Thursday, March 27, 2014

కృష్ణ ప్రేమ--1961



సంగీతం::పెండ్యాలనాగేశ్వరరావు  
రచన::ఆరుద్ర
గానం::జిక్కి, S. వరలక్ష్మి
Film Directed By::Adoorti Subba Rao
తారాగణం::బాలయ్య,జమున, S.వరలక్ష్మి,పద్మనాభం,గిరిజ,రేలంగి

పల్లవి:: 

నవనీతచోరుడు నందకిశోరుడు
అవతారపురుషుడు దేవుడే చెలి
అవతారపురుషుడు దేవుడే

తెలియని మూఢులు కొలిచిననాడు
ఎటువంటివాడు భగవానుడే
ఎటువంటివాడు భగవానుడే

చరణం::1

పసివయసునందే పరిపరివిధముల
ప్రజ్ఞలు చూపిన..మహనీయుడే
ప్రజ్ఞలు చూపిన..మహనీయుడే
హద్దుపద్దులేని ముద్దుల పాపడి
అల్లరికూడా..ఘనకార్యమేనా
అల్లరికూడా..ఘనకార్యమేనా

ఆ..నవనీతచోరుడు నందకిశోరుడు
అవతారపురుషుడు దేవుడే చెలి
అవతారపురుషుడు..దేవుడే

చరణం::2

కోనేట యువతులు స్నానాలు చేయ
కోనేట యువతులు స్నానాలుచేయ
కోకల దొంగ...మొనగాడటే
అహ కోకలదొంగ..మొనగాడటే

పడతులకపుడు పరమార్ధపథము
భక్తిని నేర్పిన..పరమాత్ముడే
భక్తిని నేర్పిన..పరమాత్ముడే

నవనీతచోరుడు నందకిశోరుడు
అవతారపురుషుడు దేవుడే చెలి
అవతారపురుషుడు దేవుడే

చరణం::3

పదునాలుగు జగములు పాలించువాడే..ఏ
పదునాలుగు జగములు పాలించువాడే
ప్రత్యక్ష దైవము..శ్రీకృష్ణుడే
ప్రత్యక్ష దైవము..శ్రీకృష్ణుడే
ఎదురేమిలేని..పదవి లభిస్తే
ఎటువంటివాడు..భగవానుడే
ఎటువంటివాడు..భగవానుడే

ఆడ పెత్తనం --1958



సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::కొసరాజు రాఘవయ్య చౌదరి
గానం::ఘంటసాల,P.సుశీల
Film Directed By::Adoorti Subba Rao
తారాగణం::అక్కినేని, అంజలీ దేవి, కన్నాంబ,రేలంగి, గుమ్మడి, రాజసులోచన, కుటుంబరావు,
ఛాయాదేవి, పెరుమాళ్ళు, అల్లు రామలింగయ్య.

పల్లవి:: 

కావు కావుమను కాకయ్యా
ఈ గంతులెందుకోయ్ కాకయ్యా
నీ కథలు చెప్పవోయ్ కాకయ్యా
వెతలు తీర్చవోయ్ కాకయ్యా
నా వెతలు తీర్చవోయ్ లోకయ్యా

మ్యావ్ మ్యావ్ మను పిల్లెమ్మా
ఒక మాట చెప్పవే పిల్లెమ్మా
మొగమాట మెందుకే పిల్లెమ్మా
సయ్యాట లెందుకే పిల్లెమ్మా
సయ్యాట లెందుకే పుల్లెమ్మా
మ్యావ్ మ్యావ్ మను
కావ్ కావ్ మను

చరణం::1

అమ్మ పురాణం వినేందు కెళ్ళె
అయ్య పొలములో చాకిరి కెళ్ళె
ఓ..ఓ..ఓ..ఓ..ఓ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ 
అమ్మ పురాణం వినేందు కెళ్ళె
అయ్య పొలములో చాకిరి కెళ్ళె
ఒంటి దానినై పోతినిలే
నా ఓళ్ళు వణికి పోతున్నదిలే
కావ్ కావ్ మను
మ్యావ్ మ్యావ్ మను

చరణం::2

ఊ అంటే అది రోకలి పోటు
సూక్ష్మంగా నా మనసుకు నాటు
ఓ..ఓ..ఓ..ఓ..ఓ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ 
ఊ అంటే అది రోకలి పోటు
సూక్ష్మంగా నా మనసుకు నాటు
మూగనోము నీకెందుకులే
నీ ఆగడమంతా తెలిసెనులే
కావ్ కావ్ మను
మ్యావ్ మ్యావ్ మను

కావ్ కావ్ మను కాకయ్యా
ఈ గంతులెండుకోయ్ కాకయ్యా
నీ కథలు చెప్పవోయ్ కాకయ్యా
వెతలు తీర్చవోయ్ కాకయ్యా
నా వెతలు తీర్చవోయ్ లోకయ్యా

చరణం::3

కంటి సైగలతొ కలత పెట్టిన
కోంటె మాటలతొ కొసరి చెప్పిన
ఓ..ఓ..ఓ..ఓ..ఓ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ 
కంటి సైగలతొ కలత పెట్టిన
కోంటె మాటలతొ కొసరి చెప్పిన
అసలు రహస్యమ్ తెలియక పోయినా
అనురాగం..గుర్తించవటోయ్
కావ్ కావ్ మను
మ్యావ్ మ్యావ్ మను

చరణం::4

మన్సులోన..కోరికుంది 
మల్లె తీగె..అడ్డముంది
ఓ..ఓ..ఓ..ఓ..ఓ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ 
మన్సులోన..కోరికుంది 
మల్లె తీగె..అడ్డముంది
తెంపు చేసి చూడబోతె దిక్కు తోచకున్నది
ఫక్కుమంటు నవ్వినా చిక్కు తీసి వెయ్యవే
మ్యావ్ మ్యావ్ మను
కావ్ కావ్ మను
మ్యావ్ మ్యావ్ మను పిల్లెమ్మా
ఒక మాట చెప్పవే పిల్లెమ్మా
మొగమాట మెందుకే పిల్లెమ్మా
సయ్యాట లెందుకే బుల్లెమ్మా
సయ్యాట లెందుకే బుల్లెమ్మా
మ్యావ్ మ్యావ్ మను
కావ్ కావ్ మను
మ్యావ్....
కావ్......

చండీప్రియ-1980





సంగీతం::ఆదినారాయణరావు,సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::శోభన్‌బాబు,జయప్రద,చిరంజీవి. 

పల్లవి::

ఏ వేళనైనా ఒకే కోరికా..ఆ 
ఏ పూవులైనా ఒకే మాలికా..ఆ
ఇలాగే..ఏ..పాడాలి కలకాలం..ఊ
ఇలాగే..ఏ..పాడాలి కలకాలం
ఏ వేళనైనా ఒకే కోరికా..ఆ 
ఏ పూవులైనా ఒకే మాలికా..ఆ

yun hi hum jaayenge jamake janam
yun hi hum jaayenge jamake janam

చరణం::1

అరవిరిసే కనులే కమలాలు
ముసురుకునే..ఏ..కురులే బ్రమరాలు
Milkar Sanam har kadam hum chalenge
Milkar Sanam har kadam hum chalenge
దిగిరావా నీలాల గగనాలు 
ఏ వేళనైన ఒకే కోరికా
ఏ పువులైన ఒకే మాలిక
yun hi hum jaayenge jamake janam
yun hi hum jaayenge jamake janam

చరణం::2

ఆ ఆ ఆ ఆ ఆ ఆ హా ఆ ఆ ఆ హా హా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ ఆ ఆ హా.
khilta hai pyar sa main mere Saajan
Khilta Rahey ab mai aaj sawan
మెరిసే నీ నవ్వులే జల్లులైతే
మెరిసే నీ నవ్వులే జల్లులైతే
పరువాలే శ్రావణ మేఘాలు. 
ఏ వేళనైనా ఒకే కోరికా..ఆ 
ఏ పూవులైనా ఒకే మాలికా..ఆ
yun hi hum jaayenge jamake janam
yun hi hum jaayenge jamake janam

గృహప్రవేశం--1988




సంగీతం::చళ్ళపళ్ళి సత్యం
రచన::జలాది రాజా రావు
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::మోహన్ బాబు , జయసుధ.

పల్లవి::

అభినవ శశిరేఖవో ప్రియతమ శుభలేఖవో
అభినవ శశిరేఖవో ప్రియతమ శుభలేఖవో
ఆ తొలి చూపు కిరణాల నెలవంక నీవో

నవయువ కవిరాజువో ప్రియతమ నెలరాజువో
నా కనుదోయి కమలాల భ్రమరమ్ము నీవో
నవయువ కవిరాజువో ప్రియతమ నెలరాజువో

చరణం::1

ఆ కనులు ఇంద్ర నీలాలుగా
ఈ తనువు చంద్రశిఖరాలుగా కదలాడు కల్యాణివే
నా హృదయం మధుర సంగీతమై
కల్యాణ వీణ స్వరగీతమై శ్రుతి చేయు జతగాడివే

ఆ జతలోన వెతలన్ని చల్లార్చవే
నవయువ కవిరాజువో..అభినవ శశిరేఖవో

చరణం::2

నా వయసు వలపు హరివిల్లుగా
నవపారిజాతాల పొదరిల్లుగా రావోయి రవిశేఖరా
తొలి సంధ్య మధుర మందారమే
నీ నుదిటి తిలక సింగారమై నూరేళ్ళు వెలిగించనా
నా నూరేళ్ళ నెలవళ్ళు కరిగించనా


నవయువ కవిరాజువో ప్రియతమ నెలరాజువో
నా కనుదోయి కమలాల భ్రమరమ్ము నీవో
నవయువ కవిరాజువో ప్రియతమ నెలరాజువో

అభినవ శశిరేఖవో ప్రియతమ శుభలేఖవో
అభినవ శశిరేఖవో ప్రియతమ శుభలేఖవో