేదేదీ
ఎంతగా..చేరదీస్తే..హాయ్..
ఎంతగా..చేరదీస్తే..అంతగా మురిపించేదేదీ

కుంపటి..మ్మ్ హు..దుప్పటి..అహా..గొంగళి..మ్మ్ ఉహు
కంబళి..అహా..కంబళికాదూ..కౌగిలీ...

అడగాలనివుంది అది అడగాలనివుంది
అడగాలనివుంది అది అడగాలనివుంది
అడగంగానే ఇచ్చేస్తే..అడగంగానే ఇచ్చేస్తే
అందులో రుచి ఏముందీ..ఆహా..హా..ఆ హా..

కధానాయకుడు--1969


సంగీతం::T.V.రాజు
రచన::కోసరాజు రాఘవయ్య చౌదరి
గానం::ఘంటసాల,P.సుశీల


బలె భలె భలె భల్లే....
హ్హ హ్హ హ్హ హ్హ ఓ..ఓ..ఓ..ఓ..
హ్హ హ్హ హ్హ హ్హ ఓ..ఓ..ఓ..ఓ..


వినవయ్య రామయ్య..ఏమయ్య భీమయ్య
వినవయ్య రామయ్య..ఏమయ్య భీమయ్య
మన మంటే గెలిచిందయ్య..మన మాటే నిలిచిందయ్యా
వినవయ్య రామయ్య..ఏమయ్య భీమయ్య
వినవయ్య రామయ్య..ఏమయ్య భీమయ్య

అపద్దాలు చెప్పెవారు..అన్యాయం చేసేవారు
అపద్దాలు చెప్పెవారు..అన్యాయం చేసేవారు
చిత్తు చిత్తుగా వోడారయ్య..నెత్తికి చేతులు వచ్చినవయ్య

వినవయ్య రామయ్య..ఏమయ్య భీమయ్య
మన మంటే గెలిచిందయ్య..మన మాటే నిలిచిందయ్యా
వినవయ్య రామయ్య..ఏమయ్య భీమయ్య

మహా నాయకులు త్యాగంచేసి.. మనకిచ్చిన స్వాత్రంత్యం
మహా నాయకులు త్యాగంచేసి.. మనకిచ్చిన స్వాత్రంత్యం
కొందరి చేతుల పడనీకుండ..అందరు పొమ్మని చెప్పాలి

వినవయ్య రామయ్య..ఏమయ్య భీమయ్య
మన మంటే గెలిచిందయ్య..మన మాటే నిలిచిందయ్యా
వినవయ్య రామయ్య..ఏమయ్య భీమయ్య

నిరుపేదలని ప్రేమించే వారను..నిజాయితీగా నడచేవారును
నిరుపేదలని ప్రేమించే వారను..నిజాయితీగా నడచేవారును
పదవి వచ్చి వలచిందయ్యా..జయలక్ష్మి వరించినదయ్యా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

వినవయ్య రామయ్య..ఏమయ్య భీమయ్య
మన మంటే గెలిచిందయ్య..మన మాటే నిలిచిందయ్యా
వినవయ్య రామయ్య..ఏమయ్య భీమయ్య

దగాకోరులౌ దోపిడి దొంగలు..తల్లకిందలౌతారయ్యా
దగాకోరులౌ దోపిడి దొంగలు..తల్లకిందులౌతారయ్యా
నీతికి నిలబడు కథానాయకులు..జాతికి ప్రాణం పోసేరయ్యా

వినవయ్య రామయ్య..ఏమయ్య భీమయ్య
మన మంటే గెలిచిందయ్య..మన మాటే నిలిచిందయ్యా
వినవయ్య రామయ్య..ఏమయ్య భీమయ్య
వినవయ్య రామయ్య..ఏమయ్య భీమయ్య
వినవయ్య రామయ్య..ఏమయ్య భీమయ్య