సంగీతం::T.చలపతిరావు
రచన::ఆత్రేయ
గానం::S.P. బాలు,బృందం
పల్లవి::
జీవితానికొక..ధ్యేయం కావాలి
ఆ ధ్యేయాన్ని..సాధించే దీక్ష కావాలి
ఓఓఓఓ..మనిషి..ఓహోఓఓఓ..మనిషి
ఓఓఓఓ..మనిషి..ఓహోఓఓఓ..మనిషి
శ్రమ శక్తిని తెలుసుకొనీ
క్రమ శిక్షణ మలచుకొనీ
శ్రమ శక్తిని తెలుసుకొనీ
క్రమ శిక్షణ మలచుకొనీ
నిటారుగా నిలుచుంటే
విజయం నీదే..అంతిమ విజయం నీదే
ఓఓఓఓ..మనిషి..ఓహోఓఓఓ..మనిషి
చరణం::1
ఓహ్హో హ్హో హ్హో హ్హో ఓహో
ఓహ్హో హ్హో హ్హో హ్హో ఓహో
కండలే..ఏ..కొండల్ని పిండిచేస్తాయి
వంగనీ..ఈ..లోహాన్ని లొంగ దీస్తాయి
కండలే..ఏ..కొండల్ని పిండిచేస్తాయి
వంగనీ..ఈ..లోహాన్ని లొంగ దీస్తాయి
చిని చిన్ని చినుకులే..ఏ..పెను వాగు లౌతాయిలే
చిని చిన్ని చినుకులే..ఏ..పెను వాగు లౌతాయిలే
ఓఓఓఓ..మనిషి..ఓహోఓఓఓ..మనిషి
చరణం::2
ఓ హో హో హో హో ఓ హో హో హో హో
తరం తరం..దూరమైన కాలమిదీ
క్షణం క్షణం..మారుతున్న లోకమిదీ
తరం తరం..దూరమైన కాలమిదీ
క్షణం క్షణం..మారుతున్న లోకమిదీ
ఈ తరంలో..ఈ క్షణంలో
ఈ తరంలో..ఈ క్షణంలో
నీవు నీవుగా..బ్రతకాలీ
భావి బాటనే వెతకాలీ..బతకాలీ
ఓఓఓఓ.మనిషి..ఓహోఓఓఓ..మనిషి
చరణం::3
ఆ ఆఅ హాహాహా ఆఆఆ హాహాహా
తిండి దొరకని..వారొకవైపూ
తిన్న దరగని..వారొకవైపూ
తిండి దొరకని..వారొకవైపూ
తిన్న దరగని..వారొకవైపూ
రాళ్ళు బండలు..ఒక వైపూ
పళ్ళు పాయస..మొకవైపూ
ఎగుడు దిగుడుల..లోకమిదీ
వెలుగు చీకటుల..కాలమిదీ
ఎగుడు దిగుడుల..లోకమిదీ
వెలుగు చీకటుల..కాలమిదీ
ఓఓఓఓ..మనిషి..ఈ