Sunday, May 29, 2016

సింహబలుడూ--1978




సంగీతం::M.S.విశ్వనాథన్ 
రచన::వీటూరి సుందరరామూర్తి    
గానం::బాలు,L.R.ఈశ్వరీ  
Film Directed By::k.Raghavendra Rao
తారాగణం::N.T.R.వాణిశ్రీ,మోహన్‌బాబు,జయమాలిని,అంజలిదేవి.

పల్లవి::

సన్నజాజులోయ్..కన్నెమోజులోయ్
సన్నజాజులోయ్..కన్నెమోజులోయ్

అల్లిబిల్లి సంతలోన..పిల్ల గాలి జాతరాయే
తళుకు బెళుకు కనవేరా..పాలవెల్లి పుంత కాడ
పైట కొంగు జారిపోయె..పడుచు గొడవ వినవేరా

సన్నజాజులోయ్..కన్నెమోజులోయ్
సన్నజాజులోయ్..కన్నెమోజులోయ్

హా..కన్ను కన్ను..గీటుకుంటె 
సన్న సన్న..మంటరేగే
కలికి చిలుక..ఇటు రావే
హాయ్..హాయ్ 
వళ్ళు వళ్ళు..మీటుతుంటే 
వగలమారి..సెగలు పుట్టె
వలపు పిలుపు..విని పోవే 

చరణం::1

బానిసగా వచ్చావు..నన్నే నీ బానిసగా చేసుకున్నావు
మగతనం చూపావు..నాలో ఆడతనాన్ని నిద్ర లేపావు

రేయి తెల్లారి తెల్లారి పోతున్నదీ..రారా నా దొరా
తీగ అల్లాడి మాల్లాడి పోతున్నదీ..రారా సుందరా

ఒకటున్నది నీలో..ఒడుపున్నది నాలో
అది వున్నది లేనిది తెలుసుకో
హా..మెరుపున్నది నాలో..ఉరుమున్నది నీలో
అది నీదని ఇది నాదని హాయ్..మరిచిపో 

సన్నజాజులోయ్..కన్నెమోజులోయ్
అల్లిబిల్లి సంతలోన..పిల్ల గాలి జాతరాయే
తళుకు బెళుకు..కనవేరా
వళ్ళు వళ్ళు..మీటుతుంటే 
వగలమారి..సెగలు పుట్టె
వలపు పిలుపు..విని పోవే 

చరణం::2 

ఈ ద్వీపానికి..దీపానివి నువ్వు
ఈ లంకకే..నెలవంకవి నువ్వు 

మల్లె పువ్వంటి రవ్వంటి మనసున్నదిలే..మగతోడుందిలే
చింత చిగురంటి పొగరుంది వగరుందిలే..సెగ రేగిందిలే

వలపున్నది నాలో..బలమున్నది నీలో
ఆ పట్టుని ఈ విడుపుని..హాయ్..కోరుకో 
సగమున్నది నాలో..సగమున్నది నీలో
రెంటిని జంటగా మలచుకో..హాయ్

సన్నజాజులోయ్..కన్నెమోజులోయ్
అల్లిబిల్లి సంతలోన పిల్ల గాలి జాతరాయే
తళుకు బెళుకు..కనవేరా
వళ్ళు వళ్ళు..మీటుతుంటే 
వగలమారి..సెగలు పుట్టె
వలపు పిలుపు..విని పోవే 
సన్నజాజులోయ్..కన్నెమోజులోయ్
సన్నజాజులోయ్..కన్నెమోజులోయ్

SimhaBaludu--1978
Music::M.S.Viswanathan
Lyrics::Veetoori Sundararaamoorti
Singer's::S.P.Baalu,L.R.Iswari
Film Directed By::K.Raghavendra Rao
Cast::N.T.R. Vanisri,Mohanbabu,Jayamaalini,Anjalidevi.

::::::::::::::::::

sannajaajulOy..kannemOjulOy
sannajaajulOy..kannemOjulOy

allibilli santalOna..pilla gaali jaataraaye
taLuku beLuku kanavEraa..paalavelli punta kaaDa
paiTa kongu jaaripOye..paDuchu goDava vinavEraa

sannajaajulOy..kannemOjulOy
sannajaajulOy..kannemOjulOy

haa..kannu kannu..geeTukunTe 
sanna sanna..manTarEgE
kaliki chiluka..iTu raavE
haay..haay 
vaLLu vaLLu..meeTutunTE 
vagalamaari..segalu puTTe
valapu pilupu..vini pOvE 

::::1

baanisagaa vachchaavu..nannE nee baanisagaa chEsukunnaavu
magatanam choopaavu..naalO aaDatanaanni nidra lEpaavu

rEyi tellaari tellaari pOtunnadii..raaraa naa doraa
teega allaaDi maallaaDi pOtunnadii..raaraa sundaraa

okaTunnadi neelO..oDupunnadi naalO
adi vunnadi lEnidi telusukO
haa..merupunnadi naalO..urumunnadi neelO
adi needani idi naadani haay..marichipO 

sannajaajulOy..kannemOjulOy
allibilli santalOna..pilla gaali jaataraaye
taLuku beLuku..kanavEraa
vaLLu vaLLu..meeTutunTE 
vagalamaari..segalu puTTe
valapu pilupu..vini pOvE 

::::2 

ii dveepaaniki..deepaanivi nuvvu
ii lankakE..nelavankavi nuvvu 

malle puvvanTi ravvanTi manasunnadilE..magatODundilE
chinta chiguranTi pogarundi vagarundilE..sega rEgindilE

valapunnadi naalO..balamunnadi neelO
aa paTTuni ii viDupuni..haay..kOrukO 
sagamunnadi naalO..sagamunnadi neelO
renTini janTagaa malachukO..haay

sannajaajulOy..kannemOjulOy
allibilli santalOna pilla gaali jaataraaye
taLuku beLuku..kanavEraa
vaLLu vaLLu..meeTutunTE 
vagalamaari..segalu puTTe
valapu pilupu..vini pOvE 
sannajaajulOy..kannemOjulOy
sannajaajulOy..kannemOjulOy