Monday, November 12, 2012

కథానాయకురాలు--1971
సంగీతం::A.A.రాజ్ 
రచన::సికరాజు
గానం::L.R.ఈశ్వరి
తారాగణం::శోభన్‌బాబు,వాణిశ్రీ,నాగభూషణం,రాజబాబు,పుష్పకుమారి,జ్యోతిలక్ష్మీ 

పల్లవి::
.
చూడు షరాబీ ఈ లేత గులాబీ..చూడు షరాబీ ఈ లేత గులాబీ 
యౌవన రాగము తొందరచేసే..వయ్యారి సయ్యందిరా..ఆ
చూడు షరాబీ ఈఈఈఈ   

చరణం::1

సింగారి సిగ్గు పొమ్మన్నదీ బంగారు బుగ్గ రమ్మన్నదీ 
విరహాన విరిసి మోహాన మెరిసి మైకములో ఉంది రారా
కోరుకో నీ దాన్నిరా తీరురా నీ దాహమూ కోరుకో నీ దాన్నిరా తీరురా 
నీ దాహమూ మధురమైన సుఖములన్ని మనవేరా..ఆహ్హ హ్హ హ్హా 
చూడు షరాబీ ఈ లేత గులాబీ యౌవన రాగము తొందరచేసే 
వయ్యారి సయ్యందిరా చూడు షరాబీ..ఈఈఈ

చరణం::2

రంగేళి రవ్వ ఈ చిన్నదీ మత్తైన మందులో ఉన్నదీ 
జలతారు బొమ్మ సరదాల గుమ్మ మై మరచి ఉంది రారా  
అందుకో నా విందులు పొందరా ఆనందమూ అందుకో నా విందులు 
పొందరా ఆనందమూ తనివితీర అనుభవించు మనసారా ఆహ్హ హ్హ హ్హా 
చూడు షరాబీ ఈ లేత గులాబీ..చూడు షరాబీ ఈ లేత గులాబీ 
యౌవన రాగము తొందరచేసే..వయ్యారి సయ్యందిరా 
చూడు షరాబీ..ఈఈఈఈ