Friday, March 28, 2014

అభిమన్యుడు--1984



సంగీతం::K.V.మహాదేవన్ 
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం:S.P.:బాలు,P.సుశీల 
తారాగణం::శోభన్‌బాబు,రాధిక,విజయశాంతి,సిల్క్ స్మిత   

పల్లవి::

ఆ..ఆ..ఆహ..హా..అహా..హా
నిసనిస..నిసనిగ..సగ సమా..ఆ..ఆ

శృంగార సీమంతిని
శృంగార సీమంతిని..నా జీవన మందాకిని
నీ కనుసన్న సైయ్యాటలో..నను జీవించనీ..మరణించనీ

శృంగార సీమంతిని..నా జీవన మందాకిని
నీ కనుసన్న సైయ్యాటలో..నను జీవించనీ..మరణించనీ
శృంగార సీమంతిని  

సరిప..గమ గమని సరిప..పమ గపమ
నిసనిస..సమగమ

చరణం::1

నీ హృదయాన మ్రోగాలని రవళించు రాగాన్ని 
నీ గుడిలోన వెలగాలని తపియించు దీపాన్ని

నీ పాద కమలాల పారాణిని..నీ ప్రయణ సన్నిద్ధి పూజారిని
సురలోక వాసిని..సుమ హాసిని
చిరకాలం ఈ చెలిమి చిగురించి పూయని 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
శృంగార సీమంతిని..ఆ..నా జీవన మందాకిని..మ్మ్
నీ కనుసన్న సైయ్యాటలో..ఆ..నను జీవించనీ..మరణించనీ..ఆ

శృంగార సీమంతిని 
పమగా..మపగగమపగ సనిని 
మా..మపదమపద మా గా గా సనిని మాగగ

చరణం::2

నీ రాయంచ గమనానికి పరిచాను పూదారిని
నువు రానున్న శుభవేళకై వేచాను ఒంటరిని
విన్నాను నీ కాలి సవ్వడిని
కన్నాను నీ కాళి కనుదోయిని
కరుణాంతరంగిని..అనురాగిని
నీ అలుకే నా పాళి వరముగా పండనీ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
శృంగార సీమంతిని..ఆ..నా జీవన మందాకిని..మ్మ్
నీ కనుసన్న సైయ్యాటలో..ఆ..నను జీవించనీ..హహ..మరణించనీ..ఆ
శృంగార సీమంతిని
ఆ..అ..ఆ..ఆ..హ..ఆ..హా..ఆహ..హా