Sunday, June 06, 2010

తులాభారం--1974


సంగీతం::సత్యం 
రచన::ఆత్రేయ 
గానం::P.సుశీల
తారాగణం::చలం, శారద,పద్మనాభం,కాంతారావు,రమణారెడ్డి,నిర్మల,రమాప్రభ,శాంతకుమారి

పల్లవి::

ఈ ఊరే నా యిల్లు..ఊరంతా నా వాళ్ళు 
ఉన్నోళ్ళు లేనోళ్ళు..అందరు నా చుట్టాలు
ఈ ఊరే నా యిల్లు..ఊరంతా నా వాళ్ళు 
ఉన్నోళ్ళు లేనోళ్ళు..అందరు నా చుట్టాలు
ఈ ఊరే నా యిల్లు..

చరణం::1

కుమ్మరి సారెలు గిర గిర తిరగాలీ
కమ్మరి కొలిమి కణ కణ లాడాలి..ఓయ్ 
కుమ్మరి సారెలు గిర గిర తిరగాలీ
కమ్మరి కొలిమి కణ కణ లాడాలి 
ముత్తైదువలూ ముగ్గులు వెయ్యాలీ
ముత్తైదువలూ ముగ్గులు వెయ్యాలీ 
యింటింట పండుగలే..ఓయ్
ఈ ఊరే నా యిల్లు..ఊరంతా నా వాళ్ళు

చరణం::2

గోమాత భూమాత మముగన్న మా తల్లులు
ఓయ్..రైతన్న కూలన్న మా అన్నదమ్ముళ్ళు
కొండలు కోనల్లు గోదారి పరవళ్ళు
కొండలు కోనల్లు గోదారి పరవళ్ళు  
కనిపించు దేవుళ్ళు..ఓయ్  
ఈ ఊరే నా యిల్లు..ఊరంతా నా వాళ్ళు 
ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరు నా చుట్టాలు
ఈ ఊరే నా యిల్లు..ఊరంతా నా వాళ్ళు