Sunday, January 28, 2007

శ్రీ పాండురంగ మహత్యం--1957::రాగమాలిక

















డైరెక్టర్::కామేశ్వర రావ్
సంగీతం::T.V.రాజు
రచన::సముద్రాల రామానుజాచార్య(జునియర్)
గానం::ఘంటసాల

రాగమాలిక !

మోహన రాగం !
హే.....కౄష్ణా.... ముకుందా....మురారీ....
జయకౄషా ముకుందామురారి
జయగోవింద బౄందవిహరీ.. జయదేవకిపంట వసుదేవునింటా 2
యముననునడిరేయి దాటితివంటా 2
వెలసితివంటా నందుని ఇంటా 2
వ్రేపల్లె ఇల్లాయేనంటా...ఆ... జయ

!! కల్యాణి !!
నీ పలుగాకి పనులకు గోపెమ్మ
కోపించి నినురోటబంధించెనంటా
ఊపునబోయీ మ్రాకులకూలిచి 2
శాపాలు బాపితివంటా....ఆ... జయ

ఆరభి రాగం ! 
( సామ )అమ్మా తమ్ముడు మన్నుతినేనూ
చూడమ్మా అని రామన్న తెలుపగా
అన్నాయనిచెవినులిమి యశోద
యేదన్నా నీ నోరుచూపమనగా...ఆ...
చూపితివట నీ నోటను
బాపురే పదునాల్గు భువనభాండమ్ముల
ఆ రూపము గనిన యశోదకు
తాపము నశియించి జన్మ ధన్యత గాంచేన్ !!జయ!!

కాళీయ ఫణిపణ జాలాన ఝణఝణ
కేళీగటించిన గోపకిషోరా 2
కంసాదిదానన గర్వాపహరా 2
హింసావిదూరా పాపవిహారా !!కౄ!!

!! హిందోళం !!

కస్తూరి తిలకం లలాట పలకే
వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం
కరతలే వేణుం కరేకంకణం
సర్వాంగే హరిచందనంచ కలయన్
కంఠేచ ముక్తావళిం గోపశ్రీ పరివేష్టితో ...
విజయతే గోపాల చూడామణి 2
లలిత లలిత మురళీ స్వరాళీ
పిలకిత వనపాళి గోపాళీ 2
మురళికౄత నవరానకేళి 2
వనమాలీ శిఖిపించమౌళీ2
కౄషా మూందా మురారీ !!