సంగీతం::R.సుదర్శనం రచన::తోలేటి గానం::P.సుశీల తారాగణం::N.T.రామారావు,S.V.రంగారావు,అంజలీ దేవి,వైజయంతీమాల,నాగయ్య పల్లవి:: ఓంకార నాదస్వరూపా..ఆ ఆ ఆ ఆ భావరాగ తాళప్రదీపా..ఆ ఆ ఆ నాట్యకలాపా..ఆ..నటరాజా నమోనమో..నటరాజా..నమోనమామి ఇలలోసాటిలేని భారతదేశం ఇలలోసాటిలేని భారతదేశం మా దేశం ఇలలోసాటిలేని భారతదేశం కనులకు సుందరం..కళలకు మందిరం మాదేశం సుందరం..కళలకు మందిరం మాదేశం సుందరం..కళలకు మందిరం ఇలలోసాటిలేని..భారతదేశం చరణం::1 పావన హిమశైలం..గౌరి కిరీటం పావన హిమశైలం..గౌరి కిరీటం నిర్మల గంగానది..జీవ ప్రవాహం దక్కను వజ్రాల..పచ్చలహారం దక్కను వజ్రాల..పచ్చలహారం మా కాశ్మీరం..రమ్యారామం మా కాశ్మీరం..రమ్యారామం ఇలలోసాటిలేని..భారతదేశం చరణం::2 భగవద్గీత..ఆ..ఆ..ఆ.. భగవద్గీత..వేదనినాదం గౌతమ బుద్ధుని..జ్ఞానప్రదీపం భగవద్గీత..వేదనినాదం గౌతమబుద్ధుని..జ్ఞానప్రదీపం రామకృష్ణబోధలో..అమృతసారం రామకృష్ణబోధలో..అమృతసారం దేశాల వెదజల్లే..దివ్యప్రదేశం దేశాల వెదజల్లే..దివ్యప్రదేశం ఇలలోసాటిలేని..భారతదేశం మా దేశం..ఇలలోసాటిలేని..భారతదేశం చరణం::3 కాళిదాసకావ్యం జయదేవుని గానం కాళిదాసకావ్యం జయదేవుని గానం అజంత ఎల్లోరా అద్భుతశిల్పం గాంధి రవీంద్రుల..ఘన సందేశం గాంధి రవీంద్రుల..ఘన సందేశం ఖండ ఖండముల..చాటే దేశం ఖండ ఖండముల..చాటే దేశం ఇలలోసాటిలేని..భారతదేశం మా దేశం..ఇలలోసాటిలేని..భారతదేశం
సంగీతం::ఘంటసాల రచన::పింగళి నాగేంద్రరావు గానం::ఘంటసాల, P.సుశీల పల్లవి:: నా సరి నీవని నీ గురి నేనని ఇపుడే తెలిసెనులే తెలిసినదేమో తలచినకొలదీ పులకలు కలిగెనులే నీకూ నాకూ వ్రాసివున్నదని ఎపుడో తెలిసెనులే తెలిసినదేమో తలచినకొలదీ కలవరమాయెనులే నా సరి నీవని నీ గురి నేనని ఇపుడే తెలిసెనులే చరణం::1 నా హృదయమునే వీణజేసుకొని ప్రేమను గానము చేతువనీ నా హృదయమునే వీణజేసుకొని ప్రేమను గానము చేతువనీ నా గానము నా చెవి సోకగనే నా మది నీదై పోవుననీ నీకూ నాకూ వ్రాసి వున్నదని ఎపుడో తెలిసెనులే తెలిసినదేమో తలచినకొలదీ కలవరమాయెనులే నా సరి నీవని నీ గురి నేనని ఇపుడే తెలిసెనులే చరణం::2 నను నీ చెంతకు ఆకర్షించే గుణమే నీలో ఉన్నదనీ నను నీ చెంతకు ఆకర్షించే గుణమే నీలో ఉన్నదనీ ఏ మాత్రము నీ అలికిడి ఐనా నా ఎద దడదడలాడుననీ ఏ మాత్రము నీ అలికిడి ఐనా నా ఎద దడదడలాడుననీ నా సరి నీవని నీ గురి నేనని ఇపుడే తెలిసెనులే తెలిసినదేమో తలచిన కొలదీ కలవరమాయెనులే నా సరి నీవని నీ గురి నేనని ఇపుడే తెలిసెనులే తెలిసినదేమో తలచినకొలదీ పులకలు కలిగెనులే నీకూ నాకూ వ్రాసివున్నదని ఎపుడో తెలిసెనులే తెలిసినదేమో తలచినకొలదీ కలవరమాయెనులే